DEPwD | హైదరాబాద్ దివ్యాంగుల శాఖలో 83 ప్రభుత్వ ఉద్యోగాలు.. రాతపరీక్ష లేకుండానే..
DEPwD | హైదరాబాద్ (Hyderabad) జిల్లా దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్, ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల సాధికారత శాఖ (DEPwD) బ్యాక్‌లాగ్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్-4, క్లాస్-4 విభాగాల్లో ఈ నియామకాలు చేపడుతున్నది.
DEPwD | త్రినేత్ర న్యూస్: హైదరాబాద్ (Hyderabad) జిల్లా దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్, ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల సాధికారత శాఖ (DEPwD) బ్యాక్‌లాగ్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్-4, క్లాస్-4 విభాగాల్లో ఈ నియామకాలు చేపడుతున్నది. మొత్తం 83 ఖాళీలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. అర్హులైన దివ్యాంగ అభ్యర్థులు డిసెంబర్ 27 వరకు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి రాతపరీక్ష లేకుండా విద్యార్హత మార్కులు, కంప్యూటర్ నాలెడ్జ్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మొత్తం ఖాళీలు: 83
జూనియర్ అసిస్టెంట్- 3, లైబ్రేరియన్ గ్రేడ్-3- 1, ల్యాబ్ అటెండర్- 1, ఆఫీస్ సబార్డినేట్- 16, వాచ్‌మన్- 8, గేట్ పోర్టర్- 4, కమాటి- 8, అసిస్టెంట్ ధోబీ- 4, స్వీపర్- 11, స్కావెంజర్- 2. కుక్- 1, ఆయా- 1, ఫిమేల్ వార్డ్ అటెండెంట్- 1, జూనియర్ లిఫ్ట్ అటెండర్- 2
అర్హత
పోస్టులను బట్టి డిగ్రీ, ఇంటర్మీడియట్, ఐటీఐ, ఏడో తరగతి, ఐదో తరగతి లేదా చదవడం, రాయడం తెలిసి ఉండాలి. 40 శాతం లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం కలిగిన అభ్యర్థులు అర్హులు. వినికిడి లోపం ఉన్నవారికి 75 శాతం వైకల్యం తప్పనిసరి. అభ్యర్థులు 18-54 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం
విద్యార్హత మార్కులు, కంప్యూటర్ ప్రావీణ్యం, వయసు, వైకల్యం శాతం ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా
చిరునామా: అసిస్టెంట్ డైరెక్టర్, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్, ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల సాధికారత శాఖ, బ్లాక్ M4, మంజీరంజన్ కాంప్లెక్స్, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, ఎంజే. రోడ్, నాంపల్లి, హైదరాబాద్-500001.
దరఖాస్తులకు చివరి తేదీ: 2026 డిసెంబర్ 27
వెబ్‌సైట్: https://hyderabad.telangana.gov.in/
మరిన్ని వివరాలకు..
తాజావార్తలు
- ●Horoscope | నవంబర్ 28 రాశిఫలాలు.. కుటుంబ సభ్యులతో అపార్థాలు రావచ్చు!
- ●M Revanth Reddy | పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక పాలసీ..
- ●MLC Dasoju | ‘హీరోస్ ఆఫ్ హైదరాబాద్’ అవార్డులు ప్రదానం చేసిన ఎమ్మెల్సీ దాసోజు
- ●Gurrala Nagaraju | తెలంగాణ గ్లోబల్ సమ్మిట్లో దక్షిణాఫ్రికా ప్రతినిధిగా గూర్రాల నాగరాజు
- ●Crime News | అండదానం ముసుగులో అక్రమ నెట్వర్క్!
- ●Dy CM Bhatti Vikramarka | తెలంగాణ విద్యుత్ రంగానికి కేంద్రం సహకరించాలి

Horoscope | నవంబర్ 28 రాశిఫలాలు.. కుటుంబ సభ్యులతో అపార్థాలు రావచ్చు!

M Revanth Reddy | పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక పాలసీ..

MLC Dasoju | ‘హీరోస్ ఆఫ్ హైదరాబాద్’ అవార్డులు ప్రదానం చేసిన ఎమ్మెల్సీ దాసోజు

Gurrala Nagaraju | తెలంగాణ గ్లోబల్ సమ్మిట్లో దక్షిణాఫ్రికా ప్రతినిధిగా గూర్రాల నాగరాజు




