త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MLC Dasoju | ‘హీరోస్‌ ఆఫ్‌ హైదరాబాద్‌’ అవార్డులు ప్ర‌దానం చేసిన ఎమ్మెల్సీ దాసోజు

MLC Dasoju | నగర అభివృద్ధి, ప్రగతికి వివిధ రంగాల్లో విశేష కృషి చేస్తున్న ప్రతిభావంతులకు ‘హీరోస్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ అవార్డ్స్‌–2026’ (సీజన్‌–3) ప్రదానం చేశారు. ట్రయంఫ్స్‌ ఆఫ్‌ టాలెంట్‌ (ToT) ఆధ్వర్యంలో కోకాపేటలోని టవారో రిసార్ట్స్‌లో ఈ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు.

P

Hyderabad | Published On Nov 27, 2026, 11.10 pm IST

MLC Dasoju | ‘హీరోస్‌ ఆఫ్‌ హైదరాబాద్‌’ అవార్డులు ప్ర‌దానం చేసిన ఎమ్మెల్సీ దాసోజు
Advertisement

MLC Dasoju | నగర అభివృద్ధి, ప్రగతికి వివిధ రంగాల్లో విశేష కృషి చేస్తున్న ప్రతిభావంతులకు ‘హీరోస్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ అవార్డ్స్‌–2026’ (సీజన్‌–3) ప్రదానం చేశారు. ట్రయంఫ్స్‌ ఆఫ్‌ టాలెంట్‌ (ToT) ఆధ్వర్యంలో కోకాపేటలోని టవారో రిసార్ట్స్‌లో ఈ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి 300 మందికి పైగా ప్రముఖులు హాజరయ్యారు. మొత్తం 11 విభాగాల్లో 60 మందికి పైగా ప్రతిభావంతులను అవార్డులతో సత్కరించారు. కార్పొరేట్‌, టెక్నాలజీ, వైద్య ఆరోగ్యం, పారిశ్రామిక రంగం, విద్యా రంగం, కళలు, సామాజిక సేవ తదితర విభాగాల్లో విశేష సేవలందిస్తున్న వారిని ఈ సందర్భంగా గుర్తించి పురస్కారాలు అందజేశారు.

హైదరాబాద్‌ నగర అభివృద్ధి, ప్రత్యేక గుర్తింపు, ప్రగతికి తమవంతు కృషి చేస్తున్న మార్గదర్శకులు, మార్పుకు నాంది పలుకుతున్న వ్యక్తులను ఒకే వేదికపైకి తీసుకురావడం ఈ కార్యక్రమం ప్రత్యేకతగా నిలిచింది. ఈ వేడుకకు హాజరైన ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌ కుమార్‌ పలువురు విశిష్ట వ్యక్తులకు స్వయంగా అవార్డులు ప్రదానం చేశారు. వివిధ రంగాల్లో ప్రతిభ చూపుతూ నగర అభివృద్ధికి తోడ్పడుతున్న వారిని ఒకే వేదికపై సత్కరించడం స్ఫూర్తిదాయకంగా ఉందని పేర్కొన్నారు. అవార్డులు అందుకున్న వారందరికీ అభినందనలు తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ట్రయంఫ్స్‌ ఆఫ్‌ టాలెంట్‌ (ToT) బృందానికి, ముఖ్యంగా మహమ్మద్‌ ఫయాజ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్‌ అభివృద్ధిలో భాగస్వాములవుతున్న ప్రతిభావంతులను గుర్తించి గౌరవించడం అభినందనీయమని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌ కుమార్‌ పేర్కొన్నారు.

Advertisement
Advertisement