Parliament | పార్లమెంట్ ప్రత్యేక భేటీపై దుమారం.. విపక్షాల విమర్శలకు రిజిజు కౌంటర్
Parliament | కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ నెల 30 నుంచి డిసెంబర్ 3 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమైంది. అయితే, ఈ స్పెషల్ సెషన్‌పై రాజకీయ దుమారం చెలరేగింది. సమావేశాల ఏర్పాటు నిబంధనలకు విరుద్ధమంటూ కేంద్రంపై విమర్శలు ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. విపక్ష ఎంపీలు చేస్తున్న ఆరోపణలను కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఖండించారు.
Parliament | కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ నెల 30 నుంచి డిసెంబర్ 3 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమైంది. అయితే, ఈ స్పెషల్ సెషన్‌పై రాజకీయ దుమారం చెలరేగింది. సమావేశాల ఏర్పాటు నిబంధనలకు విరుద్ధమంటూ కేంద్రంపై విమర్శలు ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. విపక్ష ఎంపీలు చేస్తున్న ఆరోపణలను కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఖండించారు. కీలకమైన శాసనపరమైన అంశాలపై చర్చించేందుకే ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. పార్లమెంట్‌ను సమావేశపరిచే అధికారం ప్రభుత్వానికి ఉందని, గతంలోనూ ఇలాంటి సందర్భాలు ఉన్నాయని గుర్తుచేశారు. నవంబర్ 30 నుంచి డిసెంబర్ 3 తేదీల్లో రాజ్యసభ సమావేశాలు కూడా జరుగుతాయని.. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్‌కు సమాచారం అందించినట్లు రిజిజు తెలిపారు. ఈ సమావేశాల్లో కీలకమైన శాసనపరమైన కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీల నేతలతోనూ మాట్లాడినట్లు వెల్లడించారు.
ఆ వ్యాఖ్యల్లో వాస్తవం లేదు..
ప్రత్యేక సమావేశాలపై కొందరు ఎంపీలు సోషల్ మీడియా, ఇతర వేదికల ద్వారా చేస్తున్న విమర్శల్లో వాస్తవం లేదని రిజిజు పేర్కొన్నారు. పార్లమెంట్ సమావేశాల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వానికి పూర్తి అధికారం ఉందన్నారు. గతంలోనూ ఒక సమావేశాన్ని అధికారికంగా ముగించకుండానే మరో సమావేశాన్ని నిర్వహించిన సందర్భాలు ఉన్నాయని చెప్పారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఇదేమీ కొత్త విషయం కాదని స్పష్టం చేశారు. ప్రత్యేక సమావేశాలను రాజ్యాంగ విరుద్ధంగా పేర్కొనడం, శీతాకాల సమావేశాలను ముందుగానే ముగించాలంటూ మాట్లాడటం సరికాదని విపక్ష ఎంపీలకు హితవు పలికారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు ఆధారాలు లేకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదన్నారు.
చర్చల్లో పాల్గొనండి..
పార్లమెంట్ అనేది ప్రజా సమస్యలు, దేశానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించేందుకు ఉన్న వేదిక అని రిజిజు పేర్కొన్నారు. ప్రత్యేక సమావేశాలకు అన్ని పార్టీల నేతలు, ఎంపీలు హాజరై చర్చల్లో చురుగ్గా పాల్గొనాలని కోరారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లులు, ఇతర అంశాలపై సభలో సమగ్రంగా చర్చించాలని సూచించారు. ఇక ఈ ప్రత్యేక సమావేశాల్లో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లు ప్రవేశపెడతారన్న ఊహాగానాలపైనా రిజిజు స్పందించారు. ఏయే బిల్లులను సభ ముందుకు తీసుకొస్తారనే వివరాలను తర్వాత వెల్లడిస్తామని తెలిపారు. అయితే, గతంలో కేంద్రం తీసుకువచ్చిన ఈ బిల్లులు తిరస్కారానికి గురైన విషయం తెలిసిందే. తాజాగా రాజ్యసభలో పలు పార్టీలకు చెందిన సభ్యులు చేయడంతో బీజేపీ బలం పెరిగింది. ఈ క్రమంలో ఆ పార్టీ మరోసారి సభ ముందుకు ఈ రెండు కీలక బిల్లులను తీసుకువచ్చేందుకు సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ సహా పలు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో కేంద్రంలోని బీజేపీ సర్కారు రెండు బిల్లులను ప్రత్యేక సమావేశాల్లో సభ ముందుకు తీసుకువస్తున్నట్లుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
#WATCH | Delhi: On speculations about the Delimitation Bill to be tabled during Parliament’s Special Session, Union Parliamentary Affairs Minsiter Kiren Rijiju says, "I will provide details later regarding the specific bills to be introduced during the session. For now, I can inform you that we are bringing forward very significant business, and all Members of Parliament should participate constructively. The world is watching—India is the largest democracy—and it is our duty to conduct these parliamentary sessions with a sense of responsibility."
— ANI (@ANI) November 27, 2026
తాజావార్తలు
- ●Kodangal Land Scam | సీఎం ఇలాకాలో రూ.60 కోట్ల భూస్కాం.. బినామీల నుంచి 50 శాతం కమీషన్!
- ●HDFC Bank | హెచ్డీఎఫ్సీ కస్టమర్లకు అప్డేట్.. రూ.500లోపు యూపీఐ చెల్లింపులపై కీలక మార్పు..
- ●Supreme Court | ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయసు తగ్గింపుపై పిటిషన్.. విచారణకు సుప్రీం నో
- ●Instagram For TV | టీవీలోనూ ఇన్స్టాగ్రామ్.. ఇక పెద్ద స్క్రీన్‌పై రీల్స్..
- ●Samantha | కోలీవుడ్ బ్లాక్‌బస్టర్ సీక్వెల్లో సమంత - కమ్‌బ్యాక్ అప్పుడేనా?
- ●Self Employed Indians | పింఛన్, ఈపీఎఫ్ లేవు.. రిటైర్మెంట్ ఆదాయం ఎలా పొందాలి?

Kodangal Land Scam | సీఎం ఇలాకాలో రూ.60 కోట్ల భూస్కాం.. బినామీల నుంచి 50 శాతం కమీషన్!

HDFC Bank | హెచ్డీఎఫ్సీ కస్టమర్లకు అప్డేట్.. రూ.500లోపు యూపీఐ చెల్లింపులపై కీలక మార్పు..

Supreme Court | ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయసు తగ్గింపుపై పిటిషన్.. విచారణకు సుప్రీం నో

Instagram For TV | టీవీలోనూ ఇన్స్టాగ్రామ్.. ఇక పెద్ద స్క్రీన్‌పై రీల్స్..






