Stunts | లగ్జరీ కారుతో ప్రమాదకర స్టంట్స్.. చిక్కుల్లో మాజీ అండర్‌వరల్డ్ డాన్ కొడుకు
Stunts | దేశంలో కొందరు ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. నడిరోడ్డుపై వాహనాలతో ప్రమాదకర స్టంట్స్ (Stunts) ప్రదర్శిస్తూ తోటి ప్రయాణికులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు.
Stunts | దేశంలో కొందరు ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. నడిరోడ్డుపై వాహనాలతో ప్రమాదకర స్టంట్స్ (Stunts) ప్రదర్శిస్తూ తోటి ప్రయాణికులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. తాజాగా తన ఖరీదైన లాంబోర్గినీ కారుతో రోడ్డుపై ప్రమాదకర స్టంట్స్ ప్రదర్శించి మాజీ అండర్ వరల్డ్ డాన్ కుమారుడు చిక్కుల్లో పడ్డాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాజీ అండర్ వరల్డ్ డాన్ ముత్తప్ప రాయ్ (underworld don Muthappa Rai) కుమారుడు రికీ రాయ్ (Ricky Rai) ఆదివారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో తన లంబోర్గిని హురాకాన్ కారుతో రోడ్డుపై ప్రమాదకర స్టంట్స్ చేశాడు. ఆదివారం అర్ధరాత్రి 2.00 గంటల సమయంలో బెంగళూరు (Bengaluru) నగరంలోని అనిల్ కుంబ్లే జంక్షన్ వద్ద రికీ ఈ స్టంట్స్ చేసినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వీడియోల ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిర్లక్ష్య పూరిత డ్రైవింగ్, ఇతరులను ప్రమాదంలోకి నెట్టడం వంటి అభియోగాలను మోపారు. ఈ కారు ముత్తప్ప రాయ్ కుమారుడు రికీ రాయ్ నివాసంలో ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు విచారణకు రావాల్సిందిగా రికీ రాయ్‌కి పోలీసులు నోటీసులు ఇచ్చారు. కారును కూడా సీజ్ చేశారు. అయితే, ఈ కారును రికీయే నడిపాడా..? లేక మరెవరైనా నడిపారా..? అన్నదానిపై స్పష్టతలేదు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read..
త్వరలో మంత్రివర్గ విస్తరణ.. కేబినెట్ నుంచి ఇద్దరు ఔట్?
ఇనాక్టివ్ ఖాతాలపై ఈపీఎఫ్‌వో కీలక నిర్ణయం.. క్లెయిమ్ లేకుండానే డబ్బులు ఖాతాల్లోకి..
హరీశ్‌రావు ఆరోపణలు నిరాధారం.. ఫిలిఫైన్స్‌కు బియ్యం ఎగుమతిపై మంత్రి ఉత్తమ్ వివరణ
తాజావార్తలు
- ●JP Nadda | దేశానికే ఆదర్శంగా బీబీనగర్ ఎయిమ్స్ : కేంద్రమంత్రి జేపీ నడ్డా
- ●Jana Nayagan | దళపతి విజయ్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ - జననాయగన్ సెన్సార్ కంప్లీట్ - మూడు గంటల రన్టైమ్తో రిలీజ్
- ●China Floods | చైనాలో వరద బీభత్సం: నీటిలో కొట్టుకొచ్చిన 900 విష సర్పాలు.. పాముకాటుతో మహిళ మృతి
- ●Bhatti Vikramarka | రైతు భరోసాకు మరో రూ.1,900 కోట్లు.. ఖమ్మం సభలో డిప్యూటీ భట్టి ప్రకటన
- ●Damodara nd Vivek | ఈఎస్ఐ డిస్పెన్సరీ సేవలు మరింత బలోపేతం చేస్తున్నాం
- ●El Nino Impact Telangana | ఎల్‌నినో టెన్షన్ వద్దు.. ఈ పంటలే ముద్దు!

JP Nadda | దేశానికే ఆదర్శంగా బీబీనగర్ ఎయిమ్స్ : కేంద్రమంత్రి జేపీ నడ్డా

Jana Nayagan | దళపతి విజయ్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ - జననాయగన్ సెన్సార్ కంప్లీట్ - మూడు గంటల రన్టైమ్తో రిలీజ్

China Floods | చైనాలో వరద బీభత్సం: నీటిలో కొట్టుకొచ్చిన 900 విష సర్పాలు.. పాముకాటుతో మహిళ మృతి

Bhatti Vikramarka | రైతు భరోసాకు మరో రూ.1,900 కోట్లు.. ఖమ్మం సభలో డిప్యూటీ భట్టి ప్రకటన






