Cabinet Expansion | త్వరలో మంత్రివర్గ విస్తరణ.. కేబినెట్ నుంచి ఇద్దరు ఔట్?
Cabinet Expansion | కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు దాటిపోయినా పూర్తిస్థాయిలో మంత్రివర్గ విస్తరణ (Cabinet Expansion) జరగలేదు. అయితే అసెంబ్లీ సమావేశాలు ముగిశాక మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ చేపట్టనున్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఖాళీగా ఉన్న రెండు మంత్రి పదవులను భర్తీ చేసే అంశంపై కసరత్తు చేస్తున్నారు.
త్రినేత్ర.న్యూస్: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు దాటిపోయినా పూర్తిస్థాయిలో మంత్రివర్గ విస్తరణ (Cabinet Expansion) జరగలేదు. అయితే అసెంబ్లీ సమావేశాలు ముగిశాక మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ చేపట్టనున్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఖాళీగా ఉన్న రెండు మంత్రి పదవులను భర్తీ చేసే అంశంపై కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే పదవిలో ఉన్న మంత్రుల్లో పలువురికి ఉద్వాసన పలికే అవకాశం ఉందని నాయకులు చర్చించుకుంటున్నారు. మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి ఆది శ్రీనివాస్(AAdi Srinivas)కు మంత్రివర్గంలో చోటు కల్పిస్తారని సమాచారం. లేదంటే చీఫ్ విప్ పదవి కట్టబెడతారని ప్రచారం సాగుతోంది. మంత్రి పదవి ఆశిస్తూ వస్తున్న రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) కి మంత్రివర్గంలో పదవి దక్కే అవకాశం కనిపిస్తోంది. లంబాడీల కోటా కింద ప్రభుత్వ విప్‌గా ఉన్న రామచంద్రనాయక్ (Ramachandru Nayak), దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్‌లలో ఎవరో ఒకరిని కేబినెట్‌లోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
వారిపై అధిష్టానం అసంతృప్తి..
కొందరు మంత్రులపై అధిష్ఠానం అసంతృప్తిగా ఉన్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. పార్టీ నిబంధనలకు కట్టుబడకపోవడం, ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉండకపోవడం, వర్గాలను పెంచి పోషించడం వంటి ఆరోపణలే కారణంగా వినిపిస్తున్నాయి. ఇద్దరు, ముగ్గురు మంత్రులకు ఉద్వాసన ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో అంతర్గత ఇబ్బందులు రాకుండా పార్టీ హైకమాండ్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. డిప్యూటీ స్పీకర్ కోసం కూడా ఎవరిని ఎంపిక చేయాలనే అంశంపై ఆలోచిస్తున్నట్లు సమాచారం. కాగా ఎవరిని కొత్తగా చేర్చుకుంటారన్న అంశంపై ఇప్పటికైతే స్పష్టత లేదు.
అజారుద్దీన్‌కు దక్కని ఎమ్మెల్సీ..
అజారుద్దీన్ ప్రజాప్రతినిధి కాకపోయినప్పటికీ ఏఐసీసీ సూచనల మేరకు మంత్రివర్గంలో చోటు కల్పించారు. వచ్చే ఏప్రిల్ 30లోపు ఆయన ఎమ్మెల్సీగా ఎన్నిక కానట్లయితే మంత్రి పదవి నుంచి దూరం కాకతప్పదు. ఆలోపు ఏదో ఒక విధంగా సర్దుబాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
తాజావార్తలు
- ●Minister Ponnam | సమస్యల పరిష్కారం కోసం కొండా సురేఖను కలిసిన మంత్రి పొన్నం..
- ●The Furious Review | ది ఫ్యూరియస్ రివ్యూ - లోకేష్ కనగరాజ్ ఖైదీతో కంపేరిజన్స్ - యాక్షన్ లవర్స్ మిస్సవ్వొద్దు
- ●Medigadda Barrage | మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల.. ఆ మూడు లిఫ్టులు వాడితేనే సేఫ్ : రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం కీలక సలహా
- ●JP Nadda | దేశానికే ఆదర్శంగా బీబీనగర్ ఎయిమ్స్ : కేంద్రమంత్రి జేపీ నడ్డా
- ●Jana Nayagan | దళపతి విజయ్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ - జననాయగన్ సెన్సార్ కంప్లీట్ - మూడు గంటల రన్టైమ్తో రిలీజ్
- ●China Floods | చైనాలో వరద బీభత్సం: నీటిలో కొట్టుకొచ్చిన 900 విష సర్పాలు.. పాముకాటుతో మహిళ మృతి

Minister Ponnam | సమస్యల పరిష్కారం కోసం కొండా సురేఖను కలిసిన మంత్రి పొన్నం..

The Furious Review | ది ఫ్యూరియస్ రివ్యూ - లోకేష్ కనగరాజ్ ఖైదీతో కంపేరిజన్స్ - యాక్షన్ లవర్స్ మిస్సవ్వొద్దు

Medigadda Barrage | మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల.. ఆ మూడు లిఫ్టులు వాడితేనే సేఫ్ : రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం కీలక సలహా

JP Nadda | దేశానికే ఆదర్శంగా బీబీనగర్ ఎయిమ్స్ : కేంద్రమంత్రి జేపీ నడ్డా





