Uttam Kumar Reddy | హరీశ్‌రావు ఆరోపణలు నిరాధారం.. ఫిలిఫైన్స్‌కు బియ్యం ఎగుమతిపై మంత్రి ఉత్తమ్ వివరణ
Uttam Kumar Reddy | ఫిలిఫైన్స్‌కు బియ్యం ఎగుమతిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు చేసిన ఆరోపణలన్నీ పూర్తిగా నిరాధారమని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
Uttam Kumar Reddy | త్రినేత్ర.న్యూస్ : ఫిలిఫైన్స్‌కు బియ్యం ఎగుమతిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు చేసిన ఆరోపణలన్నీ పూర్తిగా నిరాధారమని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఫిలిఫైన్స్‌కు బియ్యం ఎగుమతి వెనుకాల స్కాం జరిగిందన్న హరీశ్‌రావు ఆరోపణలకు మంత్రి ఉత్తమ్ సమాధానం ఇచ్చారు.
హరీశ్‌రావు చేసిన ఆరోపణలు నిరాధారం. ఇలాంటి ఆరోపణలు చేసి సభను తప్పుదోవ పట్టించొద్దు. ప్రేమ్‌చంద్ గార్గ్ అనే వ్యక్తికి ఫిలిఫైన్స్‌కు బియ్యం ఎగుమతికి ఎలాంటి సంబంధం లేదు. ఇది గవర్నమెంట్ టూ గవర్నమెంట్ ట్రాన్సక్షన్. ఎంవోయూపై తెలంగాణ, ఫిలిఫైన్స్ ప్రభుత్వాలు సంతకాలు చేశాయి. 10 లక్షల మెట్రిక్ టన్నులకు ఎంవోయూ కుదిరింది. ముందు రెండు షిప్‌లు పోయాక.. ఆ దేశం యొక్క ప్రెసిడెంట్ మీద ఇష్యూ అయింది. ఆ దేశ అంతర్గత సమస్యల వల్ల ఒక షిప్ వెళ్లలేదు. ఆలోపే ఫిలిఫైన్స్ గవర్నమెంట్ ఇంటర్నేషనల్ ఇంపోర్టుపై బ్యాన్ విధించారు. కానీ మన బియ్యాన్ని దిగుమతి చేసుకునేందుకు ముందుకు వచ్చింది. త్వరలోనే బియ్యాన్ని ఎగుమతి చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
ఇక్కడ మధ్యవర్తిత్వం లేదు. షిప్పింగ్ చార్జీలు, గోడౌన్ ఛార్జీలు, ఇన్సూరెన్స్ అన్నీ కూడా ఫిలిఫైన్స్ గవర్నమెంట్ చూసుకుంటుంది. తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. ఇక దేశంలోనే తెలంగాణ మొదటిసారిగా ఫిలిఫైన్స్‌కు బియ్యం ఎగుమతి చేసింది. హెలికాప్టర్ కాదు.. నేను యుద్ధ విమానం మీద సుదీర్ఘంగా ప్రయాణించానని మంత్రి ఉత్తమ్ తెలిపారు.
ఈ ఖరీప్ సీజన్‌లో 71.86 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించి రికార్డు సృష్టించాం. రైతులు పండించే ప్రతి గింజను కొనుగోలు చేస్తుంది కనీస మద్దతు ధరకు. బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే ఎక్కువ ప్రోక్యూర్ చేశామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
తాజావార్తలు
- ●Minister Ponnam | సమస్యల పరిష్కారం కోసం కొండా సురేఖను కలిసిన మంత్రి పొన్నం..
- ●The Furious Review | ది ఫ్యూరియస్ రివ్యూ - లోకేష్ కనగరాజ్ ఖైదీతో కంపేరిజన్స్ - యాక్షన్ లవర్స్ మిస్సవ్వొద్దు
- ●Medigadda Barrage | మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల.. ఆ మూడు లిఫ్టులు వాడితేనే సేఫ్ : రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం కీలక సలహా
- ●JP Nadda | దేశానికే ఆదర్శంగా బీబీనగర్ ఎయిమ్స్ : కేంద్రమంత్రి జేపీ నడ్డా
- ●Jana Nayagan | దళపతి విజయ్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ - జననాయగన్ సెన్సార్ కంప్లీట్ - మూడు గంటల రన్టైమ్తో రిలీజ్
- ●China Floods | చైనాలో వరద బీభత్సం: నీటిలో కొట్టుకొచ్చిన 900 విష సర్పాలు.. పాముకాటుతో మహిళ మృతి

Minister Ponnam | సమస్యల పరిష్కారం కోసం కొండా సురేఖను కలిసిన మంత్రి పొన్నం..

The Furious Review | ది ఫ్యూరియస్ రివ్యూ - లోకేష్ కనగరాజ్ ఖైదీతో కంపేరిజన్స్ - యాక్షన్ లవర్స్ మిస్సవ్వొద్దు

Medigadda Barrage | మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల.. ఆ మూడు లిఫ్టులు వాడితేనే సేఫ్ : రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం కీలక సలహా

JP Nadda | దేశానికే ఆదర్శంగా బీబీనగర్ ఎయిమ్స్ : కేంద్రమంత్రి జేపీ నడ్డా






