Nvidia | ఎన్విడియా షేర్లకు భారీ షాక్.. రెండు రోజుల్లో 470 బిలియన్ డాలర్ల నష్టం..
Nvidia | చైనా గూఢచర్య ఆరోపణలతో ఎన్విడియా కంపెనీ షేర్లు భారీగా పడిపోతున్నాయి. సీఈఓ జెన్సన్ హువాంగ్‌కు చైనా వ్యాపారవేత్తతో సంబంధాలున్నాయనే ఆరోపణలు పెట్టుబడిదారుల్లో ఆందోళన పెంచాయి. మంగళవారం షేరు ధర 5.53 శాతం పడిపోవడంతో కంపెనీ మార్కెట్ విలువ సుమారు 4.07 ట్రిలియన్ డాలర్లకు చేరింది. ఈ పరిణామంతో మైక్రోసాఫ్ట్ మరోసారి ప్రపంచంలో రెండో అత్యంత విలువైన కంపెనీగా నిలిచింది.
Nvidia | చైనా గూఢచర్య ఆరోపణలతో ఎన్విడియా కంపెనీ షేర్లు భారీగా పడిపోతున్నాయి. సీఈఓ జెన్సన్ హువాంగ్‌కు చైనా వ్యాపారవేత్తతో సంబంధాలున్నాయనే ఆరోపణలు పెట్టుబడిదారుల్లో ఆందోళన పెంచాయి. మంగళవారం షేరు ధర 5.53 శాతం పడిపోవడంతో కంపెనీ మార్కెట్ విలువ సుమారు 4.07 ట్రిలియన్ డాలర్లకు చేరింది. ఈ పరిణామంతో మైక్రోసాఫ్ట్ మరోసారి ప్రపంచంలో రెండో అత్యంత విలువైన కంపెనీగా నిలిచింది.
అమెరికా చిప్ తయారీ దిగ్గజం ఎన్విడియా షేర్ల పతనం కొనసాగుతోంది. కేవలం రెండు ట్రేడింగ్ సెషన్లలో కంపెనీ మార్కెట్ విలువ 470 బిలియన్ డాలర్ల మేర తగ్గే పరిస్థితి ఏర్పడింది. మంగళవారం నాస్‌డాక్‌లో ఎన్విడియా షేరు 5.53 శాతం నష్టపోయి 168.7956 డాలర్ల వద్ద ముగిసింది. అంతకుముందు ముగింపు ధర 178.67 డాలర్లుగా ఉండగా, నవంబర్ 6న షేరు ధర 186.64 డాలర్ల వద్ద ఉంది. తాజా పతనంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు 4.07 ట్రిలియన్ డాలర్లకు పరిమితమైంది. మరోవైపు, మైక్రోసాఫ్ట్ మార్కెట్ విలువలో ఎన్విడియాను అధిగమించి ప్రపంచంలో రెండో అత్యంత విలువైన కంపెనీ స్థానాన్ని తిరిగి దక్కించుకుంది.
చైనా గూఢచర్య ఆరోపణలతో కలకలం..
సింగపూర్‌కు చెందిన వ్యాపారవేత్త ఆలిస్ హువాంగ్‌తో ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్‌కు సంబంధాలున్నాయనే వార్తలు ఈ వివాదానికి కేంద్రంగా మారాయి. ఆలిస్ హువాంగ్‌కు చైనా నిఘా వర్గాలతో సంబంధాలున్నాయనే ఆరోపణలు రావడంతో కంపెనీపై ఒత్తిడి పెరిగింది. అలాగే ఎన్విడియా చిప్స్ చైనా కంపెనీలకు ఎలా చేరుతున్నాయనే అంశంపైనా ప్రశ్నలు తలెత్తాయి. ఈ ఆరోపణలపై ఎన్విడియా బోర్డు స్వతంత్ర దర్యాప్తు ప్రారంభించింది. అమెరికా చట్టసభ సభ్యులు సైతం జెన్సన్ హువాంగ్ నుంచి వివరాలు కోరారు. అయితే అమెరికా జాతీయ భద్రతకు లేదా తమ వ్యాపార రహస్యాలకు ముప్పు వాటిల్లిందని భావించడానికి ఎలాంటి కారణం లేదని ఎన్విడియా స్పష్టం చేసింది.
ఏఐ పెట్టుబడులపైనా ఇన్వెస్టర్ల ఆందోళన..
కృత్రిమ మేధ మౌలిక సదుపాయాలపై కంపెనీలు భారీగా ఖర్చు చేస్తున్నప్పటికీ, వాటి నుంచి ఆశించిన స్థాయిలో లాభాలు వస్తాయా అనే సందేహాలు పెట్టుబడిదారుల్లో పెరుగుతున్నాయి. దీంతో ఏఐ రంగానికి చెందిన షేర్లలో పెట్టుబడులపై ఇన్వెస్టర్లు పునరాలోచన చేస్తున్నారు. నవంబర్ 17న ప్రకటించనున్న ఎన్విడియా త్రైమాసిక ఆర్థిక ఫలితాలు కంపెనీ చిప్స్‌కు ఉన్న డిమాండ్, భవిష్యత్ వ్యాపార అంచనాలపై మరింత స్పష్టత ఇవ్వనున్నాయి.
తాజావార్తలు
- ●Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో కొనుగోళ్ల జోరు.. బంగారంపై పెట్టుబడులకు భారీ ఆసక్తి..
- ●Green India Challenge | ప్రతి ఇంటా ఉసిరి.. ప్రతి గుడిలో బిల్వం
- ●Kiara Advani | ‘అబ్ బస్ హో గయా’.. రెండో బేబీ తర్వాత ఇక పిల్లలు వద్దంటున్న కియారా!
- ●IBM | టెకీలకు ఐబీఎం షాక్.. హెచ్-1బీ వీసాలు, గ్రీన్ కార్డ్ స్పాన్సర్షిప్లను నిలిపివేసిన టెక్ దిగ్గజం
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో భారీ జోరు.. సెన్సెక్స్ 1,300 పాయింట్లు అప్..
- ●Kondagattu | కొండగట్టులో చెక్కతో చేసిన అంజన్న విగ్రహం..

Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో కొనుగోళ్ల జోరు.. బంగారంపై పెట్టుబడులకు భారీ ఆసక్తి..

Green India Challenge | ప్రతి ఇంటా ఉసిరి.. ప్రతి గుడిలో బిల్వం

Kiara Advani | ‘అబ్ బస్ హో గయా’.. రెండో బేబీ తర్వాత ఇక పిల్లలు వద్దంటున్న కియారా!

IBM | టెకీలకు ఐబీఎం షాక్.. హెచ్-1బీ వీసాలు, గ్రీన్ కార్డ్ స్పాన్సర్షిప్లను నిలిపివేసిన టెక్ దిగ్గజం






