Cab Driver | భార్యతో గొడవ.. ఆమెతోపాటు ఏడుగురిని హత్యచేసిన క్యాబ్ డ్రైవర్
Cab Driver | కర్ణాటకలోని బెంగళూరులో (Bengaluru) దారుణం చోటుచేసుకుంది. భార్యతో విభేదాల నేపథ్యంలో ఆమెతో సహా ఏడుగురిని హత్యచేశాడు.
Cab Driver | త్రినేత్ర న్యూస్: కర్ణాటకలోని బెంగళూరులో (Bengaluru) దారుణం చోటుచేసుకుంది. భార్యతో విభేదాల నేపథ్యంలో ఆమెతో సహా ఏడుగురిని హత్యచేశాడు. ఒకరి తర్వాత ఒకరిని రోకలితో కొట్టి దారుణంగా చంపేశాడు. మృతుల్లో ఏడేండ్ల బాలుడు కూడా ఉన్నాడు.
బెంగళూరుకు చెందిన ఇందు శేఖర్ (Indushekhar) క్యాబ్ డ్రైవర్‌గా (Cab Driver) పనిచేస్తున్నాడు. అతడికి 20 ఏండ్ల క్రితం సునీతతో వివాహం జరిగింది. అయితే తమ వివాహ బంధంలో భార్య తరఫు బంధువులు జోక్యం చేసుకుంటున్నారని శేఖర్ అసంతృప్తితో ఉన్నాడు. ఇదే విషయమై దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. భార్య కుటుంబంపై కోపం పెంచుకున్న అతడు.. సునీతతోపాటు అత్త రూపావతి, బామ్మర్ధులు శివకుమార్, శంకర్, సునీత సోదరి దివ్య, నిలినీ, శంకర్ ఏండేండ్ల కుమారుడిని రోకలితో కొట్టి చంపాడు. తర్వాత మృతదేహాలను నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో పడేశాడు. అక్టోబర్ 17 నుంచి ఒక్కొక్కరిని ఇంటికి రప్పించి ఈ హత్యలు చేయడం ప్రారంభించాడని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Murder | ప్రేమ ఒకరితో.. నిశ్చితార్థం మరొకరితో.. ప్రియుడి చేతిలో యువతి దారుణహత్య
నవంబర్ 6, 2026

Karnataka High Court | భర్త జీతం రూ.40 లక్షలు.. అయినా భార్యకు భరణం పొందే హక్కు లేదు : హైకోర్టు
నవంబర్ 5, 2026

Bengaluru 5 Star Hotel | ఈత కొడుతుండగా కరెంట్ షాక్.. ఫైవ్‌స్టార్ హోటల్లో ఇద్దరు విదేశీయులు మృతి
అక్టోబర్ 31, 2026
తాజావార్తలు
- ●Stock Markets | గ్లోబల్ మార్కెట్లలో భారీ పతనం.. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా..
- ●Unaccounted Cash | రైల్వే ప్లాట్‌ఫామ్‌పై అనుమానస్పద వ్యక్తి.. తనిఖీల్లో బయటపడ్డ రూ.1.40 కోట్లు
- ●Murder | ప్రేమ ఒకరితో.. నిశ్చితార్థం మరొకరితో.. ప్రియుడి చేతిలో యువతి దారుణహత్య
- ●Sai Dharam Tej | ఘనంగా సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం.. డిసెంబర్లో వివాహం
- ●Nithya Raman | లాస్ ఏంజెలెస్ మేయర్‌గా నిత్యా రామన్.. తొలి ఇండియన్ అమెరికన్‌గా రికార్డ్
- ●Missing | వాకింగ్‌కు వెళ్లి.. అమెరికాలో నల్లగొండ యువతి మిస్సింగ్

Stock Markets | గ్లోబల్ మార్కెట్లలో భారీ పతనం.. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా..

Unaccounted Cash | రైల్వే ప్లాట్‌ఫామ్‌పై అనుమానస్పద వ్యక్తి.. తనిఖీల్లో బయటపడ్డ రూ.1.40 కోట్లు

Murder | ప్రేమ ఒకరితో.. నిశ్చితార్థం మరొకరితో.. ప్రియుడి చేతిలో యువతి దారుణహత్య

Sai Dharam Tej | ఘనంగా సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం.. డిసెంబర్లో వివాహం



