త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold And Silver Prices Today | బులియ‌న్ మార్కెట్ల‌లో కొనుగోళ్ల జోరు.. బంగారంపై పెట్టుబ‌డుల‌కు భారీ ఆస‌క్తి..

Gold And Silver Prices Today | అమెరికా డాల‌ర్ బ‌ల‌హీన‌ప‌డుతుండ‌డం ప‌సిడి, వెండిల‌కు క‌లిసొస్తోంది. గ‌త కొద్ది రోజులుగా భారీగా త‌గ్గిన ఆయా లోహాల ధ‌ర‌లు మ‌ళ్లీ పెరుగుతున్నాయి. అంత‌ర్జాతీయ ప‌రిణామాలు వేగంగా మారుతుండ‌డం, ప‌శ్చిమ ఆసియాలో యుద్ధం ముగిసే అవ‌కాశాల‌పై ఆశ‌లు పెర‌గ‌డం, త‌గ్గుతున్న ముడి చ‌మురు ధ‌ర‌ల కార‌ణంగా ఈక్విటీ మార్కెట్లలో జోష్ క‌నిపిస్తోంది.

S

Business | Published On Nov 11, 2026, 12.04 pm IST

Gold And Silver Prices Today | బులియ‌న్ మార్కెట్ల‌లో కొనుగోళ్ల జోరు.. బంగారంపై పెట్టుబ‌డుల‌కు భారీ ఆస‌క్తి..
Advertisement

Gold And Silver Prices Today | అమెరికా డాల‌ర్ బ‌ల‌హీన‌ప‌డుతుండ‌డం ప‌సిడి, వెండిల‌కు క‌లిసొస్తోంది. గ‌త కొద్ది రోజులుగా భారీగా త‌గ్గిన ఆయా లోహాల ధ‌ర‌లు మ‌ళ్లీ పెరుగుతున్నాయి. అంత‌ర్జాతీయ ప‌రిణామాలు వేగంగా మారుతుండ‌డం, ప‌శ్చిమ ఆసియాలో యుద్ధం ముగిసే అవ‌కాశాల‌పై ఆశ‌లు పెర‌గ‌డం, త‌గ్గుతున్న ముడి చ‌మురు ధ‌ర‌ల కార‌ణంగా ఈక్విటీ మార్కెట్లలో జోష్ క‌నిపిస్తోంది. బులియ‌న్ మార్కెట్ల‌లో పెట్టుబ‌డిదారుల కొనుగోళ్లు భారీగా పెరుగుతున్నాయి. అయితే ఈ స‌మ‌యంలో పెట్టుబ‌డులు పెట్ట‌ద‌ల‌చిన వారు అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హరించాల‌ని, భారీ మొత్తంలో ఒకేసారి పెట్టుబ‌డులు పెట్ట‌కుండా అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడు కొంత మొత్తంలో పెట్టుబ‌డులు పెడుతూ వెళ్లాల‌ని నిపుణులు సూచిస్తున్నారు. ఇక బుధ‌వారం అంత‌ర్జాతీయ మార్కెట్‌ల‌లో ఔన్స్ బంగారం ధ‌ర 0.58 శాతం పెరిగి 4,056 డాల‌ర్ల‌కు చేర‌గా, వెండి ధ‌ర 2.88 శాతం ఎగ‌బాకి 53 డాల‌ర్ల‌కు చేరింది. దేశీయ క‌మోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 1180 పాయింట్లు పెరిగి 1,41,705 వ‌ద్ద ఉండ‌గా, సిల్వ‌ర్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 5వేల పాయింట్ల‌కు పైగా పెరిగి 1,87,581 వ‌ద్ద ఉంది. అయితే దేశీయ స్పాట్ మార్కెట్‌లో మాత్రం బంగారం, వెండి ధ‌ర‌లు భారీగా త‌గ్గాయి.

స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధ‌ర‌లు..

24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.14,198 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,13,584 గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,41,980 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.14,19,800 గా ఉంది. ఇది కింద‌టి రోజు ముగింపుతో పోలిస్తే రూ.7,100 త‌గ్గింది.

22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.13,015 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,04,120గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,30,150 ఉండగా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.13,01,500గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.6,500 త‌గ్గింది.

18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.10,649 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.85,192గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,06,490 ఉండ‌గా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.10,64,900గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.5,300 త‌గ్గింది.

దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,00,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,000గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధ‌ర కిలోకు రూ.5వేలు త‌గ్గింది. అలాగే హైద‌రాబాద్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,00,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,000 గా ఉంది.

Advertisement
Advertisement