త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Karnataka High Court | భ‌ర్త జీతం రూ.40 ల‌క్ష‌లు.. అయినా భార్య‌కు భ‌ర‌ణం పొందే హ‌క్కు లేదు : హైకోర్టు

Karnataka High Court | ఉన్న‌త చ‌దువులు చ‌దువుకుని మంచి ఉద్యోగం చూస్తూ ఆర్థికంగా స్థిర‌త్వం సాధించిన మ‌హిళ‌కు భ‌ర్త నుంచి భ‌ర‌ణం (alimony) పొందే అర్హ‌త లేద‌ని క‌ర్ణాట‌క హైకోర్టు (Karnataka High Court) స్ప‌ష్టం చేసింది.

D

National | Published On Nov 5, 2026, 12.26 pm IST

Karnataka High Court | భ‌ర్త జీతం రూ.40 ల‌క్ష‌లు.. అయినా భార్య‌కు భ‌ర‌ణం పొందే హ‌క్కు లేదు : హైకోర్టు
Advertisement

Karnataka High Court | త్రినేత్ర న్యూస్ : క‌ర్ణాట‌క హైకోర్టు (Karnataka High Court) సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. ఉన్న‌త చ‌దువులు చదివి మంచి ఉద్యోగం చూస్తూ ఆర్థికంగా స్థిర‌త్వం సాధించిన మ‌హిళ‌కు భ‌ర్త నుంచి భ‌ర‌ణం పొందే అర్హ‌త లేద‌ని స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు భార్య‌కు ప్ర‌తి నెలా రూ.20 వేలు భ‌రణంగా ఇవ్వాలంటూ ఫ్యామిలీ కోర్టు (family court) ఇచ్చిన తీర్పును హైకోర్టు ర‌ద్దు చేసింది.

బెంగ‌ళూరుకు (Bengaluru) చెందిన ఓ జంట మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌ల కార‌ణంగా విడిపోయారు. దీంతో భ‌ర‌ణం కోసం భార్య ఫ్యామిలీ కోర్టును ఆశ్ర‌యించింది. త‌న భర్త వార్షిక ఆదాయం రూ.40 లక్షలు ఉందని, ఆయన నుంచి నెలకు రూ.85 వేలు జీవనభృతి చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ భార్య ఫ్యామిలీ కోర్టులో (Chikkamagaluru district family court) పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిష‌న్‌పై విచార‌ణ జ‌రిపిన ఫ్యామిలీ కోర్టు భార్య‌కు భ‌ర‌ణంగా ప్ర‌తి నెలా రూ.20 వేలు చెల్లించేలా ఆదేశాలు ఇచ్చింది.

అయితే, ఫ్యామిలీ కోర్టు ఆదేశాల‌ను భ‌ర్త హైకోర్టులో స‌వాల్ చేశారు. తన భార్య కూడా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అని, ఒక సాఫ్ట్‌వేర్ సంస్థలో టెక్నికల్ రైటర్‌గా పనిచేస్తూ నెలకు రూ. 54,700 సంపాదిస్తోందని తెలిపారు. మంచి ఆర్థిక స్థిరత్వంతో త‌న త‌ల్లిదండ్రుల‌ను కూడా పోషించే ప‌రిస్థితుల్లోనే ఉంద‌ని కోర్టుకు ఆధారాలు స‌మ‌ర్పించారు. వాద‌న‌లు విన్న జస్టిస్ చిలకుర్ సుమలత ధర్మాసనం కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. సొంతంగా సంపాదిస్తూ తల్లిదండ్రులను చూసుకోగలిగిన మహిళ, భర్తపై ఆధారపడి జీవిస్తోందని అనలేమని తేల్చి చెప్పింది.

అంతేకాదు, వివాహిత మహిళను ప్రతి పరిస్థితుల్లోనూ భర్తే పోషించాలని చట్టం ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేసింది. భార్య ఆర్థికంగా స్వయంసమృద్ధి సాధించినప్పుడు, కేవలం భర్త ఆదాయం ఎక్కువగా ఉందనే కారణంతో భరణం పొంద‌లేర‌ని స్ప‌ష్టం చేసింది. ఒక‌వేళ భార్య జీవనోపాధికి ఆమె ఆదాయం సరిపోనప్పుడు మాత్రమే భర్త భరణం చెల్లించాల్సి ఉంటుందని కోర్టు పేర్కొంది. ఈ మేర‌కు ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు ర‌ద్దు చేసింది. ఈ సంద‌ర్భంగా మ‌హిళ‌కు ఓ వెసులుబాటు క‌ల్పించింది. భర్త ఇప్పటివరకు చెల్లించిన మెయింటినెన్స్‌ మొత్తాన్ని తిరిగి వసూలు చేయకుండా స్ప‌ష్ట‌మైన ఆదేశాలు జారీ చేసింది.

Also Read..

సోషల్ మీడియాలో బాలల లైంగిక వేధింపుల కంటెంట్.. మెటాపై ఢిల్లీ పోలీసులు కేసు న‌మోదు

ఎన్నిక‌ల్లో ఎక్కువ సీట్లు గెల‌వాలంటే ముందు విదేశీ ప‌ర్య‌ట‌న‌లు ఆపి.. ఈ 7 సూచనలు పాటించండి.. రాహుల్‌కు కేంద్ర మంత్రి చుర‌క‌లు

ట్రంప్‌కు మిడ్‌ట‌ర్మ్ ఝ‌లక్‌.. భార‌త స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ..

Advertisement
Advertisement