త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Miss Universe India 2026 | కేర‌ళ భామ‌కు మిస్ యూనివ‌ర్స్ ఇండియా కిరీటం.. ఎవ‌రీ కాజియా లిజ్ మెజో..?

Miss Universe India 2026 | కేరళ (Kerala)కు చెందిన 19 ఏళ్ల లా విద్యార్థిని కాజియా లిజ్ మెజో (Kaziah Liz Mejo) ప్రతిష్ఠాత్మక 'మిస్ యూనివర్స్ ఇండియా 2026' (Miss Universe India 2026 ) కిరీటాన్ని కైవసం చేసుకుంది. రాజస్థాన్‌లోని జైపూర్‌లో అత్యంత వైభవంగా జరిగిన గ్రాండ్ ఫినాలేలో 52 మంది అందాల భామ‌లు పోటీప‌డ‌గా.. కాజియాకు విజ‌యం వ‌రించింది.

D

National | Published On Aug 24, 2026, 12.26 pm IST

Miss Universe India 2026 | కేర‌ళ భామ‌కు మిస్ యూనివ‌ర్స్ ఇండియా కిరీటం.. ఎవ‌రీ కాజియా లిజ్ మెజో..?
Advertisement

Miss Universe India 2026 | త్రినేత్ర‌.న్యూస్ : 'మిస్ యూనివర్స్ ఇండియా 2026' (Miss Universe India 2026) గ్రాండ్ ఫినాలే రాజస్థాన్‌లోని జైపూర్ (Jaipur) నగరంలో ఆదివారం అత్యంత వైభవంగా జ‌రిగింది. ఈ అందాల పోటీల్లో కేరళ (Kerala)కు చెందిన 19 ఏళ్ల కాజియా లిజ్ మెజో (Kaziah Liz Mejo) విజేత‌గా నిలిచి మిస్ యూనివ‌ర్స్ ఇండియా కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. ఈ కిరీటం కోసం దేశ‌వ్యాప్తంగా 52 మంది అందాల భామ‌లు పోటీప‌డ‌గా.. కాజియాకు విజ‌యం వ‌రించింది. దీంతో 'మిస్ యూనివర్స్ ఇండియా 2025' విజేత మణికా విశ్వకర్మ.. కాజియాకు అధికారికంగా కిరీటం అంద‌జేశారు.

ఈ పోటీల ముగింపు వేడుకకు భారత్ తరఫున తొలి మిస్ యూనివర్స్ విజేత సుష్మితా సేన్ నేతృత్వం వహించగా, ఊర్వశి రౌతేలా, సెలీనా జైట్లీ తదితరులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ విజయంతో కాజియా అంతర్జాతీయ వేదికపై భార‌త్ త‌ర‌ఫున‌ ప్రాతినిధ్యం వహించే గొప్ప అవకాశాన్ని దక్కించుకుంది. నవంబర్‌లో ప్యూర్టో రికో (Puerto Rico)లో జరగనున్న 75వ మిస్ యూనివర్స్ పోటీల్లో (75th Miss Universe pageant) కాజియా పాల్గొన‌నుంది. మిస్ యూనివ‌ర్స్ కిరీటం ద‌క్క‌డంపై కాజియా సంతోషం వ్య‌క్తం చేశారు. దీని కోసం మూడేళ్లుగా తాను ఎంతో క‌ష్ట‌ప‌డ్డాన‌ని చెప్పుకొచ్చారు. ఇక ఈ పోటీల్లో తమిళనాడుకు చెందిన వైష్ణవి గణేష్ ఫస్ట్ రన్నరప్‌గా, గుజరాత్‌కు చెందిన అనుశ్రీ సతావలేకర్ సెకండ్ రన్నరప్‌గా నిలిచారు.

Image

 

కేరళలోని మావేలిక్కరకు చెందిన కాజియా 2007లో జన్మించారు. ఆమె చిన్నతనం అంతా యూఏఈ (అబుదాబి)లో గడిచింది. ప్రస్తుతం ఆమె లా (Law) చదువుతూనే మోడలింగ్‌ రంగంలోనూ రాణిస్తున్నారు. కాజియా మంచి క్లాసికల్ డాన్సర్ కూడా. ఆమె పాటలు కూడా బాగా పాడ‌తారు. డ్రమ్స్, వయోలిన్ కూడా వాయించ‌గ‌ల‌రు. కాజియా 17 ఏళ్ల వయసులో 'మిస్ టీన్ దివా 2024' గెలుచుకుంది. ఆ తర్వాత 'మిస్ టీన్ ఇంటర్నేషనల్ 2025' లో ఫస్ట్ రన్నరప్‌గా నిలిచింది. 2026 ఆరంభంలో అతి పిన్న వయసులోనే 'మిస్ యూనివర్స్ కేరళ' టైటిల్‌ను సొంతం చేసుకుని చ‌రిత్ర సృష్టించింది. మలయాళంలో మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన 'షైలాక్' (Shylock) చిత్రం ద్వారా న‌టిగా సినిమా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టారు.

Image

Image

Also Read..

వైద్యుడిని చిత‌క‌బాదిన రోగి కుమారుడు

ఏడాదికి 3 సిలిండ‌ర్లు.. ఉచిత బ‌స్సు ప్ర‌యాణం.. సీఎం వ‌రాల జ‌ల్లు

విద్యార్థులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్న‌ప్పుడు.. మీ ల‌డాయి ఎక్క‌డికి పోయింది?.. బీజేపీ నేత‌ల‌పై బ‌ల్మూర్ వెంక‌ట్ ఆగ్ర‌హం

Advertisement
Advertisement