Doctor was assaulted | వైద్యుడిని చితకబాదిన రోగి కుమారుడు
Doctor was assaulted | మహారాష్ట్రలో మరో వైద్యుడిపై దాడి జరిగింది (Doctor was assaulted). థానేలోని కల్యాణ్ ప్రాంతంలో గల ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆర్థోపెడిక్ వైద్యుడు డాక్టర్ యోగేంద్ర జైస్వాల్ (Dr Yogendra Jaiswal)పై రోగి కుమారుడు దాడి చేశాడు.
Doctor was assaulted | త్రినేత్ర.న్యూస్ : మహారాష్ట్రలోని ఓ ఆసుపత్రి వైద్యురాలిపై (Doctor was assaulted) శివసేన కార్పొరేటర్ దాడి చేసిన ఘటన ఇటీవలే తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఈ ఘటన మరవకముందే మరో వైద్యుడిపై దాడి జరిగింది. థానేలోని కల్యాణ్ ప్రాంతంలో గల ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆర్థోపెడిక్ వైద్యుడు డాక్టర్ యోగేంద్ర జైస్వాల్‌పై రోగి కుమారుడు దాడి చేశాడు. వైద్యుడిని విచక్షణారహితంగా కొట్టాడు.
ఇంతకీ ఏం జరిగిందంటే.. డాక్టర్ యోగేంద్ర జైస్వాల్ శనివారం రాత్రి దేశ్‌ముఖ్ అనే రోగిని పరీక్షిస్తున్నాడు. అతని పక్కటెముకకు గాయం కావడంతో చికిత్సా విధానం, బ్యాండేజ్ ఎలా వేయాలి, మందులు ఎలా వాడాలనే విషయాలను వివరిస్తున్నాడు. ఆ సమయంలో రోగి కుమారుడు వైద్యుడిని ఒకే ప్రశ్నను పదేపదే అడుగుతూ చికాకు తెప్పించాడు. ఈ క్రమంలో వైద్యుడు, రోగి కుమారుడి మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఆగ్రహించిన రోగి కుమారుడు వైద్యుడిపై దాడికి పాల్పడ్డాడు. అసభ్యకర పదజాలంతో దూషిస్తూ దారుణంగా కొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కాగా, గత నెలలో కల్యాణ్-డోంబివిలి మున్సిపల్ కార్పొరేషన్ (KDMC) పరిధిలోని శాస్త్రి నగర్ ఆసుపత్రిలో ఓ వైద్యురాలిపై శివసేన కార్పొరేటన్ రమేష్ (Ramesh Mhatre) దాడి చేయడం తీవ్ర కలకలం రేపింది. ఆసుపత్రికి వచ్చిన ఓ గర్భిణిని వేరే ఆసుపత్రికి వెళ్లమని వైద్యులు సూచించడం రమేష్‌కు ఆగ్రహం తెప్పించింది. దీంతో తన అనుచరులతో కలిసి ఆసుపత్రి సిబ్బందితో వాగ్వాదానికి దిగిన కార్పొరేటర్.. విధుల్లో ఉన్న మహిళా డాక్టర్, మరో వైద్యాధికారిపై దాడి చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఇప్పుడు అదే తరహాలో మరో వైద్యుడిపై దాడి జరగడం రాష్ట్రంలో వైద్యుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది.
Also Read..
ఏడాదికి 3 సిలిండర్లు.. ఉచిత బస్సు ప్రయాణం.. సీఎం వరాల జల్లు
అమరావతి హాస్పిటల్‌లో పేలిన వెంటిలేటర్.. ముగ్గురు నవజాత శిశువులు సజీవదహనం
సంబంధిత వార్తలు

Eknath Shinde | ఏక్నాథ్ షిండేకి అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక
జులై 4, 2026

Road Accident | 250 kmph వేగంతో దూసుకొచ్చిన బీఎండబ్ల్యూ కారు.. ఎగిరిపడ్డ మృతదేహాలు
జూన్ 22, 2026

Mira Road Goat Controversy | బక్రీద్ ఉద్రిక్తతలు: అపార్ట్మెంట్లోకి మేకలు.. నిరసనగా పందిపిల్లతో ఎంట్రీ.. పోలీసుల హైడ్రామా!
మే 27, 2026
తాజావార్తలు
- ●CM Vijay | ఏడాదికి 3 సిలిండర్లు.. ఉచిత బస్సు ప్రయాణం.. సీఎం వరాల జల్లు
- ●IPO | ఐపీఓల సందడి.. ఈ వారం రూ.3,300 కోట్లకు పైగా ఇష్యూలు..
- ●Newborns Died | అమరావతి హాస్పిటల్‌లో పేలిన వెంటిలేటర్.. ముగ్గురు నవజాత శిశువులు సజీవదహనం
- ●Stock Markets | స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. తగ్గిన ముడి చమురు ధరలు..
- ●Sarampally Malla Reddy | రైతు సంఘం నేత సారంపల్లి మల్లారెడ్డి కన్నుమూత..
- ●Heavy Rain Alert | నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ

CM Vijay | ఏడాదికి 3 సిలిండర్లు.. ఉచిత బస్సు ప్రయాణం.. సీఎం వరాల జల్లు

IPO | ఐపీఓల సందడి.. ఈ వారం రూ.3,300 కోట్లకు పైగా ఇష్యూలు..

Newborns Died | అమరావతి హాస్పిటల్‌లో పేలిన వెంటిలేటర్.. ముగ్గురు నవజాత శిశువులు సజీవదహనం

Stock Markets | స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. తగ్గిన ముడి చమురు ధరలు..



