Balmoor Venkat | విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు.. మీ లడాయి ఎక్కడికి పోయింది?.. బీజేపీ నేతలపై బల్మూర్ వెంకట్ ఆగ్రహం
Balmoor Venkat | విద్యార్థుల గురించి మాట్లాడే నైతిక హక్కు, అర్హత బీజేపీకి (BJP) ఉందా అని ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ (Balmoor Venkat) ప్రశ్నించారు. నీట్ పేపర్ లీక్ (NEET Paper Leak) అయి అనేక మంది విద్యార్థులు చనిపోతే అప్పుడు మీ లడాయి ఎక్కడికి పోయిందని నిలదీశారు.
Balmoor Venkat | త్రినేత్ర.న్యూస్: విద్యార్థుల గురించి మాట్లాడే నైతిక హక్కు, అర్హత బీజేపీకి (BJP) ఉందా అని ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ (Balmoor Venkat) ప్రశ్నించారు. నీట్ పేపర్ లీక్ (NEET Paper Leak) అయి అనేక మంది విద్యార్థులు చనిపోతే అప్పుడు మీ లడాయి ఎక్కడికి పోయిందని నిలదీశారు. దేశంలో న్యాయం కోసం జన్‌జీ లడాయి చేస్తుంటే లాఠీచార్జ్ చేయించింది మీరు కాదా అని మండిపడ్డారు. జంతర్ మంతర్ వద్ద 40 రోజులు దీక్ష చేస్తే కనీసం పట్టించుకోనిది బీజేపీ కాదా..? అని నిలదీశారు. ప్రధాని ఇంటి ముందు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే కూర్చుంటే భయపడి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో (Dharmendra Pradhan) రాజీనామా చేయించింది మీరు కాదా? అన్నారు. దేశంలో విద్యా వ్యవస్థను సర్వనాశనం చేశారని ధ్వజమెత్తారు.
కేసీఆర్ ప్రభుత్వంలో రూ.8 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ (Fee Reimbursement) బకాయి ఉంటే అప్పుడెందుకు మీరు లడాయి చేయలేదని నిలదీశారు. విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసి నిరుద్యోగులను రోడ్లపాలు చేసినప్పుడు ఎక్కడికి పోయింది మీ లడాయని ప్రశ్నించారు. గ్రూప్-1 పేపర్లు లీక్ అయినప్పుడు, ఇంటర్, టెన్త్ ప్రశ్నాపత్రాలు వాట్సాప్‌లలోకి వచ్చినప్పుడు నాంపల్లి బీజేపీ ఆఫీసులో దీక్ష చేయడానికి మీకు పరుపులు దొరకలేదా..? అని మండిపడ్డారు. ఈ ఏడాది నుంచి గ్రీన్ చానల్‌లో ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించిన తర్వాత కూడా మీరు దీక్షలు ఎందుకు చేస్తున్నారు. బ్యాంకులో రూ.300 కోట్లు అడ్వాన్స్‌గా పెట్టి విద్యార్థుల ఖాతాల్లో వేయడానికి సిద్ధమయ్యాక కూడా దీక్ష చేయడం వెనుక అర్థం ఏమిటని ప్రశ్నించారు.
విద్యార్థుల ఖాతాల్లో నేరుగా ఎప్పటికప్పుడు ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లిస్తామని హైకోర్టులోనే ప్రభుత్వం స్పష్టం చేసిందని గుర్తుచేశారు. అయినా మీ దీక్ష వెనుక రాజకీయం ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్‌తో (Congress) లడాయి కోసం బీఆర్ఎస్‌తో (BRS) దోస్తీ చేస్తున్న బీజేపీ తీరును, మీ దొంగ దీక్షలను జనం గమనిస్తూనే ఉన్నారని చెప్పారు. మీరెన్ని డ్రామాలు ఆడినా, దీక్షలు చేసినా తెలంగాణలో బీజేపీ నాంపల్లి ఆఫీసు వరకే పరిమితమని ఎద్దేవా చేశారు.
సంబంధిత వార్తలు

Adi Sriniva | ఫీజు బకాయిలపై లడాయి అంటూ బడాయికి పోతున్న బీజేపీ: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
ఆగస్టు 24, 2026

Harish Rao | భూభారతి పోర్టల్ నుంచి 22 A జాబితాను రాత్రికి రాత్రే ఎందుకు మాయం చేశారు?: హరీశ్ రావు
ఆగస్టు 24, 2026

Mahesh Goud | కార్యకర్తల వల్లే కాంగ్రెస్‌కు అధికారం.. పార్టీ కోసం కష్టపడే వారికి పదవుల్లో ప్రాధాన్యం: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
ఆగస్టు 23, 2026
తాజావార్తలు
- ●Adi Sriniva | ఫీజు బకాయిలపై లడాయి అంటూ బడాయికి పోతున్న బీజేపీ: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
- ●Gold And Silver Prices Today | పరుగులు పెడుతున్న పసిడి ధరలు.. ఇన్వెస్టర్లకు ఇదే మంచి చాన్స్..?
- ●Doctor was assaulted | వైద్యుడిని చితకబాదిన రోగి కుమారుడు
- ●CM Vijay | ఏడాదికి 3 సిలిండర్లు.. ఉచిత బస్సు ప్రయాణం.. సీఎం వరాల జల్లు
- ●IPO | ఐపీఓల సందడి.. ఈ వారం రూ.3,300 కోట్లకు పైగా ఇష్యూలు..
- ●Newborns Died | అమరావతి హాస్పిటల్లో పేలిన వెంటిలేటర్.. ముగ్గురు నవజాత శిశువులు సజీవదహనం

Adi Sriniva | ఫీజు బకాయిలపై లడాయి అంటూ బడాయికి పోతున్న బీజేపీ: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

Gold And Silver Prices Today | పరుగులు పెడుతున్న పసిడి ధరలు.. ఇన్వెస్టర్లకు ఇదే మంచి చాన్స్..?

Doctor was assaulted | వైద్యుడిని చితకబాదిన రోగి కుమారుడు

CM Vijay | ఏడాదికి 3 సిలిండర్లు.. ఉచిత బస్సు ప్రయాణం.. సీఎం వరాల జల్లు



