Nipah Virus | కేరళలో మరోసారి నిఫా వైరస్ కలకలం.. ఓ వ్యక్తికి పాజిటివ్
Nipah Virus | కేరళ (Kerala)లో ప్రాణాంతక నిఫా వైరస్ (Nipah Virus) మరోసారి కలకలం రేపుతోంది. 43 ఏళ్ల వ్యక్తికి ప్రాథమిక పరీక్షలో నిఫా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.
Nipah Virus | కేరళ (Kerala)లో ప్రాణాంతక నిఫా వైరస్ (Nipah Virus) మరోసారి కలకలం రేపుతోంది. కోజికోడ్ (Kozhikode) జిల్లాకు చెందిన 43 ఏళ్ల వ్యక్తికి ప్రాథమిక పరీక్షలో నిఫా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. కోజికోడ్‌లోని ప్రభుత్వ మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌లో నిర్వహించిన ప్రాథమిక పరీక్షల్లో నిఫా వైరస్ పాజిటివ్‌గా తేలింది. అప్రమత్తమైన వైద్యులు అతడి నమూనాలను పూణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (National Institute of Virology) ల్యాబ్‌కు పంపారు. ఆ రిపోర్ట్స్ నేడో, రేపో వచ్చే అవకాశం ఉంది.
కాగా నిఫా అనుమానిత కేసుగా గుర్తించడానికి ముందు రోగి పలు ఆసుపత్రిలను సందర్శించినట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మరోవైపు వైరస్ సోకినట్లు నిర్ధారణ కావడంతో ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. అతడితో కాంటాక్ట్ అయిన వారిని గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
దీనిపై కేరళ ఆరోగ్య మంత్రి కె. మురళీధరన్ (K Muralidharan) స్పందించారు. ఎవరూ ఆందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని చెప్పారు. నిఫా సోకిందని అనుమానిస్తున్న సదరు రోగి మొదట చికిత్స కోసం పలు ప్రైవేట్ హాస్పిటల్స్‌కు వెళ్లినట్లు తెలిపారు. ఈ క్రమంలో ముందు జాగ్రత్త చర్యగా రోగి సంప్రదించిన ఆసుపత్రి సిబ్బందిని క్వారంటైన్‌లోకి వెళ్లాలని ఆదేశించినట్లు చెప్పారు.
తొలిసారి..
ఈ వైరస్‌ని ఎన్ఐవీడీ అంటారు. అంటే నిఫా వైరస్ డిసీజ్. 1999లో మలేషియా, సింగపూర్‌లో పందులను పెంచే రైతుల్లో తొలిసారి ఈ వైరస్ వెలుగు చూసింది. గబ్బిలాల ద్వారా ఇది వ్యాప్తి చెందినట్లు గుర్తించారు. ఇక దక్షిణ భారతదేశంలో తొలిసారి నిఫా వైరస్ కేసు మే 19, 2018లో కోజికోడ్ జిల్లాలో బయటపడింది. ఈ వైరస్ కారణంగా 2018, 2021లో మరణాలు నమోదయ్యాయి.
ఎలా వ్యాపిస్తుంది..
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జంతువుల నుండి ప్రజలకు ఈ వైరస్ వ్యాపిస్తుంది. కలుషితమైన ఆహారం, ఈ వ్యాధి బారినపడిన వారి నుంచి ఇది నేరుగా మరో వ్యక్తికి సంక్రమిస్తుంది. ముఖ్యంగా తుంపర్లు, ముక్కు నుంచి, నోటి నుంచి వచ్చే ద్రవాల ద్వారా సోకుతుంది. ఈ వైరస్ లక్షణాలు తొందరగా బయటపడవు. ఈ వైరస్ కొందరిలో మెదడువాపుకు కారణమవుతుంది. ఒకసారి ఈ వైరస్ ఒంట్లోకి ప్రవేశించాక సాధారణంగా సగటున తొమ్మిది రోజుల్లో లేదా 4 నుంచి 15 రోజుల్లో లక్షణాలు కనిపిస్తాయి.
లక్షణాలు, చికిత్స?
వైరస్ సోకిన వారికి జ్వరం, తలనొప్పి, దగ్గు, శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉండటం, అలసట లాంటి లక్షణాలు ఉంటాయి. వైరస్ సోకిన వారిలో దాదాపు 75% మంది మరణించే అవకాశముంది. దీనికి ప్రత్యేకమైన చికిత్సగానీ, ఔషధాలుగానీ లేవు. వాక్సిన్ కూడా ఇంకా కనుగొనలేదు. కాబట్టి మాస్క్‌లు ధరించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని అతి తీవ్రమైన, ప్రమాదకరమైన వైరస్‌ల జాబితాలో చేర్చింది.
Also Read..
భారతీయ మామిడి పండ్లపై నేపాల్ నిషేధం..? కేంద్రం క్లారిటీ
ఒమన్ తీరంలో వాణిజ్య నౌకపై అమెరికా దాడి.. ముగ్గురు భారత నావికులు మృతి
తాజావార్తలు
- ●Shatrughan Sinha | "కష్టకాలంలో దీదీని వదలను" - రెబల్ క్యాంప్‌లోకి వెళ్లే ప్రసక్తే లేదని తేల్చిచెప్పిన శతృఘ్న సిన్హా
- ●Bandi Sanjay | 20 ఏళ్ల నుంచి జ్వరం లేదు.. నాకు మోదీనే స్ఫూర్తి : బండి సంజయ్
- ●Jailer 2 | రజనీకాంత్ జైలర్ 2లో గెస్ట్‌గా బాలీవుడ్ హీరో కన్ఫామ్ - నలభై ఏళ్ల తర్వాత కాంబో రిపీట్
- ●Stock Markets | పశ్చిమ ఆసియా యుద్ధ భయాలు.. స్టాక్ మార్కెట్లలో భారీ నష్టాలు..
- ●Harish Rao | ఫ్యూచర్ సిటీని కచ్చితంగా రద్దు చేస్తాం.. తేల్చిచెప్పిన హరీశ్‌రావు
- ●Gym Owner Shot Dead | 5 సెకన్లలో 10 రౌండ్లు.. జిమ్ ఓనర్‌పై బుల్లెట్ల వర్షం.. షాకింగ్ వీడియో

Shatrughan Sinha | "కష్టకాలంలో దీదీని వదలను" - రెబల్ క్యాంప్‌లోకి వెళ్లే ప్రసక్తే లేదని తేల్చిచెప్పిన శతృఘ్న సిన్హా

Bandi Sanjay | 20 ఏళ్ల నుంచి జ్వరం లేదు.. నాకు మోదీనే స్ఫూర్తి : బండి సంజయ్

Jailer 2 | రజనీకాంత్ జైలర్ 2లో గెస్ట్‌గా బాలీవుడ్ హీరో కన్ఫామ్ - నలభై ఏళ్ల తర్వాత కాంబో రిపీట్

Stock Markets | పశ్చిమ ఆసియా యుద్ధ భయాలు.. స్టాక్ మార్కెట్లలో భారీ నష్టాలు..






