Bill Gates | అక్రమ సంబంధాలను అడ్డుపెట్టుకుని నాపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశాడు.. ఎప్‌స్టీన్‌పై బిల్‌గేట్స్ సంచలన ఆరోపణలు
Bill Gates | అమెరికా ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్‌స్టీన్ (Jeffrey Epstein)తో సంబంధాలపై మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ (Bill Gates) కీలక విషయాలు వెల్లడించారు. ఎప్‌స్టీన్ తన అక్రమ సంబంధాలపై (extramarital affair) సమాచారం సేకరించి, తనతో పరిచయం కొనసాగించేలా ఒత్తిడి తీసుకురావాలని యత్నించాడని బిల్ గేట్స్ సంచలన ఆరోపణలు చేశారు.
International | Published On Jun 11, 2026, 12.50 pm IST
Bill Gates | అమెరికా ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్‌స్టీన్ (Jeffrey Epstein)తో సంబంధాలపై మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ (Bill Gates) కీలక విషయాలు వెల్లడించారు. తన వివాహేతర సంబంధాలను అడ్డుపెట్టుకుని తనపై ఒత్తిడి తెచ్చేందుకు జెఫ్రీ ప్రయత్నించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు అమెరికా ప్రతినిధుల సభ కమిటీకి (congressional committee ) ఈ విషయాన్ని తెలియజేశారు.
ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపిన లైంగిక వేధింపుల వ్యవహారం ఎప్‌స్టీన్ ఫైల్స్‌పై ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్)కి చెందిన 'ఓవర్‌సైట్ అండ్ గవర్నమెంట్ రిఫార్మ్ కమిటీ' దర్యాప్తు చేస్తోంది. దర్యాప్తులో భాగంగా బిల్‌గేట్స్ కమిటీ ముందు విచారణకు హాజరయ్యారు. ఎప్‌స్టీన్‌తో తనకు ఉన్న పరిచయాలపై కమిటీ అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.
ఎప్‌స్టీన్‌తో తాను జరిపిన సమావేశాలు కేవలం సేవా కార్యక్రమాల కోసమేనని బిల్ గేట్స్ స్పష్టం చేశారు. ప్రపంచానికి ప్రయోజనం కలిగించే తన ఆరోగ్య పథకాలకు బిలియన్ల కొద్దీ డాలర్ల విరాళాలు సమకూర్చడంలో సహాయం చేస్తానని అతను తనకు హామీ ఇచ్చాడని గేట్స్ పేర్కొన్నారు. ఆ సమయంలో అతడి నేరాల గురించి తనకు పూర్తిగా తెలియదని చెప్పుకొచ్చారు. నేరాల గురించి తెలిసిన తర్వాత అతడితో సంబంధాలను తెంచుకున్నట్లు బిల్‌గేట్స్ చెప్పారు. కానీ, ఎప్‌స్టీన్ మాత్రం తన అక్రమ సంబంధాలపై (extramarital affair) సమాచారం సేకరించి, తనతో పరిచయం కొనసాగించేలా ఒత్తిడి తీసుకురావాలని యత్నించాడని బిల్ గేట్స్ సంచలన ఆరోపణలు చేశారు.
"నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని సున్నితమైన విషయాలు ఎప్‌స్టీన్‌కు తెలిశాయి. వాటిని ఆధారంగా చేసుకుని నాపై ప్రభావం చూపాలని ప్రయత్నించాడు. ఆ వివాహేతర సంబంధాలకు, ఎప్‌స్టీన్‌తో నాకున్న పరిచయాలకు ఎలాంటి సంబంధం లేదు. కానీ అవి నా కుటుంబానికి ఎంతో బాధను కలిగించాయి" అని బిల్‌గేట్స్ చెప్పుకొచ్చారు. ఎప్‌స్టీన్‌తో పరిచయం జీవితంలో తాను చేసిన అతి పెద్ద తప్పని గేట్స్ మరోసారి స్పష్టం చేశారు. అతనితో సమావేశాలు తన ప్రతిష్టకే కాకుండా.. గేట్స్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలపై కూడా ప్రతికూల ప్రభావం చూపాయని గేట్స్ ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read..
స్పేస్‌ఎక్స్ ఐపీఓ సంచలనం.. కోటీశ్వరులుగా మారనున్న వేలాది ఉద్యోగులు..
టీఎంసీలో కొనసాగుతున్న రాజీనామాల పర్వం.. మరో ఎంపీ రిజైన్
5 వేల పోస్టులకు కాదు.. 19 వేల పోస్టులకు ఒకేసారి నోటిఫికేషన్ విడుదల చేయాలి.. హరీశ్‌రావు డిమాండ్
సంబంధిత వార్తలు

Miyapur Murder Case | ప్రియుడి కోసం భర్తను చంపి శవాన్ని మహారాష్ట్రలో పూడ్చిపెట్టిన భార్య.. మియాపూర్ కేసులో సంచలన నిజాలు
జులై 7, 2026

Melania Trump | అబద్ధాలకు నేటితో ముగింపు పలకాలి.. ఎప్‌స్టీన్‌తో సంబంధాలపై మెలానియా ట్రంప్
ఏప్రిల్ 10, 2026

Epstein Files | మనుషుల జ్ఞాపకాలను ఎప్‌స్టీన్ చెరిపివేశాడా..? MIT ప్రముఖుడితో సంభాషణ..
ఫిబ్రవరి 20, 2026
తాజావార్తలు
- ●Dasoju Sravan | ట్రాఫిక్ చలాన్ల ఆటో-డెబిట్ ప్రతిపాదన రాజ్యాంగ విరుద్ధం.. బ్యాంకు ఖాతాలపై నేరుగా చేయి వేయడం సరికాదు: దాసోజు శ్రవణ్
- ●Dasoju Sravan Kumar | ట్రాఫిక్ చలాన్ల ఆటో డెబిట్ ప్రతిపాదన రాజ్యాంగ విరుద్ధం
- ●realme P4s 5G | 8000 ఎంఏహెచ్ బ్యాటరీ, వాటర్, డస్ట్ రెసిస్టెన్స్‌తో.. రియల్‌మి కొత్త స్మార్ట్ ఫోన్..
- ●Ponguleti Srinivas Reddy | 15,475 మందికి రూ.185 కోట్లు విడుదల చేశాం.. రేపు చివరి బిల్లుల మొత్తం ఖాతాల్లో జమ చేస్తాం
- ●Harish Rao | కాంగ్రెస్ వైఫల్యానికి నాగార్జునసాగర్ కుడి కాలువ నీళ్లే సాక్ష్యం : హరీశ్‌రావు
- ●Stock Markets | అమెరికా ద్రవ్యోల్బణ భయాలు.. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..

Dasoju Sravan | ట్రాఫిక్ చలాన్ల ఆటో-డెబిట్ ప్రతిపాదన రాజ్యాంగ విరుద్ధం.. బ్యాంకు ఖాతాలపై నేరుగా చేయి వేయడం సరికాదు: దాసోజు శ్రవణ్

Dasoju Sravan Kumar | ట్రాఫిక్ చలాన్ల ఆటో డెబిట్ ప్రతిపాదన రాజ్యాంగ విరుద్ధం

realme P4s 5G | 8000 ఎంఏహెచ్ బ్యాటరీ, వాటర్, డస్ట్ రెసిస్టెన్స్‌తో.. రియల్‌మి కొత్త స్మార్ట్ ఫోన్..

Ponguleti Srinivas Reddy | 15,475 మందికి రూ.185 కోట్లు విడుదల చేశాం.. రేపు చివరి బిల్లుల మొత్తం ఖాతాల్లో జమ చేస్తాం



