త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gym Owner Shot Dead | 5 సెకన్ల‌లో 10 రౌండ్లు.. జిమ్ ఓన‌ర్‌పై బుల్లెట్ల వ‌ర్షం.. షాకింగ్ వీడియో

Gym Owner Shot Dead | హ‌ర్యానా (Haryana) హ‌న్సి (Hansi) ప్రాంతంలో షాకింగ్ ఘ‌ట‌న చోటు చేసుకుంది. జిమ్ ఓన‌ర్ క‌పిల్‌పై బిష్ణోయ్ గ్యాంగ్ విచ‌క్ష‌ణా ర‌హితంగా కాల్పుల‌కు తెగ‌బ‌డింది. పాయింట్ బ్లాక్ రేంజ్ నుంచి తూటాల వ‌ర్షం కురిపించింది.

D

National | Published On Jun 11, 2026, 3.58 pm IST

Gym Owner Shot Dead | 5 సెకన్ల‌లో 10 రౌండ్లు.. జిమ్ ఓన‌ర్‌పై బుల్లెట్ల వ‌ర్షం.. షాకింగ్ వీడియో
Advertisement

Gym Owner Shot Dead | హ‌ర్యానా (Haryana) రాష్ట్రంలో షాకింగ్ ఘ‌ట‌న చోటు చేసుకుంది. జిమ్ ఓన‌ర్‌పై ఇద్ద‌రు దుండగులు విచ‌క్ష‌ణార‌హితంగా కాల్పులు జ‌రిపారు (Gym Owner Shot Dead). పాయింట్ బ్లాక్ రేంజ్ నుంచి తూటాల వ‌ర్షం కురిపించారు. కేవ‌లం కొన్ని సెక‌న్ల వ్య‌వ‌ధిలోనే ఏకంగా 10 రౌండ్ల కాల్పులు జ‌రిపారు. ఈ ఘ‌ట‌న‌లో స‌ద‌రు జిమ్ ఓన‌ర్ అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయాడు.

ఈ ఘ‌ట‌న హ‌న్సి (Hansi) ప్రాంతంలో గురువారం ఉద‌యం చోటు చేసుకుంది. జిమ్ ఓన‌ర్‌ను క‌పిల్‌గా గుర్తించారు. అత‌డు ఫ‌వ్వారా చౌక్‌ ప్రాంతంలోని త‌న జిమ్ సెంట‌ర్ వ‌ద్ద‌ తెల్ల‌వారుజామున 5:30 గంట‌ల స‌మ‌యంలో స్టూడెంట్స్‌తో వ్యాయామం చేయిస్తున్నాడు. ఆ స‌మ‌యంలో బైక్‌పై వ‌చ్చిన ఇద్దరు వ్య‌క్తులు క‌పిల్‌కి అతి స‌మీపం నుంచి కాల్పులు జ‌రిపారు. త‌ల‌, వెనుక‌భాగంపై ఫైర్ చేశారు. కేవ‌లం 5 సెక‌న్ల‌లోనే ప‌ది రౌండ్ల కాల్పులు జ‌రిపారు. అనంత‌రం అక్క‌డి నుంచి పారిపోయారు. ఈ ఘ‌ట‌న‌లో క‌పిల్ అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘ‌ట‌న‌లో శిఖ అనే మ‌హిళ కూడా తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఆమెను వెంట‌నే చికిత్స నిమిత్తం ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

ఘ‌ట‌న‌కు సంబంధించిన సీసీటీవీ వీడియో ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతోంది. స‌మాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకొని ప‌రిస్థితిని ప‌రిశీలించారు. ఈ మేర‌కు నిందితుల‌ను ప‌ట్టుకునేందుకు సీసీటీవీ ఫుటేజ్‌ను ప‌రిశీలిస్తున్నారు. మ‌రోవైపు ఈ ఘ‌ట‌న‌కు బిష్ణోయ్ గ్యాంగ్ (Bishnoi gang) బాధ్య‌త వ‌హించింది. ఆ గ్యాంగ్‌కు చెందిన హ‌రి బాక్స‌ర్ (gangster Hari Boxer) ఆడియో విడుద‌ల చేశారు.

Also Read..

స్కూళ్ల ప్రారంభం వాయిదా వెనుక రూ. 2 వేల కోట్ల కుంభ‌కోణం : హ‌రీశ్‌రావు

కాంగ్రెస్ అనుకూల ఓట్ల‌ను తొల‌గించే కుట్ర జ‌రుగుతోంది: మంత్రి వివేక్‌

"ఈ దాడులు తక్షణమే ఆగాలి!" - అమెరికాకు భారత స్ట్రాంగ్ వార్నింగ్

Advertisement

తాజావార్తలు

Advertisement