త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Pinarayi Vijayan | కేర‌ళ మాజీ సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్ కుమార్తెకు ఈడీ స‌మ‌న్లు

Pinarayi Vijayan | కేర‌ళ (Kerala) మాజీ ముఖ్య‌మంత్రి పిన‌ర‌యి విజ‌య‌న్ (Pinarayi Vijayan) కుమార్తె వాణీ విజ‌య‌న్ (Veena Vijayan)కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (Enforcement Directorate) సమన్లు జారీ చేసింది.

D

National | Published On Jun 9, 2026, 11.38 am IST

Pinarayi Vijayan | కేర‌ళ మాజీ సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్ కుమార్తెకు ఈడీ స‌మ‌న్లు
Advertisement

Pinarayi Vijayan | కేర‌ళ (Kerala) మాజీ ముఖ్య‌మంత్రి పిన‌ర‌యి విజ‌య‌న్ (Pinarayi Vijayan) కుమార్తె వాణీ విజ‌య‌న్ (Veena Vijayan)కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (Enforcement Directorate) సమన్లు జారీ చేసింది. కొచ్చిన్‌ మిన‌ర‌ల్స్ అండ్ రూటైల్ లిమిటెడ్ (CMRL) అవినీతి కేసుకు (corruption case) సంబంధించిన మనీ లాండరింగ్ కేసు (Money Laundering Case)లో ఈ స‌మ‌న్లు జారీ చేసింది. శుక్ర‌వారం కొచ్చిలోని త‌మ కార్యాల‌యంలో విచార‌ణ‌కు హాజ‌రుకావాల‌ని అందులో ఆదేశించింది. వీణాతోపాటూ కొచ్చిన్ మిన‌ర‌ల్స్ అండ్ రూటైల్ లిమిటెడ్ సంస్థ‌కు చెందిన అధికారులు స‌హా మొత్తం తొమ్మిది మందికి స‌మ‌న్లు జారీ చేసిన‌ట్లు అధికార వ‌ర్గాలు తెలిపాయి.

కాగా, వీణ‌పై అవినీతి ఆరోప‌ణ‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. వీణ‌కు చెందిన ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (Exalogic Solutions Pvt Ltd), సీఎమ్ఆర్ఎల్ (Cochin Minerals and Rutile Limited) మ‌ధ్య రూ. 1.72 కోట్ల అక్ర‌మ లావాదేవీలు జ‌రిగిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. దీనిపై ఈడీ విచార‌ణ జ‌రుపుతోంది. ద‌ర్యాప్తులో భాగంగానే మాజీ సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్ నివాసం స‌హా కేర‌ళ వ్యాప్తంగా ప‌లు ప్రాంతాల్లో ఈడీ అధికారులు ఇటీవ‌లే సోదాలు నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. ఆ స‌మ‌యంలో స్వాధీనం చేసుకున్న ప‌త్రాలు, డిజిట‌ల్ ఆధారాల‌ను వారి ముందు ఉంచి ప‌శ్నించే అవ‌కాశం ఉంది.

Also Read..

హ‌ర్మూజ్ స‌మీపంలో కూలిన యూఎస్ అపాచీ హెలికాప్ట‌ర్‌

డీకేకి త‌గ్గ‌ని త‌ల‌నొప్పి.. శాఖ‌ల కేటాయింపుల‌పై కొన‌సాగుతున్న మంత్రుల అల‌క‌.. ఢిల్లీకి క్యూ

బ‌ల‌ప‌డుతున్న సెంటిమెంట్‌.. స్వ‌ల్పంగా పెరిగిన బంగారం ధ‌ర‌లు..

Advertisement
Advertisement