త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bandi Sanjay | 20 ఏళ్ల నుంచి జ్వ‌రం లేదు.. నాకు మోదీనే స్ఫూర్తి : బండి సంజ‌య్

Bandi Sanjay | ఆరోగ్యం విష‌యంలో నాకు న‌రేంద్ర మోదీనే స్ఫూర్తి అని కేంద్ర మంత్రి బండి సంజ‌య్ పేర్కొన్నారు. నాకు 20 ఏళ్ల నుంచి జ్వ‌రం, ద‌గ్గు లేద‌ని ఆయ‌న తెలిపారు.

S

Telangana | Published On Jun 11, 2026, 4.32 pm IST

Bandi Sanjay | 20 ఏళ్ల నుంచి జ్వ‌రం లేదు.. నాకు మోదీనే స్ఫూర్తి : బండి సంజ‌య్
Advertisement

Bandi Sanjay | త్రినేత్ర‌.న్యూస్ : ఆరోగ్యం విష‌యంలో నాకు న‌రేంద్ర మోదీనే స్ఫూర్తి అని కేంద్ర మంత్రి బండి సంజ‌య్ పేర్కొన్నారు. నాకు 20 ఏళ్ల నుంచి జ్వ‌రం, ద‌గ్గు లేద‌ని ఆయ‌న తెలిపారు. జ‌మ్మికుంట‌లో ప్ర‌కృతి వ్య‌వ‌సాయంపై నిర్వ‌హించిన రైతు స‌మ్మేళ‌నానికి బండి సంజ‌య్ ముఖ్య అతిథిగా హాజ‌రై ప్ర‌సంగించారు.

గో మాత, భూమాత, భార‌త్ మాత నినాదంతో ప్ర‌కృతి వ్య‌వ‌సాయ‌మే మంచిద‌నే విధానంతో కృషి విజ్ఞాన కేంద్రం వారు చేస్తున్న కృషి అభినంద‌నీయం. ప్ర‌స్తుతం 10 వేల ఎక‌రాల్లో ప్ర‌కృతి వ్య‌వ‌సాయం చేస్తున్నారు. మ‌రో 50 ఎక‌రాల్లో విస్త‌రించేందుకు ముందుకు వ‌చ్చిన కృషి విజ్ఞాన కేంద్రాన్ని అభినందిస్తున్నాను. కోటి మంది రైతుల‌ను ప్ర‌కృతి వ్య‌వ‌సాయం దిశ‌గా త‌యారు చేస్తాన‌ని మాటిచ్చారు మోదీ. మీ ఎంపీగా క‌ష్ట‌ప‌డి ప‌ని చేస్తున్నాను.. 25 వేల మంది రైతులు ప్ర‌కృతి వ్య‌వ‌సాయం వైపు మ‌ళ్లించాలి. అందుకు ప్రోత్సాహం అందిస్తాను అని సంజ‌య్ పేర్కొన్నారు.

మ‌నం పైస‌లిచ్చి రోగాల‌ను కొనుకుంటున్నాం..

మ‌నం పైస‌లిచ్చి రోగాల‌ను కొనుకుంటున్నాం.. వృద్ధులు కూడా ఆరోగ్యంగా ఉంటున్నారు. ఇప్పుడు ప‌దేండ్ల పిల్ల‌ల‌కు బీపీ, షుగ‌ర్ వ‌స్తుంది. మిల్లెట్స్ తినాల‌ని వైద్యులు సూచిస్తున్నారు. ఉజ్బెకిస్థాన్ ఒక‌ప్పుడు వ్య‌వ‌సాయాధిరిత దేశం. ప్ర‌స్తుతం ఆ దేశం అడుక్కుతినే ప‌రిస్థితి వ‌చ్చింది. దిగుబ‌డి కోసం అధికంగా కెమిక‌ల్స్ వినియోగం వ‌ల్ల‌ భూముల‌న్ని స‌ర్వ‌నాశ‌నం అయ్యాయి. ప్ర‌పంచంలోనే క్యాన్స‌ర్ కేసులు అధికంగా న‌మోద‌వుతున్నాయి ఉజ్బెకిస్థాన్‌లో. పంజాబ్‌లో ఒక ఏరియాను క్యాన్స‌ర్ బ్లాక్‌గా ప్ర‌క‌టించారు. ఆ ఏరియాలోనే ఎక్కువ‌గా వ‌రి పండిస్తున్నారు. తెలంగాణ కూడా నాలుగో ఐదో ప్లేస్‌లో ఉంద‌ని బండి సంజ‌య్ తెలిపారు.

రైతులు కోటీశ్వ‌రులు అయ్యే ప‌రిస్థితి లేదు..

ఎక్కువ పాలు రావాల‌ని ఆవుల‌కు ఇంజెక్ష‌న్లు ఇస్తున్నారు. ప‌ది సంవ‌త్స‌రాలు పాలిచ్చే ఆవు.. రెండు మూడేండ్ల‌కు ప‌రిమితం అవుతుంది. ట్రీట్‌మెంట్ లేని గ‌డ్డి మందును వ్య‌వ‌సాయానికి వినియోగిస్తున్నారు. హైబ్రిడ్ మ్యాంగో తిని ఇద్ద‌ర‌మ్మాయిలు చ‌నిపోయారు. హైద‌రాబాద్‌లో పాలు తాగి మూడు రోజులు బెడ్ మీద ప‌డ్డాను. 20 ఏండ్ల నుంచి జ్వ‌రం లేదు. నాకు న‌రేంద్ర మోదీనే స్ఫూర్తి.. అమ్మ‌వారి భ‌క్తుడిని. చివ‌ర‌కు పాలు తాగి బెడ్ మీద ప‌డ్డాను. జ్వ‌రం, ద‌గ్గు, ద‌మ్ము, బీపీ, షుగ‌ర్ లేదు.. త‌ప్పు నాదే. ప్ర‌స్తుత కాలంలో ఈ పూట గురించి ఆలోచించ‌కూడ‌దు.. రైతులు కోటీశ్వ‌రులు అయ్యే ప‌రిస్థితి లేదు. ధాన్య‌మే కొనే ప‌రిస్థితి లేదు. స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. వీట‌న్నింటిని అధిగ‌మించి ప్ర‌కృతి వ్య‌వ‌సాయం వైపు మ‌ళ్లాలి. రోగాల‌కు కార‌కులం మ‌న‌మే.. నివార‌కులం కూడా మ‌న‌మే అని బండి సంజ‌య్ స్ప‌ష్టం చేశారు.

Advertisement
Advertisement