Indian Sailors | ఒమన్ తీరంలో వాణిజ్య నౌకపై అమెరికా దాడి.. ముగ్గురు భారత నావికులు మృతి
Indian Sailors | ఒమన్ తీరంలో (Oman Coast) వాణిజ్య నౌకపై అమెరికా దాడి చేసింది (US Attack On Ship). ఈ దాడిలో ముగ్గురు భారతీయ సెయిలర్లు (Indian Sailors) మృతి చెందారు.
Indian Sailors | ఒమన్ తీరంలో (Oman Coast) వాణిజ్య నౌకపై అమెరికా దాడి చేసింది (US Attack On Ship). ఈ దాడిలో ముగ్గురు భారతీయ సెయిలర్లు (Indian Sailors) మృతి చెందారు. ఈ విషయాన్ని షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ (Shipping Minister Sarbananda Sonowal) ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఇది చాలా విషాదకరమని.. ముగ్గురు నావికుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
కాగా, పలావు దేశ పతాకంతో వెళ్తున్న 'సెట్టెబెల్లో' (Settebello) అనే చమురు ట్యాంకర్‌పై ఒమన్ గల్ఫ్‌లో అమెరికా సైనిక దాడి చేసిన విషయం తెలిసిందే. గత వారం ఈ దాడి జరిగింది. ఇరాన్ నుండి చమురును రవాణా చేస్తోందనే కారణంతో దీనిపై దాడి చేసినట్లు అమెరికా సైన్యం తెలిపింది. ఆ సమయంలో అందులో మొత్తం 28 మంది సిబ్బంది ఉన్నారు. అందులో 24 మంది భారతీయ సిబ్బంది కాగా, విదేశీయుల్లో ఇద్దరు పాకిస్థానీలు, ఒకరు ఉక్రెయిన్ , రష్యా వ్యక్తి ఉన్నారు.
దాడి తర్వాత 21 మంది భారతీయ నావికులను ఒమన్ తీర రక్షణ దళం కాపాడింది. ముగ్గురు గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దురదృష్టవశాత్తూ గల్లంతైనట్లు భావించిన ఆ ముగ్గురు నావికులు మరణించినట్లు మంత్రి ఇవాళ వెల్లడించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మృతుల కుటుంబసభ్యులను ఆదుకునేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
It is deeply unfortunate to learn of the tragic incident aboard the Palau-flagged MT Settebello. Sadly, three Indian seafarers initially reported missing are now confirmed dead after bodies have been located and identified.
This is a profound loss to our maritime family. The…
— Sarbananda Sonowal (@sarbanandsonwal) June 11, 2026
ఒమన్ తీరంలో మరోనౌకపై దాడి..
గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో నౌకలే లక్ష్యంగా దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఒమన్‌లోని షినాస్ (Shinas) ఓడరేవు సమీపంలో ఒక వాణిజ్య నౌక లక్ష్యంగా దాడి జరిగినట్లు ఒమన్‌లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. ఈరోజు తెల్లవారుజామున ఈ దాడి జరిగినట్లు చెప్పింది. అయితే, అందుకు సంబంధించిన వివరాలను మాత్రం ఎంబసీ వెల్లడించలేదు. వారం రోజుల వ్యవధిలో ఒమన్ తీరంలో నౌకలపై జరిగిన మూడో దాడి ఇది.
Also Read..
సంబంధిత వార్తలు

Strait of Hormuz | హార్ముజ్ జలసంధి మాదే.. ఒమన్ అడ్డువస్తే బాంబులేస్తాం: ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్, బదులిచ్చిన టెహ్రాన్!
ఆగస్టు 18, 2026

Odesa Port Attack | ఉక్రెయిన్ రాయబారికి భారత్ సమన్లు
జులై 27, 2026

Indian Seafarers | పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు.. భారతీయ నావికుల భద్రతకు కేంద్రం కీలక నిర్ణయం
జులై 15, 2026
తాజావార్తలు
- ●Dasoju Sravan | ట్రాఫిక్ చలాన్ల ఆటో-డెబిట్ ప్రతిపాదన రాజ్యాంగ విరుద్ధం.. బ్యాంకు ఖాతాలపై నేరుగా చేయి వేయడం సరికాదు: దాసోజు శ్రవణ్
- ●Dasoju Sravan Kumar | ట్రాఫిక్ చలాన్ల ఆటో డెబిట్ ప్రతిపాదన రాజ్యాంగ విరుద్ధం
- ●realme P4s 5G | 8000 ఎంఏహెచ్ బ్యాటరీ, వాటర్, డస్ట్ రెసిస్టెన్స్‌తో.. రియల్‌మి కొత్త స్మార్ట్ ఫోన్..
- ●Ponguleti Srinivas Reddy | 15,475 మందికి రూ.185 కోట్లు విడుదల చేశాం.. రేపు చివరి బిల్లుల మొత్తం ఖాతాల్లో జమ చేస్తాం
- ●Harish Rao | కాంగ్రెస్ వైఫల్యానికి నాగార్జునసాగర్ కుడి కాలువ నీళ్లే సాక్ష్యం : హరీశ్‌రావు
- ●Stock Markets | అమెరికా ద్రవ్యోల్బణ భయాలు.. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..

Dasoju Sravan | ట్రాఫిక్ చలాన్ల ఆటో-డెబిట్ ప్రతిపాదన రాజ్యాంగ విరుద్ధం.. బ్యాంకు ఖాతాలపై నేరుగా చేయి వేయడం సరికాదు: దాసోజు శ్రవణ్

Dasoju Sravan Kumar | ట్రాఫిక్ చలాన్ల ఆటో డెబిట్ ప్రతిపాదన రాజ్యాంగ విరుద్ధం

realme P4s 5G | 8000 ఎంఏహెచ్ బ్యాటరీ, వాటర్, డస్ట్ రెసిస్టెన్స్‌తో.. రియల్‌మి కొత్త స్మార్ట్ ఫోన్..

Ponguleti Srinivas Reddy | 15,475 మందికి రూ.185 కోట్లు విడుదల చేశాం.. రేపు చివరి బిల్లుల మొత్తం ఖాతాల్లో జమ చేస్తాం



