త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rain | జనగామలో దంచికొట్టిన వాన‌.. కేర‌ళ‌లోకి ప్ర‌వేశించిన రుతుప‌వ‌నాలు

Rain | రాష్ట్రంలోని ప‌లు జిల్లాల్లో వ‌ర్షం (Rain) కురుస్తున్న‌ది. దీంతో గ‌త కొన్ని రోజులుగా ఎండ‌లు, అధిక వేడిమి, ఉక్క‌బోత‌తో ఇబ్బంది ప‌డుతున్న ప్ర‌జ‌ల‌కు ఊర‌ట ల‌భించింది. జ‌నగామ (Jangaon) జిల్లా కేంద్రంతోపాటు ప‌లు మండ‌లాల్లో ఉరుములు, మెరుపుల‌తో కూడిన భారీ వ‌ర్షం కురింది.

G

Telangana | Published On Jun 4, 2026, 6.30 pm IST

Rain | జనగామలో దంచికొట్టిన వాన‌.. కేర‌ళ‌లోకి ప్ర‌వేశించిన రుతుప‌వ‌నాలు
Advertisement

Rain | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్రంలోని ప‌లు జిల్లాల్లో వ‌ర్షం (Rain) కురుస్తున్న‌ది. దీంతో గ‌త కొన్ని రోజులుగా ఎండ‌లు, అధిక వేడిమి, ఉక్క‌బోత‌తో ఇబ్బంది ప‌డుతున్న ప్ర‌జ‌ల‌కు ఊర‌ట ల‌భించింది. జ‌నగామ (Jangaon) జిల్లా కేంద్రంతోపాటు ప‌లు మండ‌లాల్లో ఉరుములు, మెరుపుల‌తో కూడిన భారీ వ‌ర్షం కురింది. ఒక్క‌సారిగా వ‌ర్షం కుర‌వ‌డంతో వాతావ‌ర‌ణం మారిపోయింది.

కామారెడ్డి (Kamareddy) జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. కామారెడ్డి పట్టణంలో భారీ వర్షంతో కాలనీలు జలమయమయ్యాయి. దోమకొండ, బీబీపేట, మాచారెడ్డి, బిక్కనూరు, జుక్కల్ మండలాల్లో వర్షం కురిసింది. వర్షానికి జుక్కల్ మండలంలో జొన్న సంచులు తడిసిపోయాయి. హైద‌రాబాద్‌లో కూడా వాతావ‌ర‌ణం చ‌ల్ల‌బ‌డింది. న‌గ‌రంలో అక్క‌డ‌క‌క్క‌డ స‌న్న‌ని జ‌ల్లులు కురుస్తున్నాయి.

కేర‌ళ‌లోకి ప్ర‌వేశించిన రుతుప‌వ‌నాలు..

మ‌రోవైపు నైరుతి రుతుప‌వ‌నాలు (Southwest Monsoon) కేర‌ళ‌లోకి (Kerala) ప్ర‌వేశించాయి. దీంతో అక్కడ విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. రానున్న రోజుల్లో ఇవి దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించనున్నాయి. ఈ నేప‌థ్యంలో దేశంలో వర్షాకాలం ప్రారంభమైంద‌ని ఐఎండీ ప్రకటించింది. సాధార‌ణంగా ప్ర‌తి ఏడాది జూన్ 1న నైతురి రుతుప‌వ‌నాలు కేర‌ళ తీరాన్ని తాకుతాయి. అయితే ఈ సారి నాలుగు రోజులు ఆలస్య‌మైంది.

సాధారణ పరిస్థితులు కొనసాగితే మ‌రో వారం రోజుల్లో తెలంగాణ‌లోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ‌ అంచనా వేస్తున్నది. దీంతో ప్రస్తుతం తీవ్ర ఎండలతో ఇబ్బందులు పడుతున్న ప్ర‌జ‌ల‌కు ఉపశమనం లభించే అవకాశం ఉంది.

Advertisement
Advertisement