Stock Markets | పశ్చిమ ఆసియా యుద్ధ భయాలు.. స్టాక్ మార్కెట్లలో భారీ నష్టాలు..
Stock Markets | పశ్చిమ ఆసియాలో అమెరికా-ఇరాన్‌ల మధ్య కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతలతోపాటు పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాల్లో ముగిశాయి. ఉదయం గ్యాప్ డౌన్‌తో ప్రారంభమైనా ఆ తరువాత పూర్తిగా రికవర్ అయి ఇంట్రా డే గరిష్టానికి సూచీలు చేరుకున్నాయి.
Stock Markets | పశ్చిమ ఆసియాలో అమెరికా-ఇరాన్‌ల మధ్య కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతలతోపాటు పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాల్లో ముగిశాయి. ఉదయం గ్యాప్ డౌన్‌తో ప్రారంభమైనా ఆ తరువాత పూర్తిగా రికవర్ అయి ఇంట్రా డే గరిష్టానికి సూచీలు చేరుకున్నాయి. కానీ ఉదయం సెషన్‌లో వచ్చిన లాభాలను నిలబెట్టుకోలేకపోయాయి. పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు ఆసక్తి చూపించారు. దీంతో మార్కెట్లు నష్టాల్లో కొనసాగాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 150.63 పాయింట్లు పతనమై 73,832.55 వద్ద ముగియగా, నిఫ్టీ50 సూచీ 53.35 పాయింట్లు తగ్గి 23,161.60 వద్ద స్థిరపడింది. మార్కెట్ సెంటిమెంట్ బలహీనంగా ఉండడంతో పెట్టుబడిదారులపై తీవ్ర అమ్మకాల ఒత్తిడి నెలకొంది. కాగా టెక్నాలజీ స్టాక్స్ టాప్ లూజర్ల జాబితాలో నిలిచాయి. పలు టెక్ కంపెనీల షేర్లు భారీగా నష్టపోయాయి. అలాగే ఆటో, రియాల్టీ, సిమెంట్, పీఎస్‌యూ బ్యాంకుల షేర్లు కనిష్టాల వద్ద ట్రేడ్ అయ్యాయి.
ఆసియా మార్కెట్లు సైతం..
సెక్టార్ల వారీగా చూస్తే బ్యాంకింగ్, ప్రైవేటు బ్యాంక్స్, ఫార్మా, హెల్త్ కేర్ రంగాలు ఫర్వాలేదనిపించాయి. మొత్తంగా చూస్తే పెట్టుబడిదారులు సురక్షిత ధోరణి వైపు మళ్లుతున్నట్లు మార్కెట్లను చూస్తే స్పష్టమవుతోంది. ఆసియా మార్కెట్లలోనూ ప్రతికూల సంకేతాలు కనిపించాయి. జపాన్ నిక్కీ 225 సూచీ 1.2 శాతం పతనమైంది. టోపిక్స్ 1.2 శాతం, హాంగ్ కాంగ్ హాంగ్ సెంగ్ 0.1 శాతం, షాంగై కంపోజిట్ ఇండెక్స్ 0.2 శాతం తగ్గాయి. ఆస్ట్రేలియా ఏఎస్ఎక్స్ 200 సూచీ 0.4 శాతం నష్టపోయింది. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు స్వల్పంగా తగ్గాయి. 2.27 శాతం మేర తగ్గిన బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్‌కు 91.36 డాలర్ల వద్ద ఉండగా, డబ్ల్యూటీఐ క్రూడ్ ధర 2.37 శాతం తగ్గి బ్యారెల్‌కు 87.89 వద్ద నిలిచింది. ఫారెక్స్ మార్కెట్‌లో రూపాయి విలువ మరోమారు పతనమైంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి 50 పైసలు నష్టపోయి 95.76 వద్ద నిలిచింది.
తీవ్ర అస్థిరతతో సూచీలు..
గురువారం సెషన్ మొత్తం తీవ్ర అస్థిరతతో సూచీలు కదిలాయి. సెన్సెక్స్ 73,615 వద్ద ఓపెన్ అయి ఇంట్రా డే కనిష్టం 73,518ని తాకింది. తరువాత కాస్త రికవర్ అయి 74,394 వద్దకు చేరింది. ఇక నిఫ్టీ 23,072, 23,327 మధ్య కదిలింది. ఉదయం గ్యాప్ డౌన్ తరువాత రికవర్ అయినప్పటికీ లాభాలు ఎక్కువ సేపు నిలవలేదు. కాగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగ సూచీ నిఫ్టీ ఐటీ 1.62 శాతం మేర క్షీణించింది. సెన్సెక్స్‌లో ఇన్ఫోసిస్ 2.28 శాతం తగ్గి టాప్ లూజర్‌గా నిలవగా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్లు 1.61 శాతం మేర పతనమయ్యాయి. టీసీఎస్ 0.78 శాతం తగ్గింది. అదానీ పోర్ట్స్, హిందుస్థాన్ యూనిలివర్, బజాజ్ ఫైనాన్స్ వంటి స్టాక్స్ కూడా నష్టాలను చవి చూశాయి. ఇక సెన్సెక్స్‌లో మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు భారీగా పెరిగి టాప్ గెయినర్‌గా నిలవగా, ఐసీఐసీఐ, కోటక్ మహీంద్రా బ్యాంక్, సన్ ఫార్మా, భారతి ఎయిర్ టెల, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆ తరువాతి స్థానాల్లో నిలిచాయి.
బెంచ్ మార్క్ సూచీల కన్నా విస్తృత మార్కెట్ సూచీలు కాస్త తక్కువ ప్రదర్శన నమోదు చేశాయి. నిఫ్టీ నెక్ట్స్ 50 1.12 శాతం క్షీణించగా, నిఫ్టీ మిడ్ క్యాప్ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 సూచీలు 0.81, 0.67 శాతం చొప్పున తగ్గాయి. నిఫ్టీ మీడియా 1.78 శాతం పెరగ్గా, నిఫ్టీ ఫార్మా 0.61 శాతం పెరిగింది. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ రంగం 0.89 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ 0.89 శాతం, నిఫ్టీ కన్‌జ్యూమర్ డ్యూరబుల్స్ 1.15 శాతం తగ్గాయి.
తాజావార్తలు
- ●Harish Rao | ఫ్యూచర్ సిటీని కచ్చితంగా రద్దు చేస్తాం.. తేల్చిచెప్పిన హరీశ్‌రావు
- ●Gym Owner Shot Dead | 5 సెకన్లలో 10 రౌండ్లు.. జిమ్ ఓనర్‌పై బుల్లెట్ల వర్షం.. షాకింగ్ వీడియో
- ●Harish Rao | స్కూళ్ల ప్రారంభం వాయిదా వెనుక రూ. 2 వేల కోట్ల కుంభకోణం : హరీశ్‌రావు
- ●Vivek Venkataswamy | కాంగ్రెస్ అనుకూల ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోంది
- ●Settebello Ship Attack | "ఈ దాడులు తక్షణమే ఆగాలి!" - అమెరికాకు భారత స్ట్రాంగ్ వార్నింగ్
- ●Aishwarya Rajesh | నాయుడు రాజకీయాలు టార్గెట్ - ఐశ్వర్య రాజేష్ తెలుగు పొలిటికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రిలీజ్ డేట్ ఫిక్స్

Harish Rao | ఫ్యూచర్ సిటీని కచ్చితంగా రద్దు చేస్తాం.. తేల్చిచెప్పిన హరీశ్‌రావు

Gym Owner Shot Dead | 5 సెకన్లలో 10 రౌండ్లు.. జిమ్ ఓనర్‌పై బుల్లెట్ల వర్షం.. షాకింగ్ వీడియో

Harish Rao | స్కూళ్ల ప్రారంభం వాయిదా వెనుక రూ. 2 వేల కోట్ల కుంభకోణం : హరీశ్‌రావు

Vivek Venkataswamy | కాంగ్రెస్ అనుకూల ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోంది






