Indian Mangoes | భారతీయ మామిడి పండ్లపై నేపాల్ నిషేధం..? కేంద్రం క్లారిటీ
Indian Mangoes | భారతదేశం నుంచి మామిడి పండ్ల (Indian Mangoes) దిగుమతులను నేపాల్ నిషేధించిందంటూ వస్తున్న వార్తలను కేంద్రం తోసిపుచ్చింది. నిషేధం అంటూ వస్తున్న నివేదికలు పూర్తిగా నిరాధారమైనవని, వాస్తవాలను తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయని ఓ అధికారిక ప్రకటనలో తెలిపింది.
Indian Mangoes | భారతదేశం నుంచి మామిడి పండ్ల (Indian Mangoes) దిగుమతులను నేపాల్ నిషేధించిందంటూ (Nepal Banning Indian Mangoes) వస్తున్న వార్తలను కేంద్రం ఖండించింది. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. నేపాల్ విధించిన కొత్త ఫైటోసానిటరీ నిబంధనలకు అనుగుణంగా ఎగుమతులు కొనసాగుతున్నాయని స్పష్టం చేసింది. భారత మామిడిపండ్లపై నేపాల్ ఎలాంటి ఆంక్షలు విధించలేదని తెలిపింది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.
నేపాల్ ప్రభుత్వం తన ‘ప్లాంట్ క్వారంటైన్, పెస్టిసైడ్ మేనేజ్‌మెంట్ సెంటర్ (నేపాల్ నేషనల్ ప్లాంట్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్)’ ద్వారా భారతీయ మామిడి దిగుమతులపై ఎటువంటి నిషేధం విధించలేదని స్పష్టం చేసినట్లు కేంద్రం తెలిపింది. నిషేధం అంటూ వస్తున్న నివేదికలు పూర్తిగా నిరాధారమైనవని, వాస్తవాలను తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయని ఓ అధికారిక ప్రకటనలో తెలిపింది. పొరుగు దేశానికి ఎలాంటి అంతరాయాలూ లేకుండా ఎగుమతులు కొనసాగుతున్నట్లు స్పష్టం చేసింది. మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. జనవరి 2026 నుంచి భారతదేశం 2,005 మెట్రిక్ టన్నుల మామిడి పండ్లను నేపాల్‌కు ఎగుమతి చేసింది. ఒక్క జూన్ నెలలోనే 266 మెట్రిక్ టన్నుల మ్యాంగోస్ ఎగుమతయ్యాయి.
Also Read..
ఒమన్ తీరంలో వాణిజ్య నౌకపై అమెరికా దాడి.. ముగ్గురు భారత నావికులు మృతి
రూటు మార్చిన ఎయిర్‌టెల్.. ప్రయారిటీ పోస్ట్‌పెయిడ్ ను ఫాస్ట్ లేన్‌గా మార్పు..
తాజావార్తలు
- ●Stock Markets | అమెరికా ద్రవ్యోల్బణ భయాలు.. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..
- ●Dasoju Sravan Kumar | కుల గణనలో ఓబీసీ కేటగిరీ చేర్చాలి
- ●Accident in America | అమెరికాలో చెట్టును ఢీకొట్టిన కారు.. ముగ్గురు తెలంగాణ విద్యార్థుల దుర్మరణం
- ●IPO | ఐపీఓ మార్కెట్లలో జోరు.. ఈ నాలుగు ఇష్యూలపై ఇన్వెస్టర్ల ఫోకస్..
- ●Vemula Prashanth Reddy | ఎథిక్స్ గురించి మాట్లాడే అర్హత సీఎంకు ఉందా..?
- ●Konda Murali | కాంగ్రెస్‌ను వీడం.. నా బిడ్డ వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు: కొండా మురళి

Stock Markets | అమెరికా ద్రవ్యోల్బణ భయాలు.. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..

Dasoju Sravan Kumar | కుల గణనలో ఓబీసీ కేటగిరీ చేర్చాలి

Accident in America | అమెరికాలో చెట్టును ఢీకొట్టిన కారు.. ముగ్గురు తెలంగాణ విద్యార్థుల దుర్మరణం

IPO | ఐపీఓ మార్కెట్లలో జోరు.. ఈ నాలుగు ఇష్యూలపై ఇన్వెస్టర్ల ఫోకస్..






