Jailer 2 | రజనీకాంత్ జైలర్ 2లో గెస్ట్‌గా బాలీవుడ్ హీరో కన్ఫామ్ – నలభై ఏళ్ల తర్వాత కాంబో రిపీట్
రజనీకాంత్ జైలర్ 2లో గెస్ట్‌గా బాలీవుడ్ టాప్ హీరో హృతిక్ రోషన్ కనిపించబోతున్నాడు. తొలుత ఈ పాత్రను షారుఖ్‌ఖాన్ చేసే అవకాశం ఉందంటూ ప్రచారం జరిగింది. డేట్స్ ఇష్యూస్‌తో షారుఖ్ ఖాన్ తప్పుకోవడంతో హృతిక్ రోషన్‌ను మేకర్స్ ఫైనల్ చేశారట.
Entertainment | Published On Jun 11, 2026, 4.24 pm IST
Jailer 2 | రజనీకాంత్ హీరోగా నటించిన జైలర్ కోలీవుడ్ హిస్టరీలోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. నెల్సన్ డైరెక్షన్‌లో యాక్షన్ కామెడీగా రూపొందిన ఈ మూవీ 650 కోట్ల వసూళ్లను దక్కించుకుంది. ఈ బ్లాక్‌బస్టర్ మూవీకి సీక్వెల్ రాబోతుంది. జైలర్‌లోని పాత్రలను తీసుకొని సరికొత్త కథతో దర్శకుడు నెల్సన్ జైలర్ 2ను రూపొందిస్తున్నారు.
షారుఖ్ ఖాన్...
జైలర్‌లో శివరాజ్‌కుమార్, మోహన్‌లాల్ గెస్ట్‌లుగా కనిపించారు. సీక్వెల్‌లో వీరిద్దరితో పాటు వివిధ భాషలకు చెందిన మరికొందరు స్టార్ హీరోలు అతిథులుగా కనిపించబోతున్నారట. బాలీవుడ్ నటుడు షారుఖ్‌ఖాన్ జైలర్ 2లో గెస్ట్‌గా కనిపించే అవకాశం ఉందంటూ ప్రచారం జరిగింది. కానీ కింగ్ సినిమాతో బిజీగా ఉన్న షారుఖ్ ఈ ఆఫర్‌ను రిజెక్ట్ చేశాడు. షారుఖ్ ప్లేస్‌లో హృతిక్ రోషన్ రజనీకాంత్ సినిమాలో అతిథి పాత్రలో కనిపించబోతున్నాడు. జూలై 22, 23 రెండు రోజుల్లో హృతిక్ రోషన్ పాత్రకు సంబంధించిన సీన్లను చెన్నైలోని వేసిన స్పెషల్ సెట్స్‌లో షూట్ చేయబోతున్నారట.
విజువల్ ఫీస్ట్...
కథలో చాలా కీలక సందర్భంలో హృతిక్ రోషన్ పాత్ర ఎంట్రీ ఇస్తుందట. రజనీకాంత్, హృతిక్ రోషన్ కాంబినేషన్‌లో వచ్చే సీన్లు అభిమానులకు విజువల్ ఫీస్ట్‌లా నిలవడం ఖాయమని అంటున్నారు. హృతిక్ రోషన్‌తో పాటు మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, విజయ్ సేతుపతి, మిథున్ చక్రవర్తి జైలర్ 2లో అతిథి పాత్రల్లో తళుక్కున మెరవబోతున్నారు. విద్యాబాలన్, రమ్యకృష్ణ , యోగిబాబు, ఎస్‌జే సూర్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
నలభై ఏళ్ల తర్వాత...
రజనీకాంత్, హృతిక్ రోషన్ కాంబోలో జైలర్ 2 కంటే ముందు ఓ సినిమా వచ్చింది. రజనీకాంత్ హీరోగా 1986లో వచ్చిన బాలీవుడ్ మూవీ భగవాన్ దాదాలో హృతిక్ రోషన్ చైల్డ్ యాక్టర్‌గా కనిపించాడు. సూపర్ స్టార్ కొడుకు పాత్రలో నటించాడు. మళ్లీ నలభై ఏళ్ల తర్వాత వీరిద్దరి కాంబోలో సినిమా రాబోతుండటం ఆసక్తికరంగా మారింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Ravi Teja | ట్రాన్స్‌జెండర్‌గా మాస్ మహారాజా - రూమర్లలో నిజమెంత?
- ●Meenakshi Natarajan | మీనాక్షి నటరాజన్‌కు బిగ్ షాక్.. ముగ్గురు బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవం
- ●Jawaharlal Nehru vs Savarkar | నెహ్రూ vs సావర్కర్: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌పై కాంగ్రెస్ పోలీస్ కంప్లైంట్
- ●Tollywood | సినిమాల్లోకి రాకముందు సేల్స్ గర్ల్‌గా పనిచేశా - టాలీవుడ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!
- ●Amazfit Cheetah | చీతా సిరీస్‌లో రెండు పవర్ఫుల్ స్మార్ట్ వాచ్‌లను లాంచ్ చేసిన అమేజ్‌ఫిట్
- ●TMC-Congress | కాంగ్రెస్‌లో టీఎంసీ విలీనం..? క్లారిటీ ఇచ్చిన కేసీ వేణుగోపాల్

Ravi Teja | ట్రాన్స్‌జెండర్‌గా మాస్ మహారాజా - రూమర్లలో నిజమెంత?

Meenakshi Natarajan | మీనాక్షి నటరాజన్‌కు బిగ్ షాక్.. ముగ్గురు బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవం

Jawaharlal Nehru vs Savarkar | నెహ్రూ vs సావర్కర్: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌పై కాంగ్రెస్ పోలీస్ కంప్లైంట్

Tollywood | సినిమాల్లోకి రాకముందు సేల్స్ గర్ల్‌గా పనిచేశా - టాలీవుడ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!






