త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KC Venugopal | కేర‌ళం సీఎంగా కేసీ వేణుగోపాల్‌..? ఎమ్మెల్యేల మ‌ద్ద‌తు లిస్ట్ లీక్‌..

KC Venugopal | కేర‌ళం త‌దుప‌రి ముఖ్య‌మంత్రిగా కాంగ్రెస్‌ పార్టీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీగా ఉన్న‌ కేసీ వేణుగోపాల్ (KC Venugopal) పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. మొత్తం 63 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌లో 47 మంది కేసీ వేణుగోపాల్‌కు మ‌ద్ద‌తిచ్చిన‌ట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్యేల మ‌ద్ద‌తుతో కూడిన లిస్ట్ లీక‌వ‌డంతో ఈ విష‌యం వెలుగులోకి వ‌చ్చింది.

D

National | Published On May 8, 2026, 2.53 pm IST

KC Venugopal | కేర‌ళం సీఎంగా కేసీ వేణుగోపాల్‌..? ఎమ్మెల్యేల మ‌ద్ద‌తు లిస్ట్ లీక్‌..
Advertisement

KC Venugopal | కేర‌ళం త‌దుప‌రి ముఖ్య‌మంత్రి ఎవ‌ర‌న్న‌ది ప్ర‌స్తుతం ఆస‌క్తిక‌రంగా మారింది. ఇటీవ‌లే జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఎల్డీఎఫ్ కూట‌మిని యూడీఎఫ్ చిత్తుగా ఓడించిన విష‌యం తెలిసిందే. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ 102 సీట్లు గెలుచుకుంది. ఇక హ‌స్తం పార్టీ 63 చోట్ల గెలుపొందింది. దీంతో రాష్ట్రంలో అధికారం చేప‌ట్టేందుకు హ‌స్తం పార్టీ సిద్ధ‌మైంది. అయితే, సీఎం ఎవరు అనేదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ క్ర‌మంలో ప‌లువురు సీనియ‌ర్ నేత‌ల పేర్లు తెర‌పైకి (Kerala Congress CM Race) వ‌చ్చాయి.

అయితే, అందులో ప్ర‌ముఖంగా వినిపిస్తున్నది మాత్రం ఆ పార్టీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ కేసీ వేణుగోపాల్ (KC Venugopal) పేరే. కొత్త‌గా ఎన్నికైన ఎమ్మెల్యేలు కూడా ఆయ‌న‌వైపే మొగ్గుచూపారు. ఈ మేర‌కు ఏఐసీసీ (AICC) పరిశీలకులు ముకుల్ వాస్నిక్, అజ‌య్ మాకెన్ కాంగ్రెస్ శాస‌న‌స‌భాప‌క్ష సమావేశం నిర్వ‌హించి ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని సేక‌రించారు. మొత్తం 63 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌లో 47 మంది కేసీ వేణుగోపాల్‌కు మ‌ద్ద‌తిచ్చారు. ఎమ్మెల్యేల మ‌ద్ద‌తుతో కూడిన లిస్ట్‌ను స‌మావేశం అనంత‌రం ముకుల్ వాస్నిక్ తీసుకెళ్తుండ‌గా.. అది మీడియా కంట‌ప‌డింది. ఆ లిస్ట్ ఇప్పుడు వైర‌ల్ అవుతోంది. ఆ లిస్ట్ ప్ర‌కారం.. మెజారిటీ ఎమ్మెల్యేల మ‌ద్ద‌తు కేసీ వేణుగోపాల్‌కే ఉన్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఇదిలా ఉండ‌గా.. సీఎం రేసులో రమేష్ చెన్నితల కూడా ఉన్నారు. వీరిలో ఎవ‌రు సీఎం అవుతార‌న్న‌ది ప్ర‌స్తుతం స‌స్పెన్స్‌.

కేసీ వేణుగోపాల్.. కాంగ్రెస్ పార్టీలో, జాతీయ స్థాయిలో కీలక నేతగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన కేరళంలోని అలప్పుజ‌ నియోజకవర్గం నుంచి లోక్‌సభ ఎంపీగా కొనసాగుతున్నారు. కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్‌కు అత్యంత స‌న్నిహితుడిగా కేసీకి పేరుంది. గాంధీ కుటుంబంతో ఆయ‌న‌కు మంచి అనుబంధం ఉంది. రాష్ట్రంలో హ‌స్తం పార్టీని అధికారంలోకి తేవ‌డంలో ఆయ‌న కీలక పాత్ర పోషించారు. దీంతో అధిష్టానం కూడా కేసీవైపే మొగ్గుచూపే అవ‌కాశం ఎక్కువ‌గా క‌నిపిస్తోంది.

Also Read..

విజయం తథ్యం.. టీవీకే విజ‌య్ ఆస‌క్తిక‌ర ట్వీట్‌

బండి సంజ‌య్ రేవంత్ రెడ్డిని ప్రియురాలిని జ‌డ‌తో కొట్టిన‌ట్టు కొడుతుంటాడు : ఎమ్మెల్సీ దేశ‌ప‌తి

దేశంలో భారీ ఉగ్ర‌దాడుల‌కు ఐఎస్‌ఐ కుట్ర

Advertisement
Advertisement