త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MLC Deshapathi Srinivas | బండి సంజ‌య్ రేవంత్ రెడ్డిని ప్రియురాలిని జ‌డ‌తో కొట్టిన‌ట్టు కొడుతుంటాడు : ఎమ్మెల్సీ దేశ‌ప‌తి

MLC Deshapathi Srinivas | రాష్ట్రంలో అరాచ‌కం సృష్టిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి బండి సంజ‌య్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశ‌ప‌తి శ్రీనివాస్ నిప్పులు చెరిగారు. పొద్దున లేస్తే కేసీఆర్, కేటీఆర్‌ను తిట్ట‌డ‌మే తప్పా.. బండి సంజ‌య్ నోట ఇంకో మాట విన‌లేదు అని దేశ‌ప‌తి తెలిపారు. రేవంత్ రెడ్డిని మాత్రం ప్రియురాలిని జ‌డతో కొట్టిన‌ట్టు కొడుతుంటాడు అప్పుడప్పుడు అని దేశ‌ప‌తి విమ‌ర్శించారు.

S

Telangana | Published On May 8, 2026, 1.48 pm IST

MLC Deshapathi Srinivas | బండి సంజ‌య్ రేవంత్ రెడ్డిని ప్రియురాలిని జ‌డ‌తో కొట్టిన‌ట్టు కొడుతుంటాడు : ఎమ్మెల్సీ దేశ‌ప‌తి
Advertisement

MLC Deshapathi Srinivas | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్రంలో అరాచ‌కం సృష్టిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి బండి సంజ‌య్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశ‌ప‌తి శ్రీనివాస్ నిప్పులు చెరిగారు. పొద్దున లేస్తే కేసీఆర్, కేటీఆర్‌ను తిట్ట‌డ‌మే తప్పా.. బండి సంజ‌య్ నోట ఇంకో మాట విన‌లేదు అని దేశ‌ప‌తి తెలిపారు. రేవంత్ రెడ్డిని మాత్రం ప్రియురాలిని జ‌డతో కొట్టిన‌ట్టు కొడుతుంటాడు అప్పుడప్పుడు అని దేశ‌ప‌తి విమ‌ర్శించారు. డీజీపీని క‌లిసిన అనంత‌రం ఎమ్మెల్సీ దేశ‌ప‌తి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రంలో నెల‌కొన్న అరాచ‌క ప‌రిస్థితుల గురించి మా ఆందోళ‌న‌ల‌ను, ఫిర్యాదుల‌ను డీజీపీకి అంద‌జేశాం. రాజ్యాంగాన్ని ర‌క్ష‌ణ చేయాల్సిన కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి.. గూండాల‌ను పంపి దాడులు చేయిస్తున్నాడు. ఈ రాష్ట్రంలో సీఎంగా, హోం మంత్రిగా ఉన్నాయ‌న వ‌రుస‌గా రెండున్న‌రేండ్ల నుంచి బీఆర్ఎస్ క్యాంపు ఆఫీసుల‌పై దాడులు చేయిస్తున్నాడు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కార్యాల‌యాలు అంటే అవి ప్ర‌జ‌ల ఆస్తులు. అవేమీ ప్ర‌యివేటు బిల్డింగ్స్ కాదు. ప్ర‌భుత్వ‌మే ప్ర‌భుత్వ ఆస్తుల‌పై దాడులు చేయ‌డం వికృతం, విడ్డూర‌మే కాదు.. ప‌ర‌మ నేరం. ఇవాళ నేర‌మే అధికార‌మై కూర్చుంది. నేర‌స్తులే మంత్రులు అవుతున్న‌రు. నేర‌పూరిత‌మైన పరిపాల‌న సాగుతుంది అని మండిప‌డ్డారు.

కాసేపు వ‌దులుగా ప‌ట్టుకుంటారు.. కాసేపు గ‌ట్టిగా ప‌ట్టుకుంటారు..

సిద్దిపేట‌, గజ్వేల్, హుజురాబాద్, క‌రీంన‌గ‌ర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాల‌యాలు, మేడ్చ‌ల్ ఆఫీసు మీద దాడి చేయించారు.. ఈ దాడుల‌ను ప్ర‌భుత్వమే ప్రోత్స‌హిస్తుంది. గూండాలు రెచ్చిపోతున్నారు. కౌశిక్ రెడ్డిని చంపేస్తామ‌ని బాహాటంగా ప్ర‌క‌టిస్తున్నారు. పోలీసులు గూండాల‌ను బుజ్జ‌గిస్తున్నారు. వాళ్ల న‌డుము ప‌ట్టుకుని బ‌తిమిలాడుతూ.. కాసేపు వ‌దులుగా ప‌ట్టుకుంటారు.. కాసేపు గ‌ట్టిగా ప‌ట్టుకుంటారు.. ఇంకో రెండు ప‌గుల‌గొట్టండ‌ని చెబుతున్న‌ట్టు పోలీసుల వైఖ‌రి ఉంది. ఇవ‌న్నీ చూస్తుంటే పోలీసులు ఉన్న‌ట్టా..? శాంతి భ‌ద్ర‌త‌లు అమ‌ల‌వుతున్న‌ట్టా..? ఎమ్మెల్యేల ప్రాణాల‌కే ర‌క్ష‌ణ లేక‌పోతే సామాన్య ప్ర‌జ‌ల ప‌రిస్థితి ఏంటి..? కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి చేశారు. మేం ఆర్టీసీ స‌మ్మెకు మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తే.. హౌజ్ అరెస్టు చేస్తున్నారు. గూండాలు స్వైర‌విహారం చేస్తుంటే.. చోద్యం చూస్తున్నారు పోలీసులు. ప్ర‌జ‌లు ఆలోచించాలి. గ‌త ప‌దేండ్ల‌లో ఇలాంటి దాడులు జ‌రిగాయా..? కేసీఆర్‌ను అనేక‌ర‌కాలుగా అవ‌మానించారు. అయినా భౌతిక‌దాడుల‌కు పాల్ప‌డలేదు. ఈ సంస్కృతి ఈ ప్ర‌భుత్వం రాగానే వ‌చ్చింది.. రాష్ట్రంలో అరాచ‌కం న‌డుస్తుంది అని దేశ‌ప‌తి శ్రీనివాస్ మండిప‌డ్డారు.

నువ్వు భ‌గ‌వ‌ద్గీత చ‌దివవా..? ఉప‌నిష‌త్తులు చ‌దివ‌వా..?

బండి సంజ‌య్ సంస్కార‌వంతంగా మాట్లాడ‌లేదు. పుట్టుక‌ల గురించి మాట్లాడుతారా..? ఇంత‌కంటే దుర్మార్గం ఇంకోటి ఉంట‌దా.. ఇంత కుసంస్కార‌మా..? ఇంత దిగ‌జారిపోవాలా.. దేశం కోసం, ధ‌ర్మం కోసం, హైంద‌వ సంస్కారం అని మాట్లాడేవారు పుట్టుక‌ల గురించి మాట్లాడుతారా..? నువ్వు భ‌గ‌వ‌ద్గీత చ‌దివవా..? ఉప‌నిష‌త్తులు చ‌దివ‌వా..? నీ నోటి నుంచి శ్లోకం, మంచి మాట విన‌లేదు. పొద్దున లేస్తే కేసీఆర్, కేటీఆర్‌ను తిట్ట‌డ‌మే. ఇది త‌ప్పా ఆయ‌న నోట ఇంకేం విన‌లేదు. రేవంత్ రెడ్డిని మాత్రం ప్రియురాలిని జ‌డతో కొట్టిన‌ట్టు కొడుతుంటాడు అప్పుడప్పుడు. అది చిన్న‌పాటి విమ‌ర్శ‌. ధాన్యం కొనుగోళ్లు జ‌ర‌గ‌డం లేదు. బండికి ఇది ప‌ట్ట‌దు.. బీఆర్ఎస్ మీద ప‌డ‌డ‌ట‌మే ప‌నిగా పెట్టుకున్నాడని దేశ‌ప‌తి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

బీజేపీకి ఘాత‌కుడిగా బండి సంజ‌య్..

రేవంత్ రెడ్డితో కుమ్మ‌క్కై బండి సంజ‌య్ సాగిస్తున్న ఈ దురాగ‌తాన్ని ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నారు. బీజేపీ నాయ‌కుల్లారా.. పారా హుషార్.. మీ పార్టీ మూలాల‌ను పెకిలిస్తున్నాడు. మీ పార్టీకి ఘాత‌కుడిగా త‌యార‌య్యాడు.. గ‌మ‌నించాలి. గూండాయిజానికి ప్ర‌తీక‌లుగా మారారు రేవంత్ రెడ్డి, బండి సంజ‌య్‌. ఈ స‌మాజం మిమ్మ‌ల్ని క్ష‌మించ‌దు. డీజీపీ చ‌ట్టాన్ని ర‌క్షిస్తున్నార‌ని ఆశిస్తున్నాం. ఎమ్మెల్యేల ప్రాణాలు కాపాడండి.. ఈ ఫ్యాక్ష‌నిస్టు సంస్కృతిని రానివ్వ‌కండి అని చెప్పాం. అరాచ‌కాలు కొన‌సాగితే ఆత్మ‌ర‌క్ష‌ణ కోసం ఇత‌ర పార్టీలు కూడా దాడులు చేయాల్సి వ‌స్త‌ది. అప్పుడు రాష్ట్రం రావ‌ణాకాష్టంగా, అగ్నిగుండంగా అయిత‌ది.. రేవంత్ రెడ్డి, బండి సంజ‌య్ ప‌త‌నం వైపు రాష్ట్రాన్ని తీసుకుపోతున్నారు. దాడులు చేసిన వారిపై హ‌త్యానేరం మోపాలి. ప్రాణాలు తీయ‌డానికి సిద్ధ‌ప‌డి వ‌స్తున్నారు.. గూండాల‌కు ప్ర‌జ‌లే బుద్ది చెప్పాలి. నాయ‌కుల‌కు గులాంగిరి చేయొద్ద‌ని రాజ్యాంగానికి ర‌క్ష‌ణ ఇవ్వాల‌ని డీజీపీని కోరుతున్నామ‌ని ఎమ్మెల్సీ దేశ‌ప‌తి శ్రీనివాస్ పేర్కొన్నారు.

Advertisement
Advertisement