త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ISI Module | దేశంలో భారీ ఉగ్ర‌దాడుల‌కు ఐఎస్‌ఐ కుట్ర

ISI Module | దేశంలో భారీ ఉగ్ర‌దాడుల‌కు పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్‌ఐ కుట్ర ప‌న్నింది. షెహజాద్ భట్టి మాడ్యూల్‌కు చెందిన ఆపరేటివ్‌ల ద్వారా ఈ దాడులకు ప్లాన్ చేసినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.

D

National | Published On May 8, 2026, 1.38 pm IST

ISI Module | దేశంలో భారీ ఉగ్ర‌దాడుల‌కు ఐఎస్‌ఐ కుట్ర
Advertisement

ISI Module | దేశంలో భారీ ఉగ్ర‌దాడుల‌కు (Terror Attacks) పాకిస్థాన్ (Pakistan)కు చెందిన ఐఎస్‌ఐ కుట్ర (ISI Module) ప‌న్నింది. దేశ‌రాజ‌ధాని ఢిల్లీలోని ఓ చారిత్రాత్మ‌క ఆల‌యం (Delhi temple) స‌హా ఢిల్లీ-సోనిప‌ట్ హైవేపై ఉన్న ఓ ప్ర‌ముఖ దాబా, హ‌ర్యానాలోని మిలిట‌రీ క్యాంప్ ల‌క్ష్యంగా దాడులు చేసేందుకు కుట్ర ప‌న్నిన‌ట్లు పోలీసు వ‌ర్గాలు తెలిపాయి. 'షెహజాద్ భట్టి మాడ్యూల్'కు చెందిన ఆపరేటివ్‌ల ద్వారా ఈ దాడులకు ప్లాన్ చేసినట్లు స‌ద‌రు వర్గాలు వెల్లడించాయి.

ఢిల్లీ పోలీసు స్పెష‌ల్ సెల్ (Delhi Police Special Cell) చేప‌ట్టిన 'గ్యాంగ్ బస్ట్ ఆపరేషన్ 2.0'లో భాగంగా వివిధ రాష్ట్రాల్లో తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల‌ను విచారించ‌గా.. ఈ విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. నిందితుల్లో ఒక‌రు ఢిల్లీలోని చారిత్రాత్మ‌క ఆల‌యాన్ని రెక్కీ చేసిన‌ట్లు తేలింది. అక్క‌డి ఫొటోల‌ను తీసి సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా పాకిస్థాన్‌లోని హ్యాండ్ల‌ర్ల‌కు పంపిన‌ట్లు ద‌ర్యాప్తు అధికారులు గుర్తించారు. ఆలయం వద్ద మోహరించిన సిబ్బంది లక్ష్యంగా కాల్పులు జరిపి, భయాందోళనలు సృష్టించాలని ప్రణాళిక రచించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.

Also Read..

ఎస్‌బీఐ నుంచి మ‌రో రెండు కొత్త ఫండ్స్‌.. క‌నీస పెట్టుబ‌డి రూ.500, 10 రోజుల వ‌ర‌కు వ్య‌వ‌ధి..

త‌ప్పుచేయ‌నంత వ‌ర‌కు ఎవ‌రికీ భ‌య‌ప‌డొద్దు: మ‌ంత్రి కొండా సురేఖ‌

డ్రోన్ దాడుల‌ భ‌యం.. కొన్ని వారాలుగా బంక‌ర్ల‌లో దాక్కున్న‌ పుతిన్..!

Advertisement
Advertisement