E20 fuel | E20 పెట్రోల్‌తో ఇంజిన్ పాడవదని లిఖితపూర్వక హామీ ఇవ్వండి.. వాహన తయారీ సంస్థలను కోరిన కేజ్రీవాల్
E20 fuel | ఇథనాల్ బ్లెండింగ్‌కు వ్యతిరేకంగా ప్రజల నుండి వస్తున్న నిరసనలపై ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) స్పందించారు. E20 పెట్రోల్ (E20 fuel) వాడటం వల్ల వాహనం ఇంజిన్లు పాడవవని, మైలేజ్ తగ్గదని లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని మూడు ప్రధాన వాహన తయారీ సంస్థలు మారుతి సుజుకి, టొయోటా కిర్లోస్కర్, హీరో మోటోకార్ప్ సంస్థలను కోరారు.
E20 fuel | త్రినేత్ర.న్యూస్ : E20 పెట్రోల్ (20% ఇథనాల్, 80% పెట్రోల్ మిశ్రమం) వినియోగంపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ముఖ్యంగా 2023కి ముందు తయారైన పాత పెట్రోల్ వాహనాల్లో ఈ ఇంధనం వాడటం వల్ల మైలేజ్ తగ్గడం (reduce mileage), ఇంజిన్ దెబ్బతినడం (damage engines), మెయింటేనెన్స్ ఖర్చులు పెరగడం లాంటి సమస్యలు వస్తున్నాయని చాలా మంది వాహనదారులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇథనాల్ బ్లెండింగ్‌కు వ్యతిరేకంగా ప్రజల నుండి వస్తున్న నిరసనలపై ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు.
ఈ ఆందోళనలపై మూడు ప్రధాన వాహన తయారీ సంస్థలకు తాను లేఖ రాయనున్నట్లు కేజ్రీ చెప్పారు. E20 పెట్రోల్ వాడటం వల్ల వాహనం ఇంజిన్లు పాడవవని, మైలేజ్ తగ్గదని లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని మారుతి సుజుకి (Maruti Suzuki), టొయోటా కిర్లోస్కర్ (Toyota Kirloskar), హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) సంస్థలను కోరారు. ఆయా కంపెనీలు బహిరంగంగా ఇస్తున్న ప్రకటనలు.. వారి వాహనాల గైడ్‌లైన్స్‌కు విరుద్ధంగా ఉన్నాయని ఆరోపించారు. "మీ ఓనర్ మాన్యువల్ ఒకటి చెబుతుంటే.. మీరు బయట మరొకటి చెబుతున్నారు. మీ వాహనం మైలేజ్ 10 శాతం కంటే ఎక్కువ తగ్గదని లిఖితపూర్వక హామీ ఇవ్వాలి. ఒకవేళ వాహనం పాడైపోతే వినియోగదారులకు మీరేమైనా నష్టపరిహారం చెల్లిస్తారా...?" అంటూ కేజ్రీ ప్రశ్నించారు.
ఇంధనాన్ని ఆప్షనల్ చేయాలి..
వినియోగదారులపై బలవంతంగా E20 ఇంధనాన్ని రుద్దకుండా, పెట్రోల్ పంపుల్లో E20, E10, E0 వేరియంట్లను విడివిడిగా అందుబాటులో ఉంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కేజ్రీవాల్ కోరారు. ఈ విషయంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కూడా లేఖ రాయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఇంధనాన్ని ఆప్షనల్ చేయాలని కోరనున్నట్లు కేజ్రీవాల్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా అన్ని పెట్రోల్ బంకుల్లో E10, E20, EO అనే ఆప్షన్లు అందుబాటులో ఉంచితే, ప్రజలు తమకు నచ్చిన పెట్రోల్ ఎంచుకుంటారని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
Also Read..
కేతన్ మర్డర్ కేసులో షాకింగ్ ట్విస్ట్: కాబోయే భర్తను చంపకముందే ప్రియుడిని పెళ్లాడిన సియా!
12 బంతుల్లోనే నమ్మకం పోయిందా? ప్రపంచకప్ హీరో శాంసన్‌ను పక్కన పెట్టేశారా?
8 ఎకరాల్లోపు రైతులకు 'భరోసా' నిధులు విడుదల.. ఇప్పటి వరకు రూ. 7750.45 కోట్లు జమ
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Hero MotoCorp | ఏథర్‌లో హీరో మోటోకార్ప్ వాటా పెంపు.. రూ.1,758 కోట్ల పెట్టుబడి..
ఆగస్టు 28, 2026

E20 Petrol | ఈ20 పెట్రోల్‌తోనే మైలేజీ తగ్గదు.. మరోసారి స్పష్టం చేసిన కేంద్రం
ఆగస్టు 16, 2026

Hero MotoCorp | హీరో తొలి ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్‌కు లాంచ్ డేట్ ఫిక్స్.. గ్రాండ్ ఎంట్రీ ఎప్పుడంటే..
ఆగస్టు 8, 2026
తాజావార్తలు
- ●SCR | టికెట్ లేకుండా 13 వేల మంది ప్రయాణం.. రూ. 1.28 కోట్ల జరిమానా
- ●Irumudi Movie | రవితేజ ఇరుముడి వర్కింగ్ స్టిల్స్
- ●Lokesh Kanagaraj | ఒకే సారి రెండు ఓటీటీలలోకి లోకేష్ కనగరాజ్ రొమాంటిక్ యాక్షన్ మూవీ - 25 కోట్ల బడ్జెట్ - వంద కోట్ల కలెక్షన్స్
- ●NDA Govt Delimitation Bill | ఈసారి ఆచి తూచి.. డీలిమిటేషన్ బిల్లు పెడదామా? వద్దా?
- ●Congress Minister | కాంగ్రెస్ మంత్రి రాజీనామా.. ఆ ఆరోపణలన్నీ రాజకీయ ప్రేరేపితమే..!
- ●Raviteja | క్లాస్ డైరెక్టర్‌తో రవితేజ హారర్ మూవీ - ఊహించని కాంబో సెట్

SCR | టికెట్ లేకుండా 13 వేల మంది ప్రయాణం.. రూ. 1.28 కోట్ల జరిమానా

Irumudi Movie | రవితేజ ఇరుముడి వర్కింగ్ స్టిల్స్

Lokesh Kanagaraj | ఒకే సారి రెండు ఓటీటీలలోకి లోకేష్ కనగరాజ్ రొమాంటిక్ యాక్షన్ మూవీ - 25 కోట్ల బడ్జెట్ - వంద కోట్ల కలెక్షన్స్

NDA Govt Delimitation Bill | ఈసారి ఆచి తూచి.. డీలిమిటేషన్ బిల్లు పెడదామా? వద్దా?



