Pune Ketan Agarwal Death Case | కేతన్ మర్డర్ కేసులో షాకింగ్ ట్విస్ట్: కాబోయే భర్తను చంపకముందే ప్రియుడిని పెళ్లాడిన సియా!
కాబోయే భర్తను లోహగడ్ కోట పైనుంచి తోసేసి చంపకముందే నిందితురాలు ప్రియుడిని సీక్రెట్ గా పెళ్లాడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
- పుణే వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్య కేసులో ప్రధాన నిందితురాలు సియా గోయల్ గురించి సంచలన విషయాలు వెల్లడి
- కేతన్‌తో ఎంగేజ్‌మెంట్ జరిగిన తర్వాత, అతడిని హత్య చేయడానికి 4 నెలల ముందే ప్రియుడు చేతన్‌ను సీక్రెట్ గా పెళ్లాడిన సియా
- డిలీట్ చేసిన వాట్సప్ చాట్స్, ఇన్‌స్టాగ్రామ్ ఫోటోల ద్వారా గుట్టు రట్టు చేసిన పోలీసులు
- నవంబర్ లో ఉదయ్ పూర్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం డాక్యుమెంట్లు అడగడంతో దొరికిపోతామనే భయంతోనే కేతన్ హత్య
Pune Ketan Agarwal Death Case | త్రినేత్ర.న్యూస్ : పుణేకు (Pune) చెందిన యువ వ్యాపారి (Realtor) కేతన్ అగర్వాల్ దారుణ హత్య కేసులో రోజుకో సంచలన విషయం వెలుగుచూస్తోంది. కాబోయే భర్తను లోహగడ్ (Lohagad) కోట పైనుంచి తోసేసి కిరాతకంగా చంపిన ప్రధాన నిందితురాలు సియా గోయల్.. ఈ ఘాతుకానికి పాల్పడటానికి ముందే తన ప్రియుడిని సీక్రెట్‌గా పెళ్లాడినట్లు పోలీసుల దర్యాప్తులో బయటపడింది. ఓ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను తలపించేలా జరిగిన ఈ మర్డర్‌కు సంబంధించి మైండ్ బ్లాంక్ అయ్యే నిజాలు పోలీసుల విచారణలో ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.
గుట్టు రట్టు చేసిన డిజిటల్ ఆధారాలు (Digital Evidence)
సియా గోయల్ (20), కేతన్ అగర్వాల్ (25) కు గత ఫిబ్రవరిలో నిశ్చితార్థం (Engagement) జరిగింది. నవంబర్‌లో ఉదయ్ పూర్‌లో గ్రాండ్‌గా డెస్టినేషన్ వెడ్డింగ్ (Destination Wedding) చేయడానికి ఇరు కుటుంబాల సభ్యులు ప్లాన్ చేశారు. అయితే, అప్పటికే తన ప్రియుడు చేతన్ చౌదరితో ప్రేమలో ఉన్న సియా.. అతడిని వదులుకోలేక ఏకంగా ఒక లోకల్ రిజిస్ట్రార్ ఆఫీసులో రహస్య వివాహం చేసుకుంది. కుటుంబ సభ్యులు ఒప్పుకోరనే భయంతో ఈ విషయాన్ని ఇద్దరూ దాచిపెట్టారు.

నిందితుల ఫోన్లలోని వాట్సప్ చాట్స్ (WhatsApp chats), ఇంటర్నెట్ సెర్చ్ హిస్టరీ, లొకేషన్ డేటా, డిలీట్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ (Instagram) అకౌంట్ ఫోటోలను రికవరీ చేయడంతో ఈ పెళ్లి గుట్టు రట్టయింది. పూలమాలలతో ఉన్న ఫోటోలు పోలీసులకు దొరికినట్లు సమాచారం. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద వీరి వివాహం జరిగిందా లేదా అన్నదానిపై పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. పెళ్లికి సాక్షులుగా సంతకాలు చేసిన ఇద్దరు కాలేజీ ఫ్రెండ్స్ ను కూడా విచారిస్తున్నారు.

జూన్ 14న తొలి ప్రయత్నం.. 'స్నేక్' డ్రామా
తమ సీక్రెట్ మ్యారేజ్ విషయం ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతో కేతన్‌ను అడ్డు తొలగించుకునేందుకు ఈ జంట పక్కా ప్లాన్ వేసింది. ఇందులో భాగంగా జూన్ 14న తొలిసారి కేతన్‌ను లోహగడ్ కోటకు సియా ఒంటరిగా తీసుకెళ్లింది. అక్కడ అతడిని తోసేయగా.. కేతన్ ఓ పొదను పట్టుకుని తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. కేతన్‌కు ఎక్కడ అనుమానం వస్తుందోనని భయపడిన సియా.. వెంటనే 'పాము.. పాము' (Snake) అని అరుస్తూ వెళ్లి కేతన్‌ను గట్టిగా హత్తుకుని నాటకం ఆడింది. ఆ తర్వాత ప్రియుడు చేతన్‌కు మెసేజ్ చేస్తూ.. "నాకు ధైర్యం సరిపోవడం లేదు.. నువ్వు కూడా రా.. ఇద్దరం కలిసి తోసేద్దాం" అని చెప్పినట్లు దర్యాప్తులో తేలింది. వీరు పోలీసులకు దొరక్కుండా సైగల భాషలో.. ముద్దు పేర్లతో చాటింగ్ చేసుకున్నారు.

పెళ్లికి డాక్యుమెంట్లు అడగడంతోనే..
నవంబర్‌లో జరగాల్సిన పెళ్లి కోసం అబ్బాయి తరపు వారు సియా డాక్యుమెంట్లు అడగడంతో నిందితులు కంగారు పడ్డారు. అప్పటికే పెళ్లి చేసుకొని ఉండటంతో.. డాక్యుమెంట్లు ఇస్తే దొరికిపోతానని సియా భయపడింది. దీంతో ప్లాన్ వేగవంతం చేసి జూన్ 18న పక్కా స్కెచ్‌తో కేతన్‌ను మళ్లీ అదే కోటకు తీసుకెళ్లింది. వెనుక నుంచి ఫాలో అయిన చేతన్ సహాయంతో.. కేతన్‌ను కోట పైనుంచి కిందకు తోసేసి చంపేశారు.

తొలుత ఇది ప్రమాదవశాత్తు జారిపడి జరిగిన మరణంగా (Accidental slip) నమ్మించే ప్రయత్నం చేసినప్పటికీ సియా ప్రవర్తనపై అనుమానం వచ్చిన కేతన్ సోదరి.. కుటుంబ సభ్యులను అప్రమత్తం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు నిజాలు బయటపడ్డాయి. ప్రస్తుతం ఈ జంట పుణే జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Police Constables Wedding | ఔను వాళ్లిద్దరు ఇష్టపడ్డారు..! చర్చనీయాంశమైన ఇద్దరు మహిళా కానిస్టేబుళ్ల పెళ్లి..!
ఆగస్టు 24, 2026

Newborns Died | అమరావతి హాస్పిటల్లో పేలిన వెంటిలేటర్.. ముగ్గురు నవజాత శిశువులు సజీవదహనం
ఆగస్టు 24, 2026

Crow | వీడేం మనిషిరా బాబూ.. మద్యం మత్తులో కాకిని తినేందుకు యత్నం..
ఆగస్టు 14, 2026
తాజావార్తలు
- ●Dasoju Sravan Kumar | ట్రాఫిక్ చలాన్ల ఆటో డెబిట్ ప్రతిపాదన రాజ్యాంగ విరుద్ధం
- ●realme P4s 5G | 8000 ఎంఏహెచ్ బ్యాటరీ, వాటర్, డస్ట్ రెసిస్టెన్స్‌తో.. రియల్‌మి కొత్త స్మార్ట్ ఫోన్..
- ●Ponguleti Srinivas Reddy | 15,475 మందికి రూ.185 కోట్లు విడుదల చేశాం.. రేపు చివరి బిల్లుల మొత్తం ఖాతాల్లో జమ చేస్తాం
- ●Harish Rao | కాంగ్రెస్ వైఫల్యానికి నాగార్జునసాగర్ కుడి కాలువ నీళ్లే సాక్ష్యం : హరీశ్‌రావు
- ●Stock Markets | అమెరికా ద్రవ్యోల్బణ భయాలు.. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..
- ●Dasoju Sravan Kumar | కుల గణనలో ఓబీసీ కేటగిరీ చేర్చాలి

Dasoju Sravan Kumar | ట్రాఫిక్ చలాన్ల ఆటో డెబిట్ ప్రతిపాదన రాజ్యాంగ విరుద్ధం

realme P4s 5G | 8000 ఎంఏహెచ్ బ్యాటరీ, వాటర్, డస్ట్ రెసిస్టెన్స్‌తో.. రియల్‌మి కొత్త స్మార్ట్ ఫోన్..

Ponguleti Srinivas Reddy | 15,475 మందికి రూ.185 కోట్లు విడుదల చేశాం.. రేపు చివరి బిల్లుల మొత్తం ఖాతాల్లో జమ చేస్తాం

Harish Rao | కాంగ్రెస్ వైఫల్యానికి నాగార్జునసాగర్ కుడి కాలువ నీళ్లే సాక్ష్యం : హరీశ్‌రావు



