త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Parvathy Thiruvothu | హీరోలంటే దేవుళ్లు కాదు – స్టార్ క‌ల్చ‌ర్‌పై మ‌ల‌యాళ హీరోయిన్ సంచ‌ల‌న కామెంట్స్

ద‌క్షిణాది ప‌రిశ్ర‌మ‌లోని స్టార్ క‌ల్చ‌ర్‌పై మ‌ల‌యాళ హీరోయిన్ పార్వ‌తి తిరువోతు సంచ‌ల‌న కామెంట్లు చేసింది. హీరోల‌ను దేవుళ్ల‌లా కొలిచే సంస్కృతి ఎక్కువైపోయింద‌ని అన్న‌ది. ఈ ధోర‌ణి అన్ని ఇండ‌స్ట్రీల‌లో కామ‌న్‌గా మారింద‌ని పేర్కొన్న‌ది. ఆమె చేసిన కామెంట్లు వైర‌ల్ అవుతోన్నాయి.

N

News | Published On Jul 7, 2026, 5.33 pm IST

Parvathy Thiruvothu | హీరోలంటే దేవుళ్లు కాదు – స్టార్ క‌ల్చ‌ర్‌పై మ‌ల‌యాళ హీరోయిన్ సంచ‌ల‌న కామెంట్స్
Advertisement

Parvathy Thiruvothu |  మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీలో పార్వ‌తి తిరువోతును రెబ‌ల్‌గా ఆమె ఫ్యాన్స్ అభివ‌ర్ణిస్తుంటారు. ఇండ‌స్ట్రీలో హీరోల డామినేష‌న్‌, లైంగిక వేధింపుల‌పై ప‌లుమార్లు ఆమె చేసిన వ్యాఖ్య‌లు వివాదాస్ప‌ద‌మ‌య్యాయి. బెదిరింపులు, ట్రోల్స్ ఎన్ని వ‌చ్చినా పార్వ‌తి మాత్రం వెన‌క్కి త‌గ్గ‌లేదు. చివ‌ర‌కు ఆమెకు అవ‌కాశాలు లేకుండా చేశారు. దాంతో మ‌ల‌యాళ సినిమాల‌ను త‌గ్గించిన ఈ బ్యూటీ బాలీవుడ్‌తో పాటు తెలుగు, త‌మిళ భాష‌ల‌పై దృష్టిసారించింది. మ‌రోసారి హీరో క‌ల్చ‌ర్‌పై పార్వ‌తి తిరువోతు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. సూప‌ర్ స్టార్ల‌ను దేవుళ్ల‌లా చూసే సంస్కృతి ద‌క్షిణాదిలో ఎక్కువైపోతుంద‌ని చెప్పింది.

ప్ర‌శ్నించ‌డం క‌ష్ట‌మే...

"ఇండియ‌న్ సినిమా ఇంట‌ర్నేష‌న‌ల్ స్థాయికి చేరుకున్నా స్టార్ హీరోల‌ను దేవుళ్ల‌లా కొలిచే విధానం మాత్రం మార‌డం లేదు. హీరోల‌ను ఆరాధించే సంస్కృతి నానాటికి పెరుగుతూనే ఉంది . ఈ భావ‌న వ‌ల్ల హీరోలు త‌ప్పు చేసినా కూడా వారిని ప్ర‌శ్నించ‌డం క‌ష్ట‌మ‌వుతోంది. హీరోను చిన్న‌గా విమ‌ర్శించినా కూడా అత‌డి ఆధ్వ‌ర్యంలో న‌డిచే అభిమాన సంఘాల‌ నుంచి వ‌చ్చే రియాక్ష‌న్ దారుణంగా ఉంటుంది. అన్ని ఇండ‌స్ట్రీల‌లో ఇదే వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది. హీరోల ఆధిప‌త్య ధోర‌ణి వ‌ల్ల కొత్త‌గా ఇండ‌స్ట్రీలోకి ఎంట‌ర‌య్యే వారు చాలా ఇబ్బందుల‌ను ఎదుర్కొంటున్నారు. కానీ వాటిని వ్య‌క్తం చేయ‌డానికి భ‌య‌ప‌డుతున్నారు" అని అన్నది.

అబ‌ద్దాల‌తో...

"హీరోల ఆరాధ‌న భావంపై వ‌స్తోన్న విమ‌ర్శ‌ల కార‌ణంగా గ‌త కొన్నేళ్ల‌లో సినీ ప‌రిశ్ర‌మ‌లో మెళ్ల‌మెళ్ల‌గా మార్పులు వ‌స్తున్నాయి. కానీ అవ‌న్నీ మ‌న‌స్ఫూర్తిగా వ‌చ్చిన‌వి కావు. కావాల‌నే కొంద‌రు స్టార్ క‌ల్చ‌ర్ లేదంటూ అబ‌ద్దాల‌తో న‌మ్మించే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు" అంటూ ఓ ఇంట‌ర్వ్యూలో కామెంట్లు చేసింది. హీరో వ‌ర్షిప్‌కు మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీ కూడా అతీత‌మేమీ కాద‌ని అన్న‌ది.

దూత 2

ప్ర‌స్తుతం పార్వ‌తి తిరువోతు తెలుగులో నాగ‌చైత‌న్య‌త‌తో దూత 2 వెబ్‌సిరీస్ చేస్తోంది. విక్ర‌మ్ కే కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సూప‌ర్ నాచుర‌ల్ థ్రిల్ల‌ర్ సిరీస్‌లో పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టిస్తోంది. మ‌రోవైపు పార్వ‌తి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఐ నోబ‌డీ మూవీ జూలై 10న థియేట‌ర్ల‌లోకి రాబోతుంది.

 

 

 

Advertisement
Advertisement