త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MLA Rakesh Reddy | ఓవైసీ బ్ర‌ద‌ర్స్ అక్ర‌మ క‌ట్ట‌డాలు హైడ్రాకు క‌నిపించ‌డం లేదా..? : ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి

MLA Rakesh Reddy | రాష్ట్రంలో చెరువుల పరిరక్షణ పేరుతో పేదల ఇళ్లను కూల్చివేస్తున్న హైడ్రా .. ఓవైసీ బ్ర‌ద‌ర్స్‌కు సంబంధించిన అక్రమ కట్ట‌డాల వైపు ఎందుకు వెళ్లడం లేదని ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్‌ రెడ్డి సూటిగా ప్రశ్నించారు.

S

Telangana | Published On Jul 7, 2026, 5.26 pm IST

MLA Rakesh Reddy | ఓవైసీ బ్ర‌ద‌ర్స్ అక్ర‌మ క‌ట్ట‌డాలు హైడ్రాకు క‌నిపించ‌డం లేదా..? : ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి
Advertisement

MLA Rakesh Reddy | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్రంలో చెరువుల పరిరక్షణ పేరుతో పేదల ఇళ్లను కూల్చివేస్తున్న హైడ్రా .. ఓవైసీ బ్ర‌ద‌ర్స్‌కు సంబంధించిన అక్రమ కట్ట‌డాల వైపు ఎందుకు వెళ్లడం లేదని ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్‌ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. పేద‌ల ఇంటిపైకి బుల్డోజ‌ర్స్‌ను పంపిస్తున్న రేవంత్ స‌ర్కార్‌కు ఓవైసీ బ్ర‌దర్స్ అక్ర‌మ క‌ట్టడాలు క‌నిపించ‌డ లేదా..? పేద‌ల‌కు వ‌ర్తిస్తున్న రూల్స్, రాజ్యాంగం.. ఓవైసీ బ్ర‌ద‌ర్స్‌కు ఎందుకు వ‌ర్తించ‌డం లేద‌ని నిల‌దీశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగ‌ళ‌వారం నిర్వ‌హించిన‌ మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డిపై రాకేష్ రెడ్డి నిప్పులు చెరిగారు.

ఒకటి కూల్చితే వంద కడతామంటూ అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడటం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం.. వంద కాకపోతే వెయ్యి కట్టుకో.. కానీ చెరువులను కబ్జా చేసి మాత్రం కట్టొద్దు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే.. సల్కమ్ చెరువులో నిర్మించిన ఫాతిమా కాలేజీపైన తక్షణమే చర్యలు తీసుకోవాలి.. ఓవైసీ కాలేజీని చెరువులోనే కట్టారా లేదా అనే విషయంపై ప్రభుత్వం తక్షణమే బహిరంగ ప్రకటన చేయాలని రాకేశ్ రెడ్డి డిమాండ్ చేశారు.

హిట్ల‌ర్ రేవంత్ రెడ్డికి క‌న‌బ‌డ‌టం లేదా..?

ప్రభుత్వ బుల్డోజర్లు కేవలం పేద ప్రజల ఇళ్లను కూల్చడానికే పరిమితమయ్యాయి. పేదలను చూస్తేనే ప్రభుత్వానికి బుల్డోజర్లు గుర్తుకొస్తున్నాయా..? పేదల కన్నీళ్లు హిట్ల‌ర్ రేవంత్ రెడ్డికి క‌న‌బ‌డ‌టం లేదా..? ఓవైసీ సోదరులపై చర్యలు తీసుకోవద్దని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఏమైనా ఆదేశించారా అని అని సీఎంను రాకేష్ రెడ్డి సూటిగా ప్ర‌శ్నించారు.

రంగ‌నాథ్ ఆఫీసును ముట్ట‌డిస్తాం..

ఓవైసీ కాలేజీల లాంటి పెద్దల అక్రమ కట్టడాలను కూల్చకుండా.. కేవలం పేదల ఇళ్లను మాత్రమే కూల్చివేస్తే.. ఊరుకునే ప్ర‌స‌క్తే లేదు. పెద్ద ఎత్తున హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆఫీస్‌ను ముట్టడిస్తామని పైడి రాకేష్ రెడ్డి స్పష్టం చేశారు.

స‌ర్ అంటే ఎంఐఎంకు ఎందుకంత భ‌యం..?

కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై ఎంఐఎం నేత‌లు అపోహ‌లు సృష్టిస్తున్నారు. స‌ర్ అంటే ఎంఐఎం నేత‌ల‌కు ఎందుకంత భ‌యం..? విదేశీ అక్రమ చొరబాటుదారుల ఓట్లను మజ్లిస్ పార్టీ స్వచ్ఛందంగా తొలగించాలి. చొరబాటుదారులకు వత్తాసు పలకడం మానుకోవాలి అని రాకేష్ రెడ్డి హెచ్చ‌రించారు.

 

Advertisement
Advertisement