త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nitin Gadkari | ఢిల్లీలో త్వ‌ర‌లోనే.. చెత్త‌తో న‌డిచే బ‌స్సులు : నితిన్ గ‌డ్క‌రీ

Nitin Gadkari | దేశ రాజ‌ధాని ఢిల్లీ (Delhi)లో త్వ‌ర‌లో పూర్తిగా హైడ్రోజ‌న్‌తో న‌డిచే బ‌స్సులు (hydrogen buses) అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని కేంద్ర రోడ్డు ర‌వాణా, ర‌హ‌దారుల శాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీ (Nitin Gadkari) తెలిపారు. భ‌విష్య‌త్తులో ఈ ప్రాజెక్టుకు అవ‌స‌ర‌మై హైడ్రోజ‌న్‌ను వేరు చేసిన మున్సిప‌ల్ వ్య‌ర్థాల నుంచి ఉత్ప‌త్తి చేయనున్న‌ట్లు గ‌డ్క‌రీ వివ‌రించారు.

D

National | Published On Jul 7, 2026, 5.36 pm IST

Nitin Gadkari | ఢిల్లీలో త్వ‌ర‌లోనే.. చెత్త‌తో న‌డిచే బ‌స్సులు : నితిన్ గ‌డ్క‌రీ
Advertisement

Nitin Gadkari | త్రినేత్ర‌.న్యూస్ : ఢిల్లీ (Delhi)లో కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా హైడ్రోజన్ ఇంధన బస్సులను (hydrogen buses) ప్రవేశపెడుతున్నారు. ఇప్ప‌టికే దేశంలోనే తొలిసారి హైడ్రోజ‌న్‌తో న‌డిచే బ‌స్సులు ఢిల్లీలో అందుబాటులోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్ అందించిన రెండు హైడ్రోజ‌న్ బ‌స్సులు ఢిల్లీ వాసుల‌కు సుర‌క్షితమైన ప్ర‌యాణాన్ని అందిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో దేశ రాజ‌ధాని ఢిల్లీలో త్వ‌ర‌లో పూర్తిగా హైడ్రోజ‌న్‌తో న‌డిచే బ‌స్సులు అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని కేంద్ర రోడ్డు ర‌వాణా, ర‌హ‌దారుల శాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీ (Nitin Gadkari) తెలిపారు.

ఢిల్లీలో బీజేపీ నిర్వహించిన యువజన సదస్సులో కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్ల‌డించారు. ఢిల్లీలోని బస్సులు త్వరలోనే హైడ్రోజన్‌ను ఇంధనంగా ఉపయోగించుకోవచ్చ‌ని ప్ర‌క‌టించారు. భ‌విష్య‌త్తులో ఈ ప్రాజెక్టుకు అవ‌స‌ర‌మై హైడ్రోజ‌న్‌ను వేరు చేసిన మున్సిప‌ల్ వ్య‌ర్థాల నుంచి ఉత్ప‌త్తి చేయనున్న‌ట్లు గ‌డ్క‌రీ వివ‌రించారు. "మున్సిపల్ వ్యర్థాలను వేరు చేసి బయోడైజెస్టర్ల ద్వారా హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయడానికి ఉపయోగిస్తాం. భ‌విష్య‌త్తులో ఢిల్లీలోని బస్సులు దీనితోనే నడుస్తాయి" అని కేంద్ర మంత్రి తెలిపారు.

ఎక్స్‌ప్రెస్‌వేల నిర్మాణంలోనూ..

ఈ ప్రాజెక్టు వ‌ల్ల దేశ రాజ‌ధానిలో పేరుకుపోయిన చెత్త‌ను పూర్తిగా నిర్మూలించ‌డానికి ప్ర‌భుత్వానికి అవ‌కాశం ల‌భిస్తుంద‌ని పేర్కొన్నారు. ఈ ప్ర‌ణాళిక‌లో భాగంగా ఇప్ప‌టికే ఢిల్లీలోని ల్యాండ్‌ఫీల్ సైట్ల నుంచి సేక‌రించిన సుమారు 8 మిలియ‌న్ ట‌న్నుల వ్య‌ర్థాల‌ను ఎక్స్‌ప్రెస్‌వేల నిర్మాణంలో ఉప‌యోగించిన‌ట్లు మంత్రి వెల్ల‌డించారు.

వ్యర్థాల నిర్వహణతో ఆదాయం

వ్య‌ర్థాల నిర్వ‌హ‌ణ ద్వారా భారీగా ఆర్థిక ప్ర‌యోజ‌నాలు ఉన్నాయ‌ని ఈ సంద‌ర్భంగా మంత్రి తెలిపారు. తన పార్లమెంటరీ నియోజకవర్గంలోని (నాగ్‌పూర్‌) మున్సిపల్ కార్పొరేషన్.. శుద్ధి చేసిన మురుగు నీటిని (treated waste water) విక్రయించడం ద్వారా ఏటా దాదాపు రూ.325 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తోందని నితిన్ గడ్కరీ వెల్లడించారు.

Also Read..

E20 పెట్రోల్‌తో ఇంజిన్ పాడ‌వ‌ద‌ని లిఖిత‌పూర్వ‌క హామీ ఇవ్వండి.. వాహన తయారీ సంస్థలను కోరిన కేజ్రీవాల్‌

హీరోలంటే దేవుళ్లు కాదు - స్టార్ క‌ల్చ‌ర్‌పై మ‌ల‌యాళ హీరోయిన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

రెవెన్యూ, రిజిస్ట్రేషన్ ఆఫీసులకు కొత్త కళ.. రూ.360 కోట్లతో సర్కార్ భారీ ప్రణాళిక

Advertisement
Advertisement