త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

DK Shivakumar | బెంగ‌ళూరుకు వ‌చ్చే ఎమ్మెల్యేల‌కు రెండు పెళ్లిళ్లు.. డీకే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

DK Shivakumar | బెంగ‌ళూరు (Bengaluru)కు వ‌ల‌స వ‌చ్చి స్థిర‌ప‌డిన కొంద‌రు ఎమ్మెల్యేలు రెండు పెళ్లిళ్లు చేసుకున్నారంటూ క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి డీకే శివ‌కుమార్ (DK Shivakumar) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

D

National | Published On Sep 26, 2026, 11.37 am IST

DK Shivakumar | బెంగ‌ళూరుకు వ‌చ్చే ఎమ్మెల్యేల‌కు రెండు పెళ్లిళ్లు.. డీకే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
Advertisement

DK Shivakumar | త్రినేత్ర న్యూస్ : ఎమ్మెల్యేల‌ను (MLAs) ఉద్దేశించి క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి డీకే శివ‌కుమార్ (DK Shivakumar) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బెంగ‌ళూరు (Bengaluru)కు వ‌ల‌స వ‌చ్చి స్థిర‌ప‌డిన కొంద‌రు ఎమ్మెల్యేలు రెండు పెళ్లిళ్లు చేసుకున్నార‌ని వ్యాఖ్యానించారు. ఆ ఎమ్మెల్యేల లిస్ట్ కూడా త‌నవ‌ద్ద ఉందని పేర్కొన్నారు. అసెంబ్లీ వేదిక‌గా సీఎం చేసిన ఈ వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపుతున్నాయి. డీకే వ్యాఖ్య‌ల‌పై బీజేపీ తీవ్ర‌స్థాయిలో మండిప‌డుతోంది. ఆ ఎమ్మెల్యేల పేర్లు బయటపెట్టాలని డిమాండ్ చేసింది.

న‌గ‌రంలో జ‌నాభా పెరుగుద‌ల గురించి అసెంబ్లీలో ప్ర‌స్తావించిన సీఎం డీకే.. బెంగళూరు నగర వాతావరణం, అక్కడి వసతుల కారణంగా ఇత‌ర రాష్ట్రాల‌ నుంచి వచ్చే వారు ఎవరూ తిరిగి వెళ్లడానికి ఇష్టపడరని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఇత‌ర జిల్లాల నుంచి వ‌చ్చే ఎమ్మెల్యేలు కూడా ఇక్క‌డే ఉండిపోతార‌ని చెప్పారు. న‌గ‌రానికి వ‌చ్చే ఎమ్మెల్యేలంద‌రికీ రెండు పెళ్లిళ్లు అవుతాయంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇలాంటి వారు డ‌జ‌నుకుపైగా ఉన్నార‌ని, వారి జాబితా కూడా త‌న‌ వ‌ద్ద ఉంద‌ని చెప్పారు. ధార్వాడ్, దక్షిణ కన్నడ వంటి జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలను ఉద్దేశించి డీకే ఈ వ్యాఖ్య‌లు చేశారు. అయితే, వారి పేర్ల‌ను మాత్రం సీఎం ప్ర‌స్తావించ‌లేదు.

డీకే వ్యాఖ్య‌లు రాజ‌కీయ దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్య‌ల‌పై ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు ఆర్ అశోక్ తీవ్రంగా స్పందించారు. "ఈ వ్యాఖ్యలు పూర్తిగా అనవసరమైనవి. ఇత‌ర ప్రాంతాల నుంచి బెంగ‌ళూరుకు వ‌చ్చి నివ‌సించే ఎమ్మెల్యేలంద‌రిపై అనుమానపు నీడలు కమ్మేలా ఉన్నాయి. అందుకే ఆ ఎమ్మెల్యేల పేర్ల‌ను సీఎం బ‌హిర్గ‌తం చేయాలి" అని డిమాండ్ చేశారు. మ‌రోవైపు బీజేపీ ఎమ్మెల్యే ఎస్‌.సురేశ్ కుమార్ సైతం సీఎం వ్యాఖ్య‌ల‌ను తీవ్రంగా త‌ప్పుబ‌ట్టారు. అసెంబ్లీ వేదిక‌గా ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం త‌గ‌ద‌ని హిత‌వు ప‌లికారు.

Also Read..

డివిడెండ్ల ద్వారా వ‌చ్చే ఆదాయంపై ప‌న్ను ఉంటుందా.. రీఫండ్ పొంద‌వ‌చ్చా..?

ఎన్నిక‌ల సంఘం స్వ‌తంత్ర‌తే ప్ర‌జాస్వామ్య ప‌రిర‌క్ష‌ణ‌కు పునాది: మంత్రి ఉత్త‌మ్

వారాంతంలో బులియ‌న్ మార్కెట్ల‌కు స్వ‌ల్ప ఊర‌ట‌.. దేశీయంగా ప్ర‌తికూల సంకేతాలు..

Advertisement
Advertisement