Rahul Gandhi | ఈ 20 కాస్త 420గా మారింది.. కేంద్రంపై రాహుల్ గాంధీ ప్రశ్నల వర్షం
Rahul Gandhi | కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌లో 20% ఇథనాల్ (E20) మాత్రమే కలుపుతున్నామని చెబుతోందని, కానీ క్షేత్రస్థాయిలో అది ప్రజల వాహనాల నుంచి ఇంధనాన్ని దొంగిలించే 420 చందంగా మారిందని రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆరోపించారు. కర్ణాటక ప్రభుత్వం నిర్వహించిన పరీక్షల్లో ఇథనాల్ స్థాయిలు అధికమోతాదులో నమోదైటనట్లు వెల్లడైందని చెప్పారు.
Rahul Gandhi | త్రినేత్ర న్యూస్ : ప్రధాన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) పెట్రోల్‌లో కేంద్రం నిర్దేశించిన 20 శాతం కంటే అధికంగా ఇథనాల్ మిశ్రమాన్ని కలుపుతున్నాయని కర్ణాటక (Karnataka) ప్రభుత్వం సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లోని ప్రధాన ఇంధన బ్రాండ్‌లకు చెందిన E20 నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపగా.. పరీక్షించిన 14 ఇంధన నమూనాల్లో 11 నమూనాలు నిర్దేశిత 20% పరిమితి కంటే ఎక్కువ ఇథనాల్‌ను కలిగి ఉన్నట్లు తేలినట్లు పేర్కొంది. ఈ వ్యవహారంపై ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ20 కాస్త 420గా మారిందని (E20 has become 420) వ్యాఖ్యానించారు.
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌లో 20% ఇథనాల్ (E20) మాత్రమే కలుపుతున్నామని చెబుతోందని, కానీ క్షేత్రస్థాయిలో అది ప్రజల వాహనాల నుంచి ఇంధనాన్ని దొంగిలించే 420 చందంగా మారిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. కర్ణాటక ప్రభుత్వం నిర్వహించిన పరీక్షల్లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL) శాంపిల్‌లో 31.2%, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) శాంపిల్‌లో 30.5% వరకు ఇథనాల్ స్థాయిలు నమోదయ్యాయని వెల్లడించారు. ప్రభుత్వ రంగానికి చెందిన IOCL, HPCL, BPCL సంస్థలతో పాటు ప్రైవేట్ రంగానికి చెందిన నయారా (Nayara), షెల్ (Shell) కంపెనీలు కూడా ఈ నిబంధనలను ఉల్లంఘించాయని ఆరోపించారు.
"మోదీ జీ.. దేశంలోని వాహనదారుల ట్యాంకుల్లో ఏం పోస్తున్నారో చెప్పండి..? పెట్రోల్‌లో అసలు ఎంత ఇథనాల్ ఉంది..? 20% కంటే ఎక్కువ ఇథనాల్ కలుపుతున్న కంపెనీలపై ఎప్పుడు చర్యలు తీసుకుంటారు..? మనం చర్చించాలనే సవాలు ఇంకా మిగిలే ఉంది. ఆ చర్చల్లో మేము ఈ విషయాన్ని కూడా ప్రస్తావిస్తాం. మీ విధానాల వల్ల అసలు ఎవరు లబ్ధి పొందుతున్నారు..?" అంటూ కేంద్రంపై ప్రశ్నల వర్షం కురిపించారు.
పెట్రోల్‌లో అధికంగా ఇథనాల్ కలపడం వల్ల వాహనదారులు నష్టపోతున్నారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఖరీదైన పెట్రోల్ కొనుగోలు చేస్తున్న ప్రజలకు ఇంధనంలో ఎంత ఇథనాల్ కలిసిందనే విషయం తెలియడం లేదన్నారు. ఎక్కువ మోతాదులో ఇథనాల్ కలపడం వల్ల వాహనాల మైలేజీ పడిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా ఇంజిన్ల మెయింటేనెన్స్ ఖర్చులు పెరుగుతాయని చెప్పారు. అధిక ఇథనాల్ మిశ్రమాన్ని తట్టుకునే సామర్థ్యం లేని వాహనాల్లో ఇలాంటి ఇంధనాన్ని ఉపయోగిస్తే సమస్యలు ఎదురవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ20పై కర్ణాటక ప్రభుత్వం ఆరోపణలు
కాగా, దేశంలో ఈ20 పెట్రోల్‌పై వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ఈ పెట్రోల్ కారణంగా వాహనాల మైలేజ్ తగ్గిందని, నిర్వహణ ఖర్చులు పెరిగాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ20 పెట్రోల్‌పై కర్ణాటక ప్రభుత్వం సంచలన ఆరోపణలు చేసింది. పెట్రోల్‌లో నిర్దేశించిన స్థాయి కంటే అధిక మోతాదులో ఇథనాల్ కలుపుతున్నట్లు ఆరోపించింది. కర్ణాటక ఆహార, పౌర సరఫరాల శాఖ నిర్వహించిన 'ఆపరేషన్ నిఖార్' ప్రచారంలో భాగంగా నిర్వహించిన ల్యాబ్ పరీక్షల్లో ఈ విషయం వెల్లడైందని తెలిపింది.
బెంగళూరు, కోలార్, చిక్కబళ్లాపూర్, బెంగళూరు రూరల్, రామనగర, మంగళూరు, తుమకూరు జిల్లాల్లో ప్రధాన ఇంధన బ్రాండ్‌లకు చెందిన E20 నమూనాలను సేకరించినట్లు పేర్కొంది. ఆ నమూనాలను ల్యాచ్‌లో పరీక్షించినట్లు తెలిపింది. ఈ ల్యాబ్ పరీక్షల్లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL) పెట్రోల్‌లో 31.2 శాతం, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) పెట్రోల్‌లో 30.5 శాతం ఇథనాల్ గాఢత ఉన్నట్లు వెల్లడైందని ఆరోపించింది.
ఆరోపణలను ఖండించిన చమురు కంపెనీలు
పెట్రోల్‌లో ఇథనాల్ మోతాదు ఎక్కువగా ఉందనే కర్ణాటక ప్రభుత్వ వాదనను చమురు మార్కెటింగ్ కంపెనీలు ఖండించాయి. నిర్దేశిత నిబంధనల ప్రకారం ఈ పరీక్షలు జరగలేదని స్పష్టం చేశాయి. కర్ణాటకతోపాటూ దేశవ్యాప్తంగా తాము సరఫరా చేస్తున్న E20 పెట్రోల్.. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ స్పెసిఫికేషన్ IS 17021 ప్రమాణాలకు అనుగుణంగా ఉందని ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్‌పిసీఎల్ సంస్థలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. పెట్రోల్ శాంపిల్స్ సేకరణ, పరీక్షల విధానంపై తమకు అభ్యంతరాలు ఉన్నాయని తెలిపాయి. ప్రభుత్వం నిర్వహించిన నమూనాల సేకరణ ప్రక్రియపై అవి ఆందోళన వ్యక్తం చేశాయి. తమ ప్రతినిధులను ఈ ప్రక్రియలో భాగస్వాములను చేయలేదని, తమకు రిటెన్షన్ శాంపిల్స్, అవుట్‌లెట్ వారీగా వివరాలు లేదా పూర్తి ల్యాబ్ రిపోర్టులు అందజేయలేదని ఆరోపించాయి.
Also Read..
నాపై ఏడుసార్లు హత్యాప్రయత్నం చేశారు.. అభిషేక్ బెనర్జీ సంచలన ఆరోపణలు
ఇరాన్ అణు రహస్యాలు చెబితే రూ.166 కోట్ల రివార్డ్.. అమెరికా భారీ ఆఫర్
DSSSBలో జూనియర్ ఇంజినీర్, ఎంటీఎస్ ఉద్యోగాలు.. 1260 పోస్టులతో నోటిఫికేషన్
సంబంధిత వార్తలు

Yellamma | అమ్మా తల్లీ ఎల్లమ్మ.. మా ఇంట్లో నుంచి నల్లులను బయటకు పంపించూ.. ఓ భక్తుడి విచిత్ర కోరిక
నవంబర్ 7, 2026

Rahul Gandhi | ఇది ఓట్ల చోరీ కాదు.. హక్కుల చోరీ.. ఓటర్ ఐడీతో సంక్షేమ పథకాలపై రాహుల్ విమర్శలు
నవంబర్ 6, 2026

Ramchander Rao | భారత్‌ను బంగ్లాదేశ్‌లా మార్చాలని చూస్తున్నారా..?
నవంబర్ 6, 2026
తాజావార్తలు
- ●Bollywood OTT | రెండు కోట్ల బడ్జెట్ - 450 కోట్ల కలెక్షన్స్ - ఓటీటీలోకి బ్లాక్‌బస్టర్ మైథాలజీ మూవీ
- ●Student Suicide | హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థి ఆత్మహత్య.. ప్రిన్సిపాల్ వేధింపులే కారణమా?
- ●MP Abhishek Banerjee | నాపై ఏడుసార్లు హత్యాప్రయత్నం చేశారు.. అభిషేక్ బెనర్జీ సంచలన ఆరోపణలు
- ●US Reward | ఇరాన్ అణు రహస్యాలు చెబితే రూ.166 కోట్ల రివార్డ్.. అమెరికా భారీ ఆఫర్
- ●White House | వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు.. ట్రంప్‌కు గిఫ్ట్‌గా హనుమాన్ చాలీసా
- ●Private Bus | డివైడర్‌ను ఢీకొట్టి ప్రైవేటు బస్సు బోల్తా.. 20 మందికి తీవ్ర గాయాలు

Bollywood OTT | రెండు కోట్ల బడ్జెట్ - 450 కోట్ల కలెక్షన్స్ - ఓటీటీలోకి బ్లాక్‌బస్టర్ మైథాలజీ మూవీ

Student Suicide | హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థి ఆత్మహత్య.. ప్రిన్సిపాల్ వేధింపులే కారణమా?

MP Abhishek Banerjee | నాపై ఏడుసార్లు హత్యాప్రయత్నం చేశారు.. అభిషేక్ బెనర్జీ సంచలన ఆరోపణలు

US Reward | ఇరాన్ అణు రహస్యాలు చెబితే రూ.166 కోట్ల రివార్డ్.. అమెరికా భారీ ఆఫర్



