త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bhogi Postponed | వాయిదా పడిన శర్వానంద్ ‘భోగి’.. అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించిన మేక‌ర్స్‌..

Bhogi Postponed | టాలీవుడ్ హీరో శర్వానంద్ నటిస్తున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం ‘భోగి’ విడుదల వాయిదా పడింది. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ రస్టిక్ యాక్షన్ డ్రామాను నవంబర్ 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం తొలుత నిర్ణయించింది.

P

Entertainment | Published On Nov 11, 2026, 6.38 pm IST

Bhogi Postponed | వాయిదా పడిన శర్వానంద్ ‘భోగి’.. అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించిన మేక‌ర్స్‌..
Advertisement

Bhogi Postponed | టాలీవుడ్ హీరో శర్వానంద్ నటిస్తున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం ‘భోగి’ విడుదల వాయిదా పడింది. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ రస్టిక్ యాక్షన్ డ్రామాను నవంబర్ 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం తొలుత నిర్ణయించింది. అయితే, అనివార్య కారణాల వల్ల ఈ సినిమా వాయిదా వేస్తున్నట్లు తాజాగా అధికారికంగా ప్రకటించింది. కొత్త విడుదల తేదీని త్వరలోనే వెల్లడిస్తామని స్పష్టం చేసింది.

ఈ మేరకు చిత్రబృందం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘భోగి’ తమకు ఎంతో ప్రత్యేకమైన ప్రాజెక్ట్ అని, ఎంతో ప్రతిష్టాత్మకంగా, అంకితభావంతో సినిమాను రూపొందిస్తున్నామని పేర్కొంది. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా గొప్ప థియేట్రికల్ అనుభూతిని అందించాలన్నదే తమ లక్ష్యమని తెలిపింది. కొన్ని అనుకోని ఆలస్యాల కారణంగా సినిమా విడుదలను వాయిదా వేయాల్సి వచ్చిందని వెల్లడించింది. రిలీజ్‌పై వస్తున్న ఊహాగానాలను నమ్మవద్దని, ప్రచారం చేయవద్దని అభిమానులను కోరింది. కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తామని హామీ ఇచ్చింది.

సెన్సార్ సమస్యలే కారణమా?

‘భోగి’ వాయిదా వెనుక సెన్సార్ సంబంధిత సమస్యలు ఉన్నాయంటూ సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీనిపై చిత్రబృందం ఎలాంటి అధికారిక స్పష్టత ఇవ్వలేదు. కేవలం అనివార్య కారణాలతోనే వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు నిరాశ కలిగించకుండా, వేచి ఉండే సమయానికి తగిన ఫలితాన్ని అందిస్తామని మేకర్స్ చెబుతున్నారు.

శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో శర్వానంద్‌కు జోడీగా అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి కథానాయికలుగా నటిస్తున్నారు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామాగా ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. మరి ‘భోగి’ కొత్త విడుదల తేదీ ఎప్పుడు ప్రకటిస్తారు? శర్వానంద్‌ను సంపత్ నంది ఎలాంటి పాత్రలో చూపించబోతున్నారు? అన్నది ఆసక్తికరంగా మారింది.

Advertisement
Advertisement