Dividend Income | డివిడెండ్ల ద్వారా వచ్చే ఆదాయంపై పన్ను ఉంటుందా.. రీఫండ్ పొందవచ్చా..?
Dividend Income | డివిడెండ్ ఆదాయం పొందినంత మాత్రాన దానిపై మినహాయించిన మూలంలో పన్ను (టీడీఎస్)నే తుది పన్ను బాధ్యతగా భావించాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) దాఖలు చేసినప్పుడు, కంపెనీ మినహాయించిన టీడీఎస్ను ఆ మొత్తం పన్ను బాధ్యతకు సర్దుబాటు చేస్తుంది.
Dividend Income | డివిడెండ్ ఆదాయం పొందినంత మాత్రాన దానిపై మినహాయించిన మూలంలో పన్ను (టీడీఎస్)నే తుది పన్ను బాధ్యతగా భావించాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) దాఖలు చేసినప్పుడు, కంపెనీ మినహాయించిన టీడీఎస్ను ఆ మొత్తం పన్ను బాధ్యతకు సర్దుబాటు చేస్తుంది. నివాస వ్యక్తికి చెల్లించే డివిడెండ్పై సాధారణంగా 10 శాతం టీడీఎస్ మినహాయిస్తారు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి చేసే చెల్లింపులకు సంబంధించి ఆర్థిక సంవత్సరంలో ఒక కంపెనీ నుంచి వ్యక్తిగత వాటాదారుడు పొందే మొత్తం డివిడెండ్ విషయంలో టీడీఎస్ మినహాయింపు పరిమితిని రూ.10వేలకు పెంచారు. అంటే ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక కంపెనీ ఒక వ్యక్తికి రూ.1 లక్ష డివిడెండ్ చెల్లిస్తే, రూ.10వేలు టీడీఎస్గా మినహాయించే అవకాశం ఉంటుంది. దీంతో చేతికి రూ.90వేలు వస్తాయి. అయితే తుది పన్ను ఎంత అన్నది వ్యక్తి మొత్తం పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం, వర్తించే పన్ను విధానంపై ఆధారపడి ఉంటుంది.
పన్ను బాధ్యత తక్కువగా ఉంటే..
వ్యక్తి తుది పన్ను బాధ్యత ఇప్పటికే మినహాయించిన టీడీఎస్ కంటే తక్కువగా ఉంటే, రూ.10వేలుగా మినహాయించిన మొత్తాన్ని ప్రభుత్వం నుంచి తిరిగి పొందవచ్చు. ఉదాహరణకు వర్తించే మినహాయింపులు, తగ్గింపులు, రిబేట్ తదితరాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత మొత్తం పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయంపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేకపోతే, డివిడెండ్పై మినహాయించిన టీడీఎస్ను రీఫండ్గా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ రీఫండ్ ఆటోమేటిక్గా రాదు. పన్ను చెల్లింపుదారు ఐటీఆర్ దాఖలు చేసి టీడీఎస్ క్రెడిట్ను క్లెయిమ్ చేయాలి. అనంతరం ఆదాయపు పన్ను శాఖ, తుది పన్ను బాధ్యతకు టీడీఎస్ను సర్దుబాటు చేసి, అదనంగా చెల్లించిన మొత్తాన్ని రిటర్న్ ప్రాసెసింగ్ అనంతరం బ్యాంకు ఖాతాలో రీఫండ్ చేస్తుంది.
పాత పన్ను విధానంలో..
పాత పన్ను విధానంలో 60 ఏళ్లలోపు వ్యక్తులకు సాధారణ ప్రాథమిక మినహాయింపు పరిమితి రూ.2.5 లక్షలుగా ఉంది. 60 నుంచి 80 ఏళ్లలోపు వయసున్న నివాస సీనియర్ సిటిజన్లకు ఇది రూ.3 లక్షలు కాగా, 80 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న నివాస సూపర్ సీనియర్ సిటిజన్లకు రూ.5 లక్షలుగా ఉంది. నివాస వ్యక్తి మొత్తం ఆదాయం రూ.5 లక్షలకు మించకపోతే సెక్షన్ 87ఎ కింద గరిష్ఠంగా రూ.12,500 వరకు రిబేట్ పొందే అవకాశం ఉంటుంది. 2026-27 అసెస్మెంట్ ఇయర్కు వర్తించే కొత్త పన్ను విధానంలో ప్రాథమిక మినహాయింపు పరిమితి రూ.4 లక్షలుగా ఉంది. ఆ తర్వాత ఆదాయ స్థాయిని బట్టి పన్ను శ్లాబులు క్రమంగా పెరుగుతాయి. నివాస వ్యక్తి పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ.12 లక్షల వరకు ఉంటే, సెక్షన్ 87ఎ కింద గరిష్ఠంగా రూ.60వేల వరకు రిబేట్ పొందవచ్చు.
వాటాదారుడిపైనే పన్ను..
డివిడెండ్ ఆదాయం సాధారణంగా వాటాదారుడి చేతిలోనే పన్నుకు లోబడి ఉంటుంది. పన్ను బాధ్యతను నిర్ణయించేటప్పుడు దాన్ని మొత్తం ఆదాయంలో చేర్చుతారు. మొత్తం పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం కారణంగా 10 శాతం టీడీఎస్ కంటే ఎక్కువ పన్ను శ్లాబ్లోకి వెళితే, ఇప్పటికే మినహాయించిన టీడీఎస్ మొత్తం పన్ను బాధ్యతను పూర్తిగా కవర్ చేయదు. ఉదాహరణకు డివిడెండ్ ఆదాయానికి వర్తించే పన్ను రేటు 20 శాతంగా ఉంటే, రూ.1 లక్ష డివిడెండ్పై ఇతర వర్తించే నిబంధనలను పరిగణనలోకి తీసుకునే ముందు రూ.20వేల పన్ను వస్తుంది. ఇందులో రూ.10వేలను ఇప్పటికే టీడీఎస్గా మినహాయించి ఉంటే, మిగిలిన రూ.10వేలను ఐటీఆర్ దాఖలు చేసే సమయంలో చెల్లించాల్సి ఉంటుంది.
పన్ను రేటు 30 శాతం ఉంటే..
అదేవిధంగా, వర్తించే పన్ను రేటు 30 శాతంగా ఉంటే, డివిడెండ్కు సంబంధించిన పన్ను మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే తుది పన్ను బాధ్యత మొత్తం ఆదాయం, తగ్గింపులు, రిబేట్, సర్చార్జ్, సెస్ వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. పన్ను చెల్లింపుదారులు ఆర్థిక సంవత్సరం మొత్తం తమ పన్ను బాధ్యతను గమనిస్తూ ఉండాలి. టీడీఎస్, ఇతర పన్ను క్రెడిట్లను సర్దుబాటు చేసిన తర్వాత చెల్లించాల్సిన పన్ను రూ.10వేలు లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే, ముందస్తు పన్ను చెల్లింపు నిబంధనలు వర్తించే అవకాశం ఉంటుంది.
తాజావార్తలు
- ●Uttam Kumar Reddy | ఈసీ స్వతంత్రతే ప్రజాస్వామ్య పరిరక్షణకు పునాది: మంత్రి ఉత్తమ్
- ●Gold And Silver Prices Today | వారాంతంలో బులియన్ మార్కెట్లకు స్వల్ప ఊరట.. దేశీయంగా ప్రతికూల సంకేతాలు..
- ●NDA | ఎన్నికల సంఘంలో అంతర్గత విభేదాలు.. అనుమానాలు తీర్చాలంటున్న ఎన్డీఏ పక్షాలు
- ●SIP | నెలకు రూ.25 వేల ఎస్ఐపీ.. 10 ఏళ్లలో ఎంత సంపద? స్టెప్అప్తో భారీ తేడా..
- ●iPhone 17 Pro | ఐఫోన్ 17 ప్రొ పై భారీ డిస్కౌంట్.. రూ.56,990కే..
- ●వరంగల్ నుంచి బీజేపీ బిగ్ ప్లాన్.. మధుకర్, దశరథ్కు కీలక బాధ్యతలు!

Uttam Kumar Reddy | ఈసీ స్వతంత్రతే ప్రజాస్వామ్య పరిరక్షణకు పునాది: మంత్రి ఉత్తమ్

Gold And Silver Prices Today | వారాంతంలో బులియన్ మార్కెట్లకు స్వల్ప ఊరట.. దేశీయంగా ప్రతికూల సంకేతాలు..

NDA | ఎన్నికల సంఘంలో అంతర్గత విభేదాలు.. అనుమానాలు తీర్చాలంటున్న ఎన్డీఏ పక్షాలు

SIP | నెలకు రూ.25 వేల ఎస్ఐపీ.. 10 ఏళ్లలో ఎంత సంపద? స్టెప్అప్తో భారీ తేడా..






