త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | నా గ‌డ్డం మీద రేవంత్ రెడ్డికి ఫిక‌ర్ ప‌డ్డ‌ది

KTR | త‌న గ‌డ్డంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌పై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. నా గ‌డ్డం మీద రేవంత్ రెడ్డికి బాగా ఫిక‌ర్ పడ్డ‌ది అని కేటీఆర్ పేర్కొన్నారు.

S

Telangana | Published On Nov 11, 2026, 6.43 pm IST

KTR | నా గ‌డ్డం మీద రేవంత్ రెడ్డికి ఫిక‌ర్ ప‌డ్డ‌ది
Advertisement

నిర్మ‌ల్ రైతు గ‌ర్జ‌న స‌భ‌లో కేటీఆర్

KTR | త్రినేత్ర న్యూస్ : త‌న గ‌డ్డంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌పై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. నా గ‌డ్డం మీద రేవంత్ రెడ్డికి బాగా ఫిక‌ర్ పడ్డ‌ది అని కేటీఆర్ పేర్కొన్నారు. నిర్మ‌ల్ జిల్లాలో ఏర్పాటు చేసిన రైతు గ‌ర్జ‌న స‌భ‌లో కేటీఆర్ ప్ర‌సంగిస్తూ ఈ వ్యాఖ్య‌లు చేశారు.

రైతు స‌మ‌స్య‌ల‌ను రేవంత్ రెడ్డి ప‌ట్టించుకోవ‌డం లేదు. పంట‌ల‌కు నీళ్లు ఇవ్వ‌డం లేదు కానీ.. కేటీఆర్ గ‌డ్డం పెంచుకున్నాడు.. ఆ గ‌డ్డం మీద ఆయ‌న‌కు బాగా ఫిక‌ర్ ఉంది. న‌క్క పులిని చూసి వాత‌లు పెట్టుకుంటే పులి కాద‌ట‌. నేను రేవంత్ రెడ్డి లాగా కావాల‌నుకుంటున్నాన‌ట‌. మీలో ఎవ‌ర‌న్న రేవంత్ రెడ్డి లాగా కావాల‌ని కోరుకుంటున్నారా..? ఆయ‌న లాగా తిట్లు తినాల‌ని కోరుకుంటున్నారా..? ఎవ‌డ‌న్న బుద్ది ఉన్నోడు కోరుకుంటారా.. ఆయ‌న‌ను తిట్టే తిట్ల‌కు ఇంకోడు అయితే బ‌కెట్లో నీళ్లు తోడ్కొని స‌చ్చిపోతుండే. ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు.. నేను ఆయ‌న‌ను న‌క‌లు కొడుతున్నాన‌ట అని కేటీఆర్ పేర్కొన్నారు.

Advertisement
Advertisement