DK Shivakumar | షాకింగ్.. కర్ణాటక సీఎంపై చెప్పులు విసిరిన మహిళలు
DK Shivakumar | హసనాంబ ఆలయ సందర్శన సందర్భంగా కర్ణాటక ముఖ్యంమత్రి డీకే శివకుమార్ (DK Shivakumar)కు చేదు అనుభవం ఎదురైంది. సీఎం ఆలయానికి వచ్చిన నేపథ్యంలో క్యూ లైన్‌లోని సాధారణ భక్తుల ప్రవేశాన్ని అధికారులు తాత్కాలికంగా నిలిపివేయడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గర్భగుడిలో సీఎం పూజలు చేస్తున్న దృశ్యాలు టీవీ స్క్రీన్‌పై కనిపించగానే చెప్పులు విసిరారు (slippers hurled at TV screen).
DK Shivakumar | త్రినేత్ర న్యూస్ : దీపావళి పండుగను పురస్కరించుకొని కర్ణాటక ముఖ్యంమత్రి డీకే శివకుమార్ (DK Shivakumar) ఆలయ పర్యటన వివాదాస్పదమైంది. ఆలయంలో ముఖ్యమంత్రి ప్రత్యేక పూజల కోసం సాధారణ క్యూ లైన్‌లోని భక్తుల ప్రవేశాన్ని తాత్కాలికంగా నిలిపివేడంతో భక్తులు ఆగ్రహానికి గురయ్యారు. సీఎం పూజలు చేస్తున్న దృశ్యాలు ఆలయ పరిసరాల్లో ఏర్పాటు చేసిన బిగ్ స్క్రీన్‌పై దర్శనమిచ్చాయి. ఆ దృశ్యాలను చూసిన జనం ఆగ్రహంతో ఊగిపోయారు. చెప్పులతో టీవీ స్క్రీన్‌పై దాడి చేశారు (slippers hurled at TV screen).
ఇంతకీ ఏం జరిగిందంటే.. సీఎం డీకే తన భార్య ఉషతో కలిసి ఆదివారం మధ్యాహ్నం హసన్‌లోని ప్రసిద్ధ హసనాంబ ఆలయాన్ని సందర్శించారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ముఖ్యమంత్రి దంపతులు ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అప్పటికే స్వామివారి దర్శనం కోసం చాలా మంది భక్తులు క్యూలైన్‌లో వేచి ఉన్నాయి. అయితే, సీఎం దర్శనం పూర్తయ్యే వరకూ సాధారణ క్యూ లైన్‌లోని భక్తుల ప్రవేశాన్ని అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు.
గంటల తరబడి సుదీర్ఘ క్యూలైన్‌లో వేచి ఉన్న భక్తులు, ముఖ్యంగా మహిళలు దర్శనాలను అర్ధంతరంగా నిలిపివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో గర్భగుడిలో సీఎం పూజలు చేస్తున్న దృశ్యాలు క్యూలైన్ సమీపంలో ఏర్పాటు చేసిన టీవీ స్క్రీన్‌పై ప్రసారమయ్యాయి. ఆ దృశ్యాలను చూసిన భక్తులకు కోపం కట్టలు తెంచుకుంది.
పలువురు మహిళలు భక్తులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారంటూ సీఎం తీరును బహిరంగంగానే విమర్శించారు. ఈ క్రమంలోనే సహనం కోల్పోయిన కొందరు భక్తులు తాము ఇక్కడ ఇబ్బందులు పడుతుంటే సీఎంకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తారా..? అంటూ తమ కాళ్లకు ఉన్న చెప్పులను తీసి ఆ టీవీ స్క్రీన్‌పైకి విసిరారు. సీఎంకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Angry devotees waiting in long queues at Hasanamba Temple in Hassan “gifted” CM DK Shivakumar a special Diwali present yesterday they threw slippers at the LED screen showing his VIP darshan after his visit allegedly delayed ordinary devotees for hours.
VIP culture at temples continues to spark outrage.
#HasanambaTemple #DKShivakumar #VIPDarshan— ಸನಾತನ (सनातन) (@sanatan_kannada) November 9, 2026
Also Read..
టపాసులు కాల్చడం వల్ల అనేక వ్యాధులు నయమవుతాయి.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
రాష్ట్రాన్ని ఎండవెట్టిన దుర్మార్గునివి నువ్.. కరువు తెచ్చిన ప్రథమ ముద్దాయివి
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Congress Zero Seats MLC Polls | బ్యాలెట్ సమరంలో ‘హస్తం’ విలవిల.. 4 రాష్ట్రాలు.. 28 స్థానాలు.. కాంగ్రెస్ ‘జీరో’
అక్టోబర్ 28, 2026

Karnataka Legislative Council elections | శాసన మండలి ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కోలుకోలేని దెబ్బ.. నాలుగు స్థానాలను క్లీన్‌స్వీప్ చేసిన ఎన్డీయే
అక్టోబర్ 28, 2026

HD Kumaraswamy | మా కుటుంబాన్ని అంతం చేసేందుకు కుట్ర.. రూ.600 కోట్లతో డీల్.. సీఎం డీకేపై కేంద్ర మంత్రి సంచలన ఆరోపణలు
అక్టోబర్ 26, 2026
తాజావార్తలు
- ●KA Paul | రేవంత్ రెడ్డిని సీఎం పదవి నుంచి దించుతా : కేఏ పాల్
- ●Devireddy Sudheer Reddy | రాష్ట్రాన్ని ఎండవెట్టిన దుర్మార్గునివి నువ్.. కరువు తెచ్చిన ప్రథమ ముద్దాయివి
- ●Patnam Narender Reddy | ప్రజా పాలనే కదా..! భయమెందుకు రేవంత్ రెడ్డి..!!
- ●Egg Chicken Price Increase | కోడిగుడ్లు, చికెన్ ధరలు జెట్ స్పీడ్.. కొండెక్కుతున్న ధరల వెనుక అసలు రహస్యం ఇదే!
- ●Papiya Adhikari | టపాసులు కాల్చడం వల్ల అనేక వ్యాధులు నయమవుతాయి.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
- ●Ponnam Prabhakar | ఎన్నికల వరకే రాజకీయాలు : మంత్రి పొన్నం ప్రభాకర్

KA Paul | రేవంత్ రెడ్డిని సీఎం పదవి నుంచి దించుతా : కేఏ పాల్

Devireddy Sudheer Reddy | రాష్ట్రాన్ని ఎండవెట్టిన దుర్మార్గునివి నువ్.. కరువు తెచ్చిన ప్రథమ ముద్దాయివి

Patnam Narender Reddy | ప్రజా పాలనే కదా..! భయమెందుకు రేవంత్ రెడ్డి..!!

Egg Chicken Price Increase | కోడిగుడ్లు, చికెన్ ధరలు జెట్ స్పీడ్.. కొండెక్కుతున్న ధరల వెనుక అసలు రహస్యం ఇదే!



