Gold And Silver Prices Today | వారాంతంలో బులియన్ మార్కెట్లకు స్వల్ప ఊరట.. దేశీయంగా ప్రతికూల సంకేతాలు..
Gold And Silver Prices Today | గత వారం రోజులుగా దేశీయ, అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో తీవ్ర అమ్మకాల ఒత్తిడి నెలకొనగా సూచీలు భారీగా పతనమయ్యాయి. అమెరికా ట్రెజరీ బాండ్ ఈల్డ్స్ రాబడి పెరగడం, పెరుగుతున్న ముడి చమురు ధరలు, పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న యుద్ధ ఉద్రిక్తతలు అన్నీ మార్కెట్ల పతనానికి కారణం అయ్యాయి.
Gold And Silver Prices Today | గత వారం రోజులుగా దేశీయ, అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో తీవ్ర అమ్మకాల ఒత్తిడి నెలకొనగా సూచీలు భారీగా పతనమయ్యాయి. అమెరికా ట్రెజరీ బాండ్ ఈల్డ్స్ రాబడి పెరగడం, పెరుగుతున్న ముడి చమురు ధరలు, పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న యుద్ధ ఉద్రిక్తతలు అన్నీ మార్కెట్ల పతనానికి కారణం అయ్యాయి. అయితే వారాంతంలో స్వల్ప కొనుగోళ్లు చోటు చేసుకోవడంతో అన్ని మార్కెట్లకు కాస్త ఊరట లభించింది. అయినప్పటికీ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలే ఎదురవుతున్నాయి. అందువల్ల కొత్తగా పెట్టుబడి పెట్టేవారు కొంత కాలం వేచి చూస్తే మంచిదని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఇక అంతర్జాతీయ బులియన్ మార్కెట్లలో శనివారం ఔన్స్ బంగారం ధర 0.27 శాతం పెరిగి 4,286 డాలర్లకు చేరగా, వెండి ధర 0.71 శాతం పెరిగి 64 డాలర్లకు వచ్చింది. వారాంతంలో వచ్చిన కొనుగోళ్లతో బులియన్ మార్కెట్లలోనూ సందడి నెలకొంది. దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 171 పాయింట్లు పెరిగి 1,50,881 వద్ద స్థిరపడగా, సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 1214 పాయింట్లు పెరిగి 2,34,696 వద్ద నిలిచింది. ఇక దేశీయ స్పాట్ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,268 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,22, 144 గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,52,680 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.15,26,800 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.1,600 తగ్గింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.13,995 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,11,960గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,39,950 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.13,99,500గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.1,500 తగ్గింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.11,451 ఉండగా, 8 గ్రాముల ధర రూ.91,608గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,14,510 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.11,45,100గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.1,200 తగ్గింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.2,45,000 ఉండగా, తులం ధర రూ.2,450గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2,50,000 ఉండగా, తులం ధర రూ.2,500 గా ఉంది.
సంబంధిత వార్తలు

Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో కొనసాగుతున్న అనిశ్చితి.. ఈక్విటీ మార్కెట్లలో పాజిటివ్ సంకేతాలు..
సెప్టెంబర్ 25, 2026

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.15వేలు తగ్గిన పసిడి ధర.. ఇన్వెస్టర్లకు కీలక హెచ్చరిక..
సెప్టెంబర్ 24, 2026

Gold And Silver Prices Today | బంగారం ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు.. జాగ్రత్త అంటున్న నిపుణులు..
సెప్టెంబర్ 23, 2026
తాజావార్తలు
- ●Dividend Income | డివిడెండ్ల ద్వారా వచ్చే ఆదాయంపై పన్ను ఉంటుందా.. రీఫండ్ పొందవచ్చా..?
- ●Uttam Kumar Reddy | ఈసీ స్వతంత్రతే ప్రజాస్వామ్య పరిరక్షణకు పునాది: మంత్రి ఉత్తమ్
- ●NDA | ఎన్నికల సంఘంలో అంతర్గత విభేదాలు.. అనుమానాలు తీర్చాలంటున్న ఎన్డీఏ పక్షాలు
- ●SIP | నెలకు రూ.25 వేల ఎస్ఐపీ.. 10 ఏళ్లలో ఎంత సంపద? స్టెప్అప్తో భారీ తేడా..
- ●iPhone 17 Pro | ఐఫోన్ 17 ప్రొ పై భారీ డిస్కౌంట్.. రూ.56,990కే..
- ●వరంగల్ నుంచి బీజేపీ బిగ్ ప్లాన్.. మధుకర్, దశరథ్కు కీలక బాధ్యతలు!

Dividend Income | డివిడెండ్ల ద్వారా వచ్చే ఆదాయంపై పన్ను ఉంటుందా.. రీఫండ్ పొందవచ్చా..?

Uttam Kumar Reddy | ఈసీ స్వతంత్రతే ప్రజాస్వామ్య పరిరక్షణకు పునాది: మంత్రి ఉత్తమ్

NDA | ఎన్నికల సంఘంలో అంతర్గత విభేదాలు.. అనుమానాలు తీర్చాలంటున్న ఎన్డీఏ పక్షాలు

SIP | నెలకు రూ.25 వేల ఎస్ఐపీ.. 10 ఏళ్లలో ఎంత సంపద? స్టెప్అప్తో భారీ తేడా..



