Dasoju Sravan | గాదె కింద పందికొక్కుల కంటే హీనంగా వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కొల్లగొడుతున్నరు
మల్కం చెరువు, ఖాజాగూడల్లోని కోట్ల విలువైన ప్రభుత్వ, బీసీ స్టడీ సర్కిల్ భూములను బిల్డర్లకు కట్టబెట్టారని రేవంత్ ప్రభుత్వంపై దాసోజు శ్రవణ్ సంచలన ఆరోపణలు చేశారు.
సంక్షిప్త సారాంశం
మల్కం చెరువు వద్ద లిడ్‌క్యాప్‌కు చెందిన 6 ఎకరాలను ప్రముఖ బిల్డర్లకు, ఖాజాగూడలో బీసీ స్టడీ సర్కిల్ భూమిని శాస్ ఇన్‌ఫ్రాకు అక్రమంగా కట్టబెట్టారని ఆరోపణ. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలతోనే భూభారతి రికార్డులు మార్చి ప్రైవేటుపరం చేశారని దాసోజు ధ్వజమెత్తారు. పక్కనే ఉన్న 3 ఎకరాల ఎఫ్‌టీఎల్ (FTL) భూమి ఆక్రమణకు గురవుతున్నా హైడ్రా ఎందుకు చూసీచూడనట్లు వ్యవహరిస్తోందని నిలదీత. ఈ అక్రమాలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీలు విచారణ కోరుతూ సీఎస్, హైడ్రాకు లేఖలు రాసిన విషయాన్ని ప్రస్తావించారు.
- బిల్డర్లకు ప్రభుత్వ భూములు
- సొంత పార్టీ ఎమ్మెల్యేల లేఖలు
- హైడ్రా మౌనంపై ప్రశ్నలు
- మల్కం చెరువు, ఖాజాగూడ భూముల దోపిడీ
- అంతా సీఎం, ఆ మంత్రి కనుసన్నల్లోనే
- దాసోజు శ్రవణ్ తీవ్ర ఆరోపణలు
Dasoju Sravan | త్రినేత్ర న్యూస్ : హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ బుధవారం మీడియా సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం తోటమాలిలా ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సింది పోయి, గాదె కింద పందికొక్కుల కంటే హీనంగా వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కొల్లగొడుతోందని ఆయన ధ్వజమెత్తారు. ఈ మీడియా సమావేశంలో బీఆర్‌ఎస్ నేత కురువ విజయ్ కుమార్ కూడా పాల్గొన్నారు.
ఏక్తా మాల్ పేరుతో లిడ్‌క్యాప్ భూముల దోపిడీ
రాయదుర్గం మల్కం చెరువు ఎదురుగా ప్రభుత్వ రంగ సంస్థ లిడ్‌క్యాప్ (LIDCAP)కు చెందిన అత్యంత విలువైన 6 ఎకరాల స్థలాన్ని ‘ఏక్తా మాల్’ పేరుతో వంశీరామ్ బిల్డర్స్, అపర్ణ బిల్డర్స్‌కు కట్టబెట్టారని దాసోజు ఆరోపించారు. ప్రభుత్వ ప్రయోజనాల ముసుగులో ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రజాధనాన్ని దోచిపెడుతున్నారని ఆయన మండిపడ్డారు.

బీసీ స్టడీ సర్కిల్ భూముల అప్పగింత
గతంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఖాజాగూడలో నిరుపేద బీసీ విద్యార్థుల స్టడీ సర్కిల్ నిర్మాణం కోసం కేటాయించిన స్థలాన్ని నేడు ‘శాస్ ఇన్‌ఫ్రా’ (SAS Infra) అనే ప్రైవేట్ డెవలపర్‌కు ధారాదత్తం చేశారని విమర్శించారు. పక్కాగా ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న స్థలాన్ని ‘భూభారతి’ పోర్టల్‌లో మార్చింది ఎవరని ఆయన నిలదీశారు. సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలు లేకుండా ఇలాంటి భూమార్పిడులు సాధ్యమేనా అని ప్రశ్నించారు.
హైడ్రా ఎవరికి కొమ్ముకాస్తోంది?
ఈ ప్రాజెక్టు పక్కనే ఉన్న మరో 3 ఎకరాల చెరువు ఎఫ్‌టీఎల్ (FTL) స్థలాన్ని యథేచ్ఛగా ఆక్రమిస్తుంటే హైడ్రా (HYDRAA) కమిషనర్ ఎందుకు స్పందించడం లేదని దాసోజు ప్రశ్నించారు. పేద, మధ్యతరగతి ప్రజల నిర్మాణాలపై బుల్డోజర్లు నడిపించే హైడ్రా.. కార్పొరేట్ కంపెనీలు, బడా బిల్డర్లు చేస్తున్న అక్రమ ఆక్రమణలపై ఎందుకు కళ్లు మూసుకుందని నిలదీశారు.
బీసీ మంత్రుల మౌనంపై నిలదీత.. సొంత పార్టీ ఎమ్మెల్యేల లేఖలు
బీసీ బిడ్డల కోసం కేటాయించిన స్థలాలు అన్యాక్రాంతమవుతుంటే రాష్ట్రంలోని బీసీ మంత్రులు పొన్నం ప్రభాకర్, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా నిద్రలేచి బీసీల హక్కులను కాపాడాలని హితవు పలికారు. ఈ భూముల వ్యవహారంలో జరుగుతున్న అక్రమాలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS), సీసీఎల్‌ఏ (CCLA), హైడ్రా, సీఎండీలకు లిఖితపూర్వకంగా లేఖలు రాశారని, అలాగే ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ సైతం హైడ్రాకు లేఖ రాసి విచారణ డిమాండ్ చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
రాష్ట్రంలో ప్రభుత్వ భూముల దోపిడీని అంతర్జాతీయ పెట్టుబడుల ‘భారత్ సమ్మిట్’లో కూడా వివరిస్తారా అని దాసోజు ఎద్దేవా చేస్తూ, ఈ భూ కేటాయింపులపై ప్రభుత్వం తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Revanth Reddy interacts with probationary DSPs | ఏ ఉద్దేశంతో పోలీస్ శాఖలో చేరారో దాన్ని మరవొద్దు
నవంబర్ 10, 2026

Guduru Laxmi Narasimha Reddy | పట్టభద్రుల గొంతుకగా అసెంబ్లీలో పోరాడే అవకాశం ఇవ్వండి
నవంబర్ 10, 2026

TGPSC Group 1 Mains Controversy | శిక్షణలో 35% ట్రైనీ డీఎస్పీలు ఫెయిల్.. గ్రూప్-1 అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి
నవంబర్ 10, 2026
తాజావార్తలు
- ●Jagdeep Dhankhar | మాజీ ఉప రాష్ట్రపతి ధన్‌ఖడ్‌కు తీవ్ర అస్వస్థత.. ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలింపు
- ●Ramayana Real Locations | రావణుడితో పోరాడి జటాయువు కూలిన చోటు ఎక్కడుంది? రామాయణ కాలం నాటి నిజమైన లొకేషన్లివే!
- ●Regena Cassandrra | రీఎంట్రీకి రెజీనా మాస్టర్ ప్లాన్.. RXతో సాలిడ్ కమ్‌బ్యాక్‌కు రెడీ!
- ●Velama Bhavan | 16న తిరుమలలో వెలమ భవన్‌కు భూమిపూజ.. అందరూ ఆహ్వానితులే
- ●Fake High Court Orders India | షాకింగ్ రిపోర్ట్: నకిలీ హైకోర్టు ఆర్డర్లతో 129 బెట్టింగ్ వెబ్సైట్లు బ్లాక్
- ●Om Prakash Rajbhar | అఖిలేష్ అధికారంలోకి వస్తే రామమందిరంలో నమాజ్ చేయిస్తారు : యూపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

Jagdeep Dhankhar | మాజీ ఉప రాష్ట్రపతి ధన్‌ఖడ్‌కు తీవ్ర అస్వస్థత.. ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలింపు

Ramayana Real Locations | రావణుడితో పోరాడి జటాయువు కూలిన చోటు ఎక్కడుంది? రామాయణ కాలం నాటి నిజమైన లొకేషన్లివే!

Regena Cassandrra | రీఎంట్రీకి రెజీనా మాస్టర్ ప్లాన్.. RXతో సాలిడ్ కమ్‌బ్యాక్‌కు రెడీ!

Velama Bhavan | 16న తిరుమలలో వెలమ భవన్‌కు భూమిపూజ.. అందరూ ఆహ్వానితులే



