త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

DK Shivakumar | ట్రంప్ కూడా కాంగ్రెస్ ప‌థ‌కాల‌నే కాపీ కొడుతున్నారు.. డీకే శివ‌కుమార్ ఆసక్తిక‌ర‌ వ్యాఖ్య‌లు

DK Shivakumar | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం కాంగ్రెస్ సంక్షేమ ప‌థ‌కాల‌నే కాపీ కొడుతున్నార‌ని క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి డీకే శివ‌కుమార్ (DK Shivakumar) వ్యాఖ్యానించారు.

D

National | Published On Sep 15, 2026, 3.52 pm IST

DK Shivakumar | ట్రంప్ కూడా కాంగ్రెస్ ప‌థ‌కాల‌నే కాపీ కొడుతున్నారు.. డీకే శివ‌కుమార్ ఆసక్తిక‌ర‌ వ్యాఖ్య‌లు
Advertisement

DK Shivakumar | త్రినేత్ర‌.న్యూస్ : క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి డీకే శివ‌కుమార్ (DK Shivakumar) ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. కర్ణాటకలో త‌మ‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ గ్యారెంటీ పథకాలు అంతర్జాతీయ స్థాయిలో ప్రజాదరణ పొందాయని చెప్పారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సైతం త‌మ కాంగ్రెస్ పార్టీ సంక్షేమ విధానాల‌నే (Congress guarantees) అనుస‌రిస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్ రాష్ట్రాలు కాంగ్రెస్ సంక్షేమ పథకాలను ఇప్పటికే కాపీ చేశాయ‌ని.. ఇప్పుడు ఏకంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా కాంగ్రెస్ పార్టీ మోడల్‌ను అనుసరిస్తున్నార‌ని డీకే వ్యాఖ్యానించారు.

ఈ ఏడాది జరగనున్న మ‌ధ్యంత‌ర ఎన్నిక‌ల్లో రిప‌బ్లిక‌న్ పార్టీ అధికారంలోకి వ‌స్తే ప్ర‌తి అమెరిక‌న్ పౌరుడికి 5 వేల డాల‌ర్లు అందిస్తామంటూ ట్రంప్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన విష‌యం తెలిసిందే. ట్రంప్ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన డీకే.. "మీరు ఇది గమనించారా..? 5 వేల డాల‌ర్లు ఇస్తామంటూ ట్రంప్ ప్ర‌క‌టించారు. ఇప్పుడు ఎవరు ఎవరిని కాపీ చేస్తున్నారు..? మ‌న ఆలోచ‌నా విధానం కేవ‌లం భార‌త‌దేశానికే ప‌రిమితం కాలేదు. ప్ర‌పంచ‌మంతా పాకుతోంది. ఇదే కాంగ్రెస్ పార్టీ అస‌లు సిస‌లైన బ‌లం" అని డీకే పేర్కొన్నారు.

ట్రంప్ డివిడెండ్ 

సెప్టెంబర్ 9న డల్లాస్‌లో జరిగిన కార్య‌క్ర‌మంలో ట్రంప్‌ మాట్లాడుతూ.. న‌వంబ‌ర్‌లో జ‌రిగే మ‌ధ్యంత‌ర ఎన్నిక‌ల్లో రిప‌బ్లిక‌న్ పార్టీ అధికారంలోకి వ‌స్తే ప్ర‌తి వ‌యోజ‌న‌ పౌరుడికి 5,000 డాలర్లు (రూ.4.7 లక్షలు) ఇస్తామంటూ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన విష‌యం తెలిసిందే. దీన్ని ట్రంప్ డివిడెండ్‌గా అభివ‌ర్ణించారు. అమెరికాకు ట్రిలియన్ల కొద్దీ డాలర్లు వస్తున్నందున ఇది సాధ్య‌మేన‌ని వ్యాఖ్యానించారు. అయితే, ఈ మొత్తాన్ని అమెరికాలోనే ఖ‌ర్చు చేయాల‌ని స్ప‌ష్టం చేశారు. ట్రంప్ ప్ర‌క‌ట‌న‌పై అమెరికా కాంగ్రెస్‌లో భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

Also Read..

ఇమ్మిగ్రేషన్ తనిఖీల్లో భారీ వైఫల్యం.. ఎయిర్ ఇండియాకు షోకాజ్ నోటీసు

యూపీఐ లావాదేవీల‌పై ఛార్జీల వసూలుకు రంగం సిద్ధం : జైరామ్ ర‌మేష్

త‌ల్ల‌యిన త‌ర్వాత తొలిసారి కెమెరా ముందుకు క‌త్రినా కైఫ్ - బాడీ షేమింగ్ చేస్తూ నెటిజ‌న్ల ట్రోల్స్‌

Advertisement
Advertisement