Air India | ఇమ్మిగ్రేషన్ తనిఖీల్లో భారీ వైఫల్యం.. ఎయిర్ ఇండియాకు షోకాజ్ నోటీసు
Air India | ఢిల్లీ ఎయిర్‌పోర్టులో (Delhi Airport) భారీ భద్రతా వైఫల్యం బయటపడిన విషయం తెలిసిందే. ముగ్గురు విదేశీ పౌరులు ఎలాంటి ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ లేకుండానే భారత్ నుంచి విదేశాలకు వెళ్లిపోవడం సంచలనం సృష్టించింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన కేంద్రం.. ఎయిర్ ఇండియా (Air India) సంస్థకు షోకాజ్ నోటీసు జారీ చేసింది.
Air India | త్రినేత్ర.న్యూస్ : దేశ రాజధాని ఢిల్లీ ఎయిర్‌పోర్టులో (Delhi Airport) భారీ భద్రతా వైఫల్యం బయటపడింది. ఇమ్మిగ్రేషన్ నిబంధనల ఉల్లంఘన వెలుగు చూసింది. ముగ్గురు విదేశీ పౌరులు ఎలాంటి ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ లేకుండానే భారత్ నుంచి విదేశాలకు వెళ్లిపోవడం సంచలనం సృష్టించింది. ఈ ఘటనను కేంద్రం తీవ్రంగా పరిగణించింది. ఈ మేరకు వివరణ కోరుతూ ఎయిర్ ఇండియా (Air India) సంస్థకు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ షోకాజ్ నోటీసు జారీ చేసింది.
ఇంతకీ ఏం జరిగిందంటే..?
సెప్టెంబర్ 3, 4వ తేదీల మధ్య రాత్రి సమయంలో ఇటలీకి చెందిన ముగ్గురు విదేశీ పౌరులు అమృత్‌సర్ నుంచి AI-1115 విమానంలో ఢిల్లీకి ప్రయాణించారు. అక్కడి నుంచి లుఫ్తాన్సా (LH-763) విమానంలో కనెక్టింగ్ ఫ్లైట్ ద్వారా నేరుగా మ్యూనిచ్‌కు వెళ్లిపోయారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో జరగాల్సిన తప్పనిసరి ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ లేకుండానే ఆ ముగ్గురు విదేశీయులు దేశం విడిచి వెళ్లిపోయారు. నిబంధనల ప్రకారం విదేశాలకు వెళ్లే ప్రయాణికులకు అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది.
లగేజ్ చెక్ చేయడం, పాస్‌పోర్టు, ఇతర డాక్యుమెంట్లు పరిశీలించిన తర్వాతే సదరు వ్యక్తులను విదేశాలకు వెళ్లేందుకు అనుమతిస్తారు. అయితే, ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ముగ్గురు ఇటలీ ప్రయాణికులకు ఎలాంటి ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ రాలేదు. వారు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అరైవల్ ఏరియా ద్వారా బయటకు వచ్చి.. ఇమ్మిగ్రేషన్ కౌంటర్ వద్ద తనిఖీలు పూర్తి చేసుకోవాలి. కానీ ఎయిర్ ఇండియా సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా వారు ఎలాంటి ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్, పాస్‌పోర్ట్ స్టాంపింగ్ లేకుండానే నేరుగా మ్యూనిచ్ విమానం ఎక్కి భారత్ దాటి వెళ్లిపోయారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. విమానాశ్రయ భద్రతా వ్యవస్థపై తీవ్ర ఆందోళన రేకెత్తించింది. ఈ ఘటనపై కేంద్రం సీరియస్ అయ్యింది. 7 రోజుల్లోగా లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఎయిర్ ఇండియా సీఈఓను ఆదేశించింది.
Also Read..
యూపీఐ లావాదేవీలపై ఛార్జీల వసూలుకు రంగం సిద్ధం : జైరామ్ రమేష్
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●UPI Transaction Charges | కేంద్రం రహస్యంగా తలుపులు తెరిచింది
- ●KP Vivekananda | ఉన్న సిటీని అడ్డంగా దోచుకోవడానికే క్యూర్ చట్టం
- ●RS Praveen Kumar | ముసుగు వ్యక్తులు ఎవరు..? కచ్చితంగా కుట్రనే..!
- ●Jairam Ramesh | యూపీఐ లావాదేవీలపై ఛార్జీల వసూలుకు రంగం సిద్ధం : జైరామ్ రమేష్
- ●Advance Tax | వేతన జీవులు అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాలా.. అసలు విషయం తెలుసుకోండి..
- ●India New Zealand Trade Pact | అక్టోబర్ 19 నుంచి భారత్-న్యూజిలాండ్ చారిత్రక వాణిజ్య ఒప్పందం షురూ

UPI Transaction Charges | కేంద్రం రహస్యంగా తలుపులు తెరిచింది

KP Vivekananda | ఉన్న సిటీని అడ్డంగా దోచుకోవడానికే క్యూర్ చట్టం

RS Praveen Kumar | ముసుగు వ్యక్తులు ఎవరు..? కచ్చితంగా కుట్రనే..!

Jairam Ramesh | యూపీఐ లావాదేవీలపై ఛార్జీల వసూలుకు రంగం సిద్ధం : జైరామ్ రమేష్






