Jairam Ramesh | యూపీఐ లావాదేవీలపై ఛార్జీల వసూలుకు రంగం సిద్ధం : జైరామ్ రమేష్
Jairam Ramesh | గతంలో మోదీ ప్రభుత్వం (Modi government) పార్లమెంట్‌లో బలవంతంగా ఆమోదించుకున్న కొత్త చట్టాల ద్వారా యూపీఐ (UPI) లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరామ్ రమేష్ (Jairam Ramesh) ఆరోపించారు.
Jairam Ramesh | త్రినేత్ర.న్యూస్ : రూపే డెబిట్ కార్డులు, యూపీఐ (UPI) ద్వారా రూ. 2,000 లోపు చెల్లింపులపై బ్యాంకులు ఎలాంటి ఛార్జీలు విధించకూడదంటూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. కేంద్రం ప్రకటనతో పరిమితికి మించిన లావాదేవీలపై ఛార్జీల భారం పడుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం యూపీఐ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు లేకపోయినప్పటికీ.. తాజా ఉత్తర్వులు రూ. 2,000 పైబడిన అన్ని చెల్లింపులపై ఛార్జీలు విధించే వెసులుబాటును బ్యాంకులకు కల్పిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరామ్ రమేష్ (Jairam Ramesh) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తాము ఆగస్టు 6న హెచ్చరించినట్లుగానే.. గతంలో మోదీ ప్రభుత్వం పార్లమెంట్‌లో బలవంతంగా ఆమోదించుకున్న కొత్త చట్టాల ద్వారా యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టిందని ఆరోపించారు. రూ.2,000లోపు లావాదేవీలకు మాత్రమే రక్షణ కల్పిస్తూ.. అంతకంటే ఎక్కువ మొత్తాలపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని పేర్కొన్నారు. తద్వారా భవిష్యత్తులో రోజూ జరిగే వ్యక్తిగత లావాదేవీలపై కూడా ఛార్జీలు విధించే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేశ ప్రజల నమ్మకాన్ని ప్రభుత్వం వమ్ము చేసిందని విమర్శలు గుప్పించారు.
అమెరికా ఒత్తిడి వల్లే
భారత యూపీఐ (UPI), రూపే (RuPay) వ్యవస్థలు ఉచితంగా ఉన్నాయని, అవి వీసా, మాస్టర్‌కార్డ్ వంటి అమెరికన్ పేమెంట్ ప్లాట్‌ఫారమ్‌లను దెబ్బతీస్తున్నాయని 2026 నాటి యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ (USTR) నివేదిక తీవ్రంగా విమర్శించిందని జైరామ్ రమేష్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ నివేదిక, అమెరికా ఒత్తిడికి తలొగ్గి మోదీ సర్కార్ యూపీఐ విధానాన్ని నీరుగార్చుతోందని ఆరోపించారు. పార్లమెంటులో తీసుకువచ్చిన సవరణల ద్వారా యూపీఐ లావాదేవీలపై ఉన్న చట్టబద్ధమైన 'జీరో-ఫీ' రక్షణను తొలగించిందని ఆరోపించారు. అమెరికన్ పేమెంట్ కంపెనీలకు భారత డిజిటల్ మార్కెట్‌ను తెరిచేందుకు, డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగాన్ని ప్రసన్నం చేసుకునేందుకే మోదీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని విమర్శించారు.
Also Read..
అంతరిక్షంలోనూ మా ఆయుధాలు ఉన్నాయ్.. అమెరికా బహిరంగ ప్రకటన
విషాదం.. రైల్వే ట్రాక్‌పై కూర్చుని ప్రాణాలు పోగొట్టుకున్న జంట : VIDEO
నన్ను అసెంబ్లీకి రానివ్వండి.. 22ఏ పై అన్ని ఆధారాలతో మాట్లాడతా
తాజావార్తలు
- ●Madhavaram Krishna Rao | నన్ను అసెంబ్లీకి రానివ్వండి.. 22ఏ పై అన్ని ఆధారాలతో మాట్లాడతా
- ●Digangana | బాలీవుడ్ సినిమాకు రైటర్‌గా టాలీవుడ్ హీరోయిన్ - డైరెక్టర్‌గా పుష్ప కొరియోగ్రాఫర్
- ●Alla Nani | ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత
- ●Bajaj Holdings | బజాజ్ హోల్డింగ్స్ భారీ డివిడెండ్.. ఒక్కో షేరుకు రూ.65..
- ●US Space Force | అంతరిక్షంలోనూ మా ఆయుధాలు ఉన్నాయ్.. అమెరికా బహిరంగ ప్రకటన
- ●Revanth meets Prince Rahim Aga khan-V | తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు రండి.. ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్-Vను కోరిన సీఎం రేవంత్

Madhavaram Krishna Rao | నన్ను అసెంబ్లీకి రానివ్వండి.. 22ఏ పై అన్ని ఆధారాలతో మాట్లాడతా

Digangana | బాలీవుడ్ సినిమాకు రైటర్‌గా టాలీవుడ్ హీరోయిన్ - డైరెక్టర్‌గా పుష్ప కొరియోగ్రాఫర్

Alla Nani | ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత

Bajaj Holdings | బజాజ్ హోల్డింగ్స్ భారీ డివిడెండ్.. ఒక్కో షేరుకు రూ.65..






