త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Katrina Kaif | త‌ల్ల‌యిన త‌ర్వాత తొలిసారి కెమెరా ముందుకు క‌త్రినా కైఫ్ – బాడీ షేమింగ్ చేస్తూ ట్రోల్స్‌

గ‌త ఏడాది న‌వంబ‌ర్‌లో త‌ల్లిగా ప్ర‌మోష‌న్ పొందింది బాలీవుడ్ హీరోయిన్ క‌త్రినా కైఫ్‌. దాదాపు ప‌ది నెల‌ల గ్యాప్ త‌ర్వాత ఫ‌స్ట్ టైమ్ మీడియా ముందుకొచ్చింది. సోమ‌వారం అంబానీ ఇంటిలో జ‌రిగిన వినాయ‌క చ‌వితి వేడుక‌ల్లో భ‌ర్త విక్కీ కౌశ‌ల్‌తో క‌లిసి క‌త్రినాకైఫ్ పాల్గొన్న‌ది. ఈ వీడియోలో గుర్తుప‌ట్ట‌లేని విధంగా క‌నిపించింది.

N

Entertainment | Published On Sep 15, 2026, 3.36 pm IST

Katrina Kaif | త‌ల్ల‌యిన త‌ర్వాత తొలిసారి కెమెరా ముందుకు క‌త్రినా కైఫ్ – బాడీ షేమింగ్ చేస్తూ  ట్రోల్స్‌
Advertisement

Katrina Kaif |గ‌త ఏడాది న‌వంబ‌ర్‌లో త‌ల్లిగా మారింది బాలీవుడ్ హీరోయిన్ క‌త్రినాకైఫ్‌. బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన త‌ర్వాత ఇంటికే ప‌రిమిత‌మైంది. సోష‌ల్ మీడియా త‌న‌కు సంబంధించిన‌ ఎలాంటి ఫొటోలు పోస్ట్ చేయ‌లేదు. ఏ ఈవెంట్‌ల‌లో క‌నిపించ‌లేదు. దాదాపు ప‌ది నెల‌ల విరామం త‌ర్వాత ఫ‌స్ట్ టైమ్ కెమెరా ముందుకొచ్చింది.

అంబానీ వినాయ‌క‌చ‌వితి...

సోమ‌వారం పారిశ్రామిక వేత్త ముఖేష్ అంబానీ ఇంట వినాయ‌క‌చ‌వితి వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. బాలీవుడ్ సినీ , క్రీడా ప్ర‌ముఖుల‌తో అంబానీ ఇల్లు క‌ళ‌క‌ళ‌లాడింది ఈ వినాయ‌క చ‌వితి వేడుక‌ల్లో భ‌ర్త విక్కీ కౌశ‌ల్‌తో క‌లిసి క‌త్రినా కైఫ్ పాల్గొన్న‌ది. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోన్నాయి.

గుర్తుప‌ట్ట‌లేనంత‌గా...

వీటిలో క‌త్రినాకైఫ్‌గుర్తుప‌ట్ట‌లేని విధంగా మారిపోయింది. బ‌రువు పెరిగింది. ముఖంలో కూడా చాలా మార్పులు క‌నిపిస్తున్నాయి. క‌త్రినాను చూసి నెటిజ‌న్లు షాక‌వుతున్నారు. ఒక‌ప్పుడు బాలీవుడ్‌లో మోస్ట్ గ్లామ‌ర‌స్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న క‌త్రినా కైఫ్ ఇంత‌లా మారిపోయిందేంటి అంటూ కామెంట్లు పెడుతోన్నారు. అలియాభ‌ట్‌, మ‌లైకా అరోరా, దీపికా ప‌డుకోణ్ పిల్ల‌లు పుట్టిన త‌ర్వాత కూడా గ్లామ‌ర్‌, ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటున్నార‌ని, క‌త్రినా కైఫ్ మాత్రం బొద్దుగుమ్మగా మారిపోయిందంటూ స్టార్ హీరోయిన్ల‌తో ఆమెను కంపేర్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. హీరోయిన్‌గా మ‌ళ్లీ రీఎంట్రీ ఇవ్వ‌డం క‌ష్ట‌మేన‌ని అంటున్నారు. క‌త్రినా వ‌య‌సు అయిపోయిందంటూ విమ‌ర్శిస్తున్నారు.

స‌పోర్ట్‌...

మ‌రికొంద‌రు ఫ్యాన్స్ మాత్రం క‌త్రినాకు స‌పోర్ట్‌గా నిలుస్తున్నారు. ప్ర‌స‌వం త‌ర్వాత మ‌హిళ‌ల శారీర‌క రూపంలో మార్పులు రావ‌డం స‌హ‌జ‌మ‌ని, బాడీ షేమింగ్‌కు పాల్ప‌డ‌టం స‌రికాదంటూ కామెంట్లు పెడుతోన్నారు. దీపికా ప‌డుకోణ్‌, అలియాభ‌ట్‌ల‌తో కంపేర్ చేయ‌డం క‌రెక్ట్ కాద‌ని, వారి కంటే క‌త్రినా కైఫ్ వ‌య‌సులో పెద్ద‌ద‌ని అంటున్నారు. నెటిజ‌న్ల కామెంట్లు వైర‌ల్ అవుతోన్నాయి.

చివ‌ర‌గా హిందీలో మెర్రీ క్రిస్మ‌స్ సినిమా చేసింది క‌త్రినా కైఫ్‌. 2024లో రిలీజైన ఈ మూవీలో విజ‌య్ సేతుప‌తి హీరోగా న‌టించాడు. బాలీవుడ్ హీరో విక్కీ కౌశ‌ల్‌ను ప్రేమించిన‌ క‌త్రినా కైఫ్ 2021లో అత‌డిని పెళ్లిచేసుకుంది.

;

Advertisement
Advertisement