త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rajya Sabha | న‌డ్డా Vs ఖ‌ర్గే.. సీజేపీ ఆందోళ‌న‌ల్లో పోలీసుల బ‌ల‌ప్ర‌యోగంపై భ‌గ్గుమ‌న్న రాజ్య‌స‌భ‌

Rajya Sabha | నీట్ పేప‌ర్ లీక్ (NEET Paper Leak) ఘ‌ట‌న‌కు నిర‌స‌న‌గా కాక్రోచ్ జ‌న‌తాపార్టీ (Cockroach Janta Party) చేప‌ట్టిన‌ పార్లమెంట్ మార్చ్‌ సందర్భంగా విద్యార్థి నిరసనకారులపై పోలీసులు జరిపిన లాఠీఛార్జ్ వివాదం రాజ్యసభ (Rajya Sabha)ను కుదిపేస్తోంది.

D

National | Published On Jul 29, 2026, 12.46 pm IST

Rajya Sabha | న‌డ్డా Vs ఖ‌ర్గే.. సీజేపీ ఆందోళ‌న‌ల్లో పోలీసుల బ‌ల‌ప్ర‌యోగంపై భ‌గ్గుమ‌న్న రాజ్య‌స‌భ‌
Advertisement

Rajya Sabha | నీట్ పేప‌ర్ లీక్ (NEET Paper Leak) ఘ‌ట‌న‌కు నిర‌స‌న‌గా కాక్రోచ్ జ‌న‌తాపార్టీ (Cockroach Janta Party) చేప‌ట్టిన‌ పార్లమెంట్ మార్చ్‌ సందర్భంగా విద్యార్థి నిరసనకారులపై పోలీసులు జరిపిన లాఠీఛార్జ్ వివాదం రాజ్యసభ (Rajya Sabha)ను కుదిపేస్తోంది. ఈ అంశంపై ఎగువ స‌భ‌లో కేంద్ర మంత్రి జేపీ న‌డ్డా (JP Nadda), కాంగ్రెస్ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున ఖ‌ర్గే (Mallikarjun Kharge) మధ్య మాట‌ల యుద్ధం చోటు చేసుకుంది.

బాధ్యుల‌పై చ‌ర్చ‌లు తీసుకోవాలి

స‌భ‌లో చ‌ర్చ సంద‌ర్భంగా సీజేపీ ఆందోళ‌న‌ల్లో విద్యార్థి నిర‌స‌న‌కారుల‌పై పోలీసుల చ‌ర్య‌ల‌ను ఖ‌ర్గే తీవ్రంగా ఖండించారు. ఈ మేర‌కు శాంతియుతంగా నిర‌స‌న తెలుపుతున్న విద్యార్థుల‌పై జ‌రిగిన పోలీసుల దౌర్జ‌న్యాల అంశాన్ని ఖ‌ర్గే స‌భ‌లో లేవ‌నెత్తారు. కేంద్ర ప్ర‌భుత్వంపై తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. బాధ్యులైన అధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు.

అమిత్ షా ప్ర‌క‌ట‌న చేయాలి

విద్యార్థులపై దాడి చేసిన వారు స్వేచ్ఛగా తిరుగుతున్నార‌ని చెప్పారు. ప్ర‌జలు సుర‌క్షితంగా లేర‌ని, ప్ర‌జాస్వామ్యం కూడా సుర‌క్షితంగా లేద‌ని ఖ‌ర్గే అన్నారు. ఆ స‌మ‌యంలో ప్ర‌తిప‌క్ష స‌భ్యులు స‌భ‌లో గంద‌ర‌గోళం సృష్టించారు. సీజేపీ కార్య‌కర్తలు, విద్యార్థుల‌పై జ‌రిగిన లాఠీఛార్జ్ అంశంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స‌భ‌కు వ‌చ్చి ప్ర‌క‌ట‌న చేయాల‌ని డిమాండ్ చేశారు. లాఠీఛార్జ్‌కు ఆదేశించిన పోలీసు అధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

ఎమ‌ర్జెన్సీ స‌మ‌యంలో నేనూ అరెస్ట‌య్యా : న‌డ్డా

విప‌క్షాల ఆందోళ‌న‌ల‌కు కేంద్ర మంత్రి జేపీ న‌డ్డా గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చారు. ఇది సాధార‌ణ‌ శాంతి భ‌ద్ర‌త‌ల స‌మ‌స్య అని అన్నారు. ప‌రిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు చ‌ట్ట‌బ‌ద్ధంగానే వ్య‌వ‌హ‌రించార‌ని పేర్కొన్నారు. ఏ విద్యార్థి అయినా నిరసనల్లో పాల్గొన్నప్పుడు ఇలాంటి శాంతిభద్రతల పరిస్థితులను ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని చెప్పారు. ప్రతిపక్షాలు ఈ అంశాన్ని అన‌వ‌స‌రంగా సంచలనం సృష్టిస్తున్నాయని మండిప‌డ్డారు. ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్ ప్ర‌భుత్వం విధించిన ఎమ‌ర్జెన్సీ రోజుల‌ను న‌డ్డా గుర్తు చేశారు. ఆ రోజుల్లో విద్యార్థి ఉద్య‌మాల్లో పాల్గొన్న‌ప్పుడు తాను అరెస్టైన విష‌యాన్ని ఉద‌హ‌రించారు. “ఎమర్జెన్సీ కాలంలో విద్యార్థి ఉద్యమ సమయంలో నేను అరెస్టయ్యాను. ఏ విద్యార్థి కార్యకర్త అయినా ఈ ప‌రిస్థితిని ఎదుర్కొంటాడు. ఇది చాలా సాధారణ పరిస్థితి” అని ఆయన అన్నారు.

Also Read..

ప్ర‌ధాని మోదీపై అభ్యంతరకర పోస్టులు.. సోష‌ల్ మీడియా ఖాతాల‌కు ఢిల్లీ పోలీసులు నోటీసులు

బ్లాక్‌సీలో ఉద్రిక్త‌త.. కార్గో నౌక‌లో చిక్కుకుపోయిన 13 మంది భార‌తీయ నావికులు

పీవోకే నిర‌స‌న‌కారులు కూడా భారత్‌లాంటి శత్రువులే.. పాక్ ర‌క్ష‌ణ మంత్రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Advertisement
Advertisement