Russia-Ukraine War | బ్లాక్‌సీలో ఉద్రిక్తత.. కార్గో నౌకలో చిక్కుకుపోయిన 13 మంది భారతీయ నావికులు
Russia-Ukraine War | నల్లసముద్రం సమీపంలోని చోర్నోమోర్స్క్ పోర్టు (Chornomorks Port) ప్రాంతంలో డ్రోన్లు, క్షిపణులతో భీకర దాడులు జరిగాయి. ఈ దాడుల్లో పోర్టులోని M.V. AMIR1 కార్గో నౌక (Cargo ship) చిక్కుకుపోయింది. దాదాపు 13 మంది భారతీయ నావికులు (Indian seafarers) సహా మొత్తం 15 మంది సిబ్బంది ఆ సరకు రవాణా నౌకలో చిక్కుకుపోయినట్లు ఫార్వర్డ్ సీమెన్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (FSUI) తెలిపింది.
Russia-Ukraine War | రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు (Russia-Ukraine War) కొనసాగుతున్నాయి. తాజాగా నల్లసముద్రం సమీపంలోని చోర్నోమోర్స్క్ పోర్టు (Chornomorks Port) ప్రాంతంలో డ్రోన్లు, క్షిపణులతో భీకర దాడులు జరుగుతున్నాయి. ఈ దాడుల్లో పోర్టులోని M.V. AMIR1 కార్గో నౌక (Cargo ship) చిక్కుకుపోయింది. దాదాపు 13 మంది భారతీయ నావికులు (Indian seafarers) సహా మొత్తం 15 మంది సిబ్బంది ఆ సరకు రవాణా నౌకలో చిక్కుకుపోయినట్లు ఫార్వర్డ్ సీమెన్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (FSUI) తెలిపింది.
వారంతా భయానక, ప్రాణాంతక పరిస్థితిలో చిక్కుకున్నారని తెలిపింది. ‘నౌక సమీపంలో పదేపదే డ్రోన్, క్షిపణి దాడులు జరుగుతున్నాయి. ఏ క్షణంలోనైనా నౌకపై నేరుగా దాడి జరగవచ్చనే భయంతో సిబ్బంది బిక్కుబిక్కుమంటున్నారు’ అని FSUI ఎక్స్ వేదికగా పేర్కొంది. సిబ్బందిని తక్షణమే కాపాడి వారిని స్వదేశానికి తరలించే ఏర్పాట్లు చేయాలని భారత ప్రభుత్వం.. నౌక యాజమాన్యం, ఇతర అధికారులను కోరింది.
ఈ ఘటనపై ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. నౌకలోని భారతీయుల రక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ ప్రకటన విడుదల చేసింది. తాజా పరిస్థితికి సంబంధించి తాము సంబంధిత అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు ఎంబసీ పేర్కొంది. "భారతీయ నావికులు ఉన్న MV AMIR1 నౌక గురించి మా దృష్టికి వచ్చింది. నౌకలో ఉన్న భారతీయులందరి భద్రతను నిర్ధారించడానికి సంబంధిత అధికారులందరితో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాము" అని ప్రకటనలో తెలిపింది.
కాగా, ఇటీవలే ఉక్రెయిన్ తీర ప్రాంతాల్లో వాణిజ్య నౌకలపై వరుస దాడులు కొనసాగుతున్నాయి. ఓడెసా సమీపంలో ‘ఎంవీ ఓమోర్ఫీ’ నౌకపై జరిగిన దాడిలో ఓ భారతీయ నావికుడు మృతి చెందిన విషయం తెలిసిందే. మరో ఘటనలో ‘ఎంవీ ఏజీఎన్ రాగ్నర్’ నౌకపై దాడి జరగగా.. పలువురు సిబ్బంది గల్లంతయ్యారు. ఇలా వరుస దాడులతో బ్లాక్‌సీ ప్రాంతం వాణిజ్య నౌకలకు అత్యంత ప్రమాదకరంగా మారింది. ముఖ్యంగా భారతీయ నావికుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది.
A situation regarding MV AMIR1 with Indian seafarers onboard has been brought to our attention. We attach the highest priority to this and are in constant touch with all concerned to ensure safety and security of all Indians onboard. @MEAIndia
— India in Ukraine (@IndiainUkraine) July 29, 2026
Also Read..
పీవోకే నిరసనకారులు కూడా భారత్‌లాంటి శత్రువులే.. పాక్ రక్షణ మంత్రి సంచలన వ్యాఖ్యలు
ఉపాధ్యాయ నియామక పరీక్ష పేపర్ లీక్.. 30 మంది అభ్యర్థుల నుంచి 1.2 కోట్లు వసూలు చేసిన డాక్టర్..
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. పెట్టుబడిదారులకు లక్కీ చాన్స్..
సంబంధిత వార్తలు

Ukraine Biggest Attack | మాస్కోపై 1,600కుపైగా డ్రోన్లతో విరుచుకుపడిన ఉక్రెయిన్..!
సెప్టెంబర్ 20, 2026

Vladimir Putin | వారి వల్లే ఉక్రెయిన్‌తో యుద్ధం కొనసాగుతోంది : పుతిన్
సెప్టెంబర్ 12, 2026

Moscow Drone Attack | మాస్కోపై ఉక్రెయిన్ ప్రతీకారం: వందలాది డ్రోన్లతో భీకర దాడి.. మంటల్లో రష్యా ‘అమెజాన్’ గోదాం!
ఆగస్టు 16, 2026
తాజావార్తలు
- ●IPL 2027 | ఫ్లెమింగ్ శకం ముగిసింది. సీఎస్కే కొత్త హెచ్కోచ్గా జహీర్ ఖాన్..!
- ●Krithi Shetty | జనవరి 12 విడుదల సెట్స్‌లో కృతిశెట్టి బర్త్‌డే సెలబ్రేషన్స్
- ●Snapana Tirumanjanam | ముత్యాల మాలలు, పంచామృతాభిషేఖాలు.. శ్రీవారికి వైభవంగా స్నపన తిరుమంజనం
- ●Vakiti Srihari | ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు సన్నద్ధమవుతున్నాం
- ●Ayodhya Ram Temple Donation Theft | పాపం మహమ్మద్ గజనీ భారతదేశంపై దండెత్తి దోచుకుంది కేవలం 17 సార్లే
- ●ACB Raids | 15 వేలకు కక్కుర్తి పడి.. ఏసీబీ వలకు చిక్కి

IPL 2027 | ఫ్లెమింగ్ శకం ముగిసింది. సీఎస్కే కొత్త హెచ్కోచ్గా జహీర్ ఖాన్..!

Krithi Shetty | జనవరి 12 విడుదల సెట్స్‌లో కృతిశెట్టి బర్త్‌డే సెలబ్రేషన్స్

Snapana Tirumanjanam | ముత్యాల మాలలు, పంచామృతాభిషేఖాలు.. శ్రీవారికి వైభవంగా స్నపన తిరుమంజనం

Vakiti Srihari | ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు సన్నద్ధమవుతున్నాం



