Jitendra Singh | విదేశీ నిధులు, పాక్‌తో సంబంధాలు.. సీజేపీ నేతలపై కేంద్రం సంచలన ఆరోపణలు
Jitendra Singh | కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janta Party)కి భారత వ్యతిరేక శక్తుల నుంచి నిధులు అందుతున్నాయని (illegal funds) కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. ఆ పార్టీ నేతలకు పాక్ రాజకీయ నేతలతో సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన బలమైన ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పారు.
Jitendra Singh | త్రినేత్ర న్యూస్ : కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janta Party)పై కేంద్ర ప్రభుత్వం సంచలన ఆరోపణలు చేసింది. భారత్‌లో (India) అశాంతి సృష్టించేందుకు సీజేపీకి, పార్టీ ప్రధాన నిర్వాహకులకు విదేశీ శక్తుల నుంచి అక్రమంగా నిధులు (illegal funds) అందుతున్నాయని తెలిపింది. సీజేపీ నేతలకు పాక్ నాయకులతో సంబంధాలు ఉన్నాయంటూ సంచలన ఆరోపణలు చేసింది.
కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ (Jitendra Singh) బెంగళూరులో విలేకరులతో మాట్లాడుతూ ఈ ఆరోపణలు చేశారు. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే (Abhijeet Dipke)కు అమెరికాకు చెందిన దాతల నుంచి నిధులు అందాయని, కో-ఫౌండర్ ఆశుతోష్ రంకాకు (Ashutosh Ranka) పాకిస్థాన్ రాజకీయ నాయకులు, హ్యాండ్లర్ల నుంచి ఆర్థిక సాయం అందిందని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన బలమైన ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పారు. "దేశ, విదేశాల్లోని భారత వ్యతిరేక సంస్థలతో సహా అనధికారిక మార్గాల నుంచి వీరికి నిధులు అందుతున్నాయి. దిప్కేకి అమెరికా నుంచి నిధులు అందుతుండగా.. రంకాకు పాక్ రాజకీయ నాయకుల నుంచి ఆర్థిక సాయం అందుతోంది. సీజేపీ నేతలు విదేశీ మార్గాల నుంచి డబ్బు పొందుతున్నారని నిరూపించడానికి బలమైన ఆధారాలు కూడా ఉన్నాయి" అని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.
అయితే, కేంద్ర మంత్రి ఆరోపణలను సీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. కేంద్ర మంత్రి జవాబూదారీతనం లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అత్యున్నత పదవుల్లో ఉన్నవారి మాటలకు ఈరోజుల్లో ఎలాంటి విలువ లేకుండా పోయిందని వ్యాఖ్యానించింది. ప్రభుత్వం కేవలం ఆరోపణలు చేయడమే తప్ప తమ వద్ద ఆధారాలు ఉంటే చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని సీజేపీ నేతలు ప్రశ్నించారు.
Also Read..
ఢిల్లీలో కూలిన మూడంతస్తుల భవనం.. ఇద్దరు మృతి
భర్త జీతం రూ.40 లక్షలు.. అయినా భార్యకు భరణం పొందే హక్కు లేదు : హైకోర్టు
సోషల్ మీడియాలో బాలల లైంగిక వేధింపుల కంటెంట్.. మెటాపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు
తాజావార్తలు
- ●Market Volatility | మార్కెట్ ఒడిదుడుకులు.. ఈక్విటీ, బంగారం, డెట్, రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు ఎలా పెట్టాలి?
- ●DSC | 2721 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్.. ఈ నెల 11 నుంచి దరఖాస్తులు
- ●Building Collapsed | ఢిల్లీలో కూలిన మూడంతస్తుల భవనం.. ఇద్దరు మృతి
- ●Tirupati Laddu Adulteration Case | ఇంకో రాష్ట్రానికి బదిలీ చేయలేం.. తిరుపతి లడ్డూ కల్తీ కేసులో ‘సుప్రీం’ తీర్పు
- ●Karnataka High Court | భర్త జీతం రూ.40 లక్షలు.. అయినా భార్యకు భరణం పొందే హక్కు లేదు : హైకోర్టు
- ●KTR | 3,300 పైచిలుకు స్టార్టప్లకు అండగా టీ హబ్ : కేటీఆర్

Market Volatility | మార్కెట్ ఒడిదుడుకులు.. ఈక్విటీ, బంగారం, డెట్, రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు ఎలా పెట్టాలి?

DSC | 2721 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్.. ఈ నెల 11 నుంచి దరఖాస్తులు

Building Collapsed | ఢిల్లీలో కూలిన మూడంతస్తుల భవనం.. ఇద్దరు మృతి

Tirupati Laddu Adulteration Case | ఇంకో రాష్ట్రానికి బదిలీ చేయలేం.. తిరుపతి లడ్డూ కల్తీ కేసులో ‘సుప్రీం’ తీర్పు






