Delhi High Court | ఫ్రాన్స్‌లో ఏం జరుగుతోందో చూస్తున్నాం కదా..?
Delhi High Court | కాక్రోచ్ జనతా పార్టీ (CJP) కీలక నేతలు సౌరవ్ దాస్ (Saurav Das), అశుతోష్ రంకా (Ashutosh Ranka)లను ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) తీవ్రంగా మందలించింది. జంతర్ మంతర్ ఇక నిరసన ప్రదేశం కాదంటూ డీనోటిఫై చేసిన తర్వాత కూడా నేతలు అక్కడికి ఎందుకు వెళ్లారని ధర్మాసనం ప్రశ్నించింది. నిరసనకు పోలీసు అనుమతుల వెనకున్న ఉద్దేశం ఆందోళనకారులను అడ్డుకోవడానికి మాత్రమే కాదని జస్టిస్ సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.
- సీజేపీ నేతలపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం
- పోలీసులు బారికేడ్లను రోడ్డుపై ఊరికే పెట్టరు
- వాటిని మీరు బద్దలు కొడితే ఎలా..
- మీరు అసలు జెన్‌జీనే కాదు
Delhi High Court | త్రినేత్ర న్యూస్ : కాక్రోచ్ జనతా పార్టీ (CJP) కీలక నేతలు సౌరవ్ దాస్ (Saurav Das), అశుతోష్ రంకా (Ashutosh Ranka)ల అరెస్ట్‌కు సంబంధించిన కేసు విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) బుధవారం కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ ఇద్దరు నేతలను న్యాయస్థానం తీవ్రంగా మందలించింది. నిరసనకు పోలీసు అనుమతుల వెనకున్న ఉద్దేశం ఆందోళనకారులను అడ్డుకోవడానికి మాత్రమే కాదని జస్టిస్ సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. జాతి వ్యతిరేక శక్తులు విద్యార్థి గుంపులో చేరి విధ్వంసం సృష్టించకుండా నిరోధించడానికి కూడా పోలీసులు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారని పేర్కొంది.
జంతర్ మంతర్ వద్దకు ఎందుకెళ్లారు..?
నేటితో ముగియనున్న తమ జ్యుడీషియల్ కస్టడీని రెండు రోజులు పొడిగిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ సీజేపీ నేతలు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసంది. జంతర్ మంతర్ (Jantar Mantar) ఇక నిరసన ప్రదేశం కాదంటూ డీనోటిఫై చేసిన తర్వాత కూడా నేతలు అక్కడికి ఎందుకు వెళ్లారని ధర్మాసనం ప్రశ్నించింది. పోలీసులు బారికేడ్లను రోడ్డుపై ఊరికే పెట్టరని వ్యాఖ్యానించింది. దాని వెనుక ఓ బలమైన ఉద్దేశం ఉంటుందని వివరించింది. విద్యార్థులు బలప్రయోగం చేసి బారికేడ్లను బద్దలు కొడితే.. సంఘ వ్యతిరేక శక్తులు గుంపులో చేరి విధ్వంసం సృష్టించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ సందర్భంగా ఫ్రాన్స్‌లో (France) జరుగుతున్న విద్యార్థి నిరసనలను ధర్మాసనం ఉదహరించింది.
ఫ్రాన్స్ అగ్నిగుండంగా మారడం చూస్తున్నాం కదా
"మన దేశం బయట కూడా (ఫ్రాన్స్ అల్లర్లను ఉద్దేశిస్తూ) ఇటువంటి పరిణామాలనే మనం చూస్తున్నాం. మొదట విద్యార్థుల సారథ్యంలో మొదలైన నిరసనలు చివరకు తీవ్ర రూపం దాల్చాయి. అనేక నగరాల్లో అల్లర్లు చెలరేగాయి. ఫ్రాన్స్‌లోని అనేక ప్రాంతాలను నిరసనకారులు అగ్నిగుండంగా మార్చారు. షాపుల్లో లూటీలు జరుగుతున్నాయి. ఇలాంటివి జరగకుండా ఉండేందుకే పోలీసు అనుమతులు అవసరం. ఇది మిమ్మల్ని ఆపడానికి మాత్రమే కాదు. దేశంలో విధ్వంసాన్ని అడ్డుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది" అని కోర్టు సీజేపీ నేతలకు మొట్టికాయలు వేసింది.
మీరు జెన్ జీ కాదు
ఈ సందర్భంగా సౌరవ్ దాస్, అశుతోష్ రంకా వయసును ఉద్దేశించి ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. మీరు ఏ వయసుకు చెందినవారు..? అంటూ ప్రశ్నించింది. సౌరవ్ వయసు 27 ఏళ్లు, అశుతోష్ వయసు 32 ఏళ్లు అని తెలుసుకున్న ధర్మాసనం.. మీరు జెన్ జీ కాదు అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది.
పిటిషన్ ఉపసంహకరణ
ప్రత్యామ్నాయ చట్టపరమైన మార్గాలను ఆశ్రయించకుండా నేరుగా హైకోర్టును ఎందుకు ఆశ్రయించారంటూ సీజేపీ నేతలను కోర్టు నిలదీసింది. అదేవిధంగా చట్టబద్ధమైన నిబంధనలను పాటించకుండా కోర్టుల నుంచి ఉపశమనం ఎలా కోరతారంటూ ప్రశ్నించింది. దీంతో కోర్టు అనుమతితో అశుతోశ్ రంకా, సౌరవ్ దాస్ తమ పిటిషన్లను ఉపసంహకరించుకున్నారు.
Also Read..
చిన్నారులను బలవంతంగా ముద్దుపెట్టుకోవడం ప్రేమ అనిపించుకోదు.. ముంబై కోర్టు సంచలన తీర్పు
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హన్సిక - డీ గ్లామర్ లుక్‌లో కోలీవుడ్ బ్యూటీ
సంబంధిత వార్తలు

MP Laxman | విదేశీ ఫండింగ్‌తో దేశంలో అరాచకం..
అక్టోబర్ 21, 2026

Donald Trump | మాక్రాన్ వల్లే ఈ పరిస్థితి.. పారిస్ ఒక ముస్లిం నగరంగా మారబోతోంది : ట్రంప్
అక్టోబర్ 20, 2026

London Parliament Square Protest | లండన్‌లో హైడ్రామా: సీఈసీకి వ్యతిరేకంగా ధ్రువ్ రాఠీ స్పీచ్.. పోటీగా ‘మోదీ.. మోదీ’ నినాదాలు!
అక్టోబర్ 18, 2026
తాజావార్తలు
- ●MP Laxman | విదేశీ ఫండింగ్‌తో దేశంలో అరాచకం..
- ●Hansika | గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హన్సిక - డీ గ్లామర్ లుక్‌లో కోలీవుడ్ బ్యూటీ
- ●PPF Interest Rate | పీపీఎఫ్ వడ్డీ రేటు 7.1 శాతం.. ఇప్పుడు పెట్టుబడి పెట్టాలా?
- ●Niranjan Reddy | మంత్రి జూపల్లి సవాల్‌కు నిరంజన్ రెడ్డి సిద్దం
- ●Supreme Court | ఏపీ మున్సిపల్ ఎన్నికలపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు
- ●Lava Aura Curve 5G | లావా ఆరా కర్వ్ 5జి వచ్చేసింది.. ధర రూ.23,999..

MP Laxman | విదేశీ ఫండింగ్‌తో దేశంలో అరాచకం..

Hansika | గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హన్సిక - డీ గ్లామర్ లుక్‌లో కోలీవుడ్ బ్యూటీ

PPF Interest Rate | పీపీఎఫ్ వడ్డీ రేటు 7.1 శాతం.. ఇప్పుడు పెట్టుబడి పెట్టాలా?

Niranjan Reddy | మంత్రి జూపల్లి సవాల్‌కు నిరంజన్ రెడ్డి సిద్దం



