త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Annamalai | సీజేపీకి ఎప్పటికీ మద్దతు ఇవ్వబోం.. ప్ర‌భుత్వ త‌ప్పుల‌ను ఎత్తి చూపుతాం : అన్నామ‌లై

Annamalai | దేశంలో కాక్రోచ్ జ‌త‌నాపార్టీకి (Cockroach Janta Party) తాము ఎప్ప‌టికీ మ‌ద్ద‌తు ఇవ్వ‌బోమ‌ని వీ ద లీడ‌ర్స్ సంస్థ వ్య‌వ‌స్థాప‌కుడు, త‌మిళ‌నాడు బీజేపీ మాజీ నేత కే అన్నామ‌లై (Annamalai) తేల్చి చెప్పారు. ప్రజాస్వామ్యంలో నిర‌స‌న తెలిపే హ‌క్కు ప్ర‌తీ ఒక్క‌రికీ ఉంద‌ని స్ప‌ష్టం చేశారు.

D

National | Published On Oct 23, 2026, 12.14 pm IST

Annamalai | సీజేపీకి ఎప్పటికీ మద్దతు ఇవ్వబోం.. ప్ర‌భుత్వ త‌ప్పుల‌ను ఎత్తి చూపుతాం : అన్నామ‌లై
Advertisement

Annamalai | త్రినేత్ర న్యూస్ : వీ ద లీడ‌ర్స్ సంస్థ వ్య‌వ‌స్థాప‌కుడు, త‌మిళ‌నాడు బీజేపీ మాజీ నేత కే అన్నామ‌లై (Annamalai) కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. దేశంలో కాక్రోచ్ జ‌త‌నాపార్టీకి (Cockroach Janta Party) తాము ఎప్ప‌టికీ మ‌ద్ద‌తు ఇవ్వ‌బోమ‌ని తేల్చి చెప్పారు (Will never support CJP). ఆ పార్టీ ఎజెండా వేరని, తమ లక్ష్యాలు వేరని చెప్పారు. అయితే, ప్రజాస్వామ్యంలో నిర‌స‌న తెలిపే హ‌క్కు ప్ర‌తీ ఒక్క‌రికీ ఉంద‌ని స్ప‌ష్టం చేశారు.

కాగా, గురువారం వీ ద లీడర్స్ (We the Leaders) ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కన్నమలై.. కేంద్ర ప్ర‌భుత్వ తీరుపై, సీజేపీ నిర‌స‌న‌ల‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. ఎన్డీయే స‌ర్కార్ దేశంలో 12 ఏళ్లుగా అధికారంలో ఉన్నా.. ఇప్పటికీ శత్రువులను సృష్టించుకోవాల్సి వస్తోందని విమర్శించారు. ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరసనల పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరును తీవ్రంగా తప్పుపట్టారు. నిరసనకారులపై పోలీస్‌ బలగాలను ప్రయోగించడం, ముందస్తు నిర్బంధాలు, నిరసనల అణచివేతకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను ఖండించారు.

చ‌ట్ట‌ప్ర‌కారం చ‌ర్య‌లు ఉండాలి

అదే స‌మ‌యంలో బీజేపీపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. దేశభక్తి గురించి తనకు ఎవరూ పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో నివ‌సించాన‌ని, అనేక ప్రాంతాల్లో పనిచేసిన అనుభవం తనకు ఉందని చెప్పారు. భారత ఐక్యత, సార్వభౌమత్వం గురించి తనకు బాగా తెలుసున‌ని పేర్కొన్నారు. సీజేపీ నిరసనకారులు ఏదైనా తప్పు చేసి ఉంటే.. కక్షసాధింపు ధోరణిని అవలంబించకుండా చట్టప్రకారమే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని స్ప‌ష్టం చేశారు.

"దేశ సార్వభౌమత్వానికి ముప్పు ఉంటే ఇంటెలిజెన్స్ బ్యూరో (IB), రా (RAW) వంటి సంస్థలు ఉన్నాయి. వాటిని ఉపయోగించుకోండి. తప్పు చేసిన వారెవ‌రైనా స‌రే వ‌దిలిపెట్టొద్దు. చ‌ట్ట‌ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకోవాలి" అని స్ప‌ష్టం చేశారు. ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టు వంటి అత్యున్నత ప్రజాస్వామ్య వ్యవస్థలపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసే ప్రయత్నాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని తేల్చి చెప్పారు.

మోదీ మంచి ప్ర‌ధానే.. త‌ప్పుల‌ను కూడా ఎత్తిచూపుతాం

ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi)పై అన్నామ‌లై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. మోదీ ఒక మంచి ప్ర‌ధాని అని.. ఆయ‌న మంచి ప‌నులు చేస్తూ ప్ర‌జ‌ల‌కు అద్భుతమైన పాల‌న అందిస్తున్నార‌ని కొనియాడారు. అయితే, ప్ర‌ధానికి మ‌ద్ద‌తు ఇస్తూనే.. తప్పుల‌ను ఎత్తిచూప‌డంలోనూ వెనుకాడ‌బోమ‌ని స్ప‌ష్టం చేశారు.

ఆయ‌న వ్యాఖ్య‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో తీవ్ర చ‌ర్చ‌కు దారితీశాయి. అన్నామ‌లై వ్యాఖ్య‌ల‌పై బీజేపీ నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మైంది. ఈ నేప‌థ్యంలో తాజాగా త‌న వ్యాఖ్య‌ల‌పై ఆయ‌న స్ప‌ష్ట‌త‌నిచ్చారు. అభిజీత్ దిప్కే నేతృత్వంలోని సీజేపీకి మద్దతు ఇస్తున్నట్లుగా తన మాటలను భావించవద్దని ఆయన స్పష్టం చేశారు. సీజేపీ తాము ఎప్ప‌టికీ మ‌ద్ద‌తు ఇవ్వ‌బోమ‌ని తేల్చి చెప్పారు.

Also Read..

భానుడి భ‌గ‌భ‌గ‌లు.. 50 వేల మంది మృత్యువాత‌.. వాతావరణ మార్పులే కారణమంటున్న ప‌రిశోధ‌కులు

సీనియర్ అధికారిపై ఇద్ద‌రు ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్లు ఫిర్యాదు.. ప‌ట్టించుకోని కేబినెట్ కార్య‌ద‌ర్శి

నాడు సిగాచి.. నేడు సరాక.. కార్మికుల ప్రాణాలను బలితీసుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం: హ‌రీశ్ రావు

Advertisement
Advertisement