Kangana Ranaut | బొద్దింకలు మురికి కాలువల నుంచేగా వస్తాయి.. నేనన్నదాంట్లో తప్పేముంది..? : కంగన
Kangana Ranaut | జెన్ జెడ్ నిరసనకారుల్ని జనరేషన్ గట్టర్ (gutter)గా అభివర్ణించడాన్ని బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ (Kangana Ranaut) సమర్థించుకున్నారు. తాను అన్నదాంట్లో తప్పేముంది..? అంటూ ప్రశ్నించారు. అయినా తన వ్యాఖ్యలు యువత అందరినీ ఉద్దేశించి చేసినవి కావని.. కేవలం తమను తాము బొద్దింకలము అని చెప్పుకునే కొందరు వ్యక్తులను ఉద్దేశించి మాత్రమేనని స్పష్టం చేశారు.
Kangana Ranaut | త్రినేత్ర.న్యూస్ : జెన్‌జీ (Gen Z)ని ఉద్దేశించి బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ (Kangana Ranaut) చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే. జెన్ జెడ్ నిరసనకారుల్ని జనరేషన్ గట్టర్ (gutter)గా అభివర్ణించారు. ఆమె వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున దుమారం రేగింది. ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలను కంగన సమర్థించుకున్నారు. తాను అన్నదాంట్లో తప్పేముంది..? అంటూ ప్రశ్నించారు. అయినా తన వ్యాఖ్యలు యువత అందరినీ ఉద్దేశించి చేసినవి కావని.. కేవలం తమను తాము బొద్దింకలము అని చెప్పుకునే కొందరు వ్యక్తులను ఉద్దేశించి మాత్రమేనని స్పష్టం చేశారు.
“ఎవరైతే తమను తాము బొద్దింకలుగా పిలుచుకుంటున్నారో వారి గురించి మాత్రమే నేను మాట్లాడాను. బొద్దింకలు (Cockroaches) సహజంగానే మురికికాలువల నుంచే వస్తాయి కద. మరి నేను అన్నదాంట్లో తప్పేముంది..? నా ఉద్దేశం స్పష్టంగా ఉంది. కొందరు తమను తాము బొద్దింకలుగా చెప్పుకుంటున్నారు. అలాంటప్పుడు మురికికాలువలే వారి ఇల్లు అని మేము అంటే వారికెందుకు అంత కోపం..? యవత మొత్తాన్ని ఉద్దేశించి నేను ఆ వ్యాఖ్యలు చేశాను అని అనడం సరికాదు” అని కంగన వ్యాఖ్యానించారు. అదే సమయంలో తనను తాను బొద్దింకగా ఎప్పుడూ భావించుకోనని పేర్కొన్నారు. ఒకవేళ ఎవరైనా తనను గట్టర్‌లో నివసిస్తానని అంటే దాన్ని తీవ్రంగా ఖండిస్తానని స్పష్టం చేశారు.
జెన్ జెడ్‌ను ఉద్దేశించి కంగన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. జెన్ జెడ్ నిరసనకారుల్ని జనరేషన్ గట్టర్‌గా అభివర్ణించారు. నిరసనకారులు ఓ మురికి కాలువ లాంటివారన్నారు. నీట్ ప్రొటెస్ట్ వీడియోలు చూస్తే వాంతి వచ్చేలా ఉన్నాయన్నారు. తన జీవితంలో ఒకే దగ్గర ఇంత కంపును ఎప్పుడూ చూడలేదంటూ సంచలన కామెంట్స్ చేశారు. ఇప్పుడు వారు దేశానికే బలం అంటూ వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది.
Also Read..
ఇండియన్ బ్యాంకులో 700 గ్రాముల బంగారం చోరీ.. సొంతానికి వాడుకున్న అసిస్టెంట్ మేనేజర్
నటి షకీలాకు సర్జరీ - స్మార్ట్‌ఫోన్‌కు బానిసగా మారి.... మెడ నరాలు దెబ్బతిని..
సంబంధిత వార్తలు

Kangana Ranaut | టార్గెట్ ఎప్పుడూ మహిళే.. ఆ ధోరణి ఎప్పుడు మారుతుందో..? : త్రిష వివాదంపై కంగన రనౌత్
సెప్టెంబర్ 8, 2026

Kangana Ranaut | పనికిమాలిన మాటలు వద్దు.. మీ వల్లే నా పనితీరుపై విమర్శలు.. మండి అధికారులపై కంగన ఆగ్రహం
సెప్టెంబర్ 5, 2026

Etala Rajendar | దేశం విచ్ఛిన్నం కావాలని.. ఎన్నో దేశాలు సీజేపీకి నిధులిస్తున్నయ్
ఆగస్టు 30, 2026
తాజావార్తలు
- ●80s Vibes | సోషల్ మీడియాని షేక్ చేస్తున్న 80s ట్రెండ్.. వింటేజ్ లుక్‌లో ప్రధాని మోదీ, రాహుల్..
- ●Power problem in Konda Reddy Pally | కరెంటే లేని పల్లె.. కొండారెడ్డి పల్లె
- ●Apple iPhone 18 Pro | ఐఫోన్ 18 ప్రొ సిరీస్ వచ్చేసింది.. ధర రూ.1.64 లక్షల నుంచి..
- ●Students Attack | 30 మందితో వచ్చి.. ప్రిన్సిపాల్ ముందే విద్యార్థిని చితకబాదారు..
- ●MK Stalin | తమ్ముడు విజయ్.. మీరు చెప్పింది నిజమే.. పోలీసుల దాష్టీకానికి నా దవడ పగిలింది : ఎంకే స్టాలిన్
- ●Balmoor Venkat | బీఆర్ఎస్ నేతలు బుద్ధి మార్చుకోకపోతే.. ప్రజలే మిమ్మల్ని శుద్ధి చేస్తారు: ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్

80s Vibes | సోషల్ మీడియాని షేక్ చేస్తున్న 80s ట్రెండ్.. వింటేజ్ లుక్‌లో ప్రధాని మోదీ, రాహుల్..

Power problem in Konda Reddy Pally | కరెంటే లేని పల్లె.. కొండారెడ్డి పల్లె

Apple iPhone 18 Pro | ఐఫోన్ 18 ప్రొ సిరీస్ వచ్చేసింది.. ధర రూ.1.64 లక్షల నుంచి..

Students Attack | 30 మందితో వచ్చి.. ప్రిన్సిపాల్ ముందే విద్యార్థిని చితకబాదారు..



