త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Shakeela | న‌టి ష‌కీలాకు స‌ర్జ‌రీ – స్మార్ట్‌ఫోన్‌కు బానిస‌గా మారి…. మెడ న‌రాలు దెబ్బ‌తిని..

సీనియ‌ర్ న‌టి ష‌కీలా స‌ర్జ‌రీ జ‌రిగింది. స్మార్ట్ ఫోన్‌కు బానిస‌గా మారిన ష‌కీలా తీవ్ర అనారోగ్యానికి గురైంది. మెడ‌లోని న‌రాలు దెబ్బ‌తిన‌డంతో వైద్యులు ఆమెకు స‌ర్జ‌రీ చేశారు. ష‌కీలా కోలుకోవ‌డానికి చాలా కాలం ప‌డుతుంద‌ని వైద్యులు వెల్ల‌డించిన‌ట్లు స‌మాచారం.

N

Entertainment | Published On Aug 13, 2026, 10.38 am IST

Shakeela | న‌టి ష‌కీలాకు స‌ర్జ‌రీ – స్మార్ట్‌ఫోన్‌కు బానిస‌గా మారి…. మెడ న‌రాలు దెబ్బ‌తిని..
Advertisement

Shakeela | సీనియ‌ర్ న‌టి ష‌కీలా అనారోగ్యానికి గుర‌య్యింది. ఆమెకు స‌ర్జ‌రీ జ‌రిగింది. మెడ‌లోని ప్ర‌ధాన న‌రాలు దెబ్బ‌తిన‌డంతో ఇటీవ‌లే తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురైంది ష‌కీలా. ఆమెను స‌న్నిహితులు హాస్పిట‌ల్‌లో చేర్పించారు. ఆరోగ్య ప‌రిస్థితి విష‌మంగా మార‌డంతో ఇటీవ‌లే వైద్యులు ష‌కీలాకు స‌ర్జ‌రీ చేశారు. ఆమె కోలుకోవ‌డానికి చాలా కాలం ప‌డుతుంద‌ని స‌మాచారం.

స్మార్ట్ ఫోన్ వాడ‌కం వ‌ల్లే...

త‌న ఆరోగ్య ప‌రిస్థితిపై ష‌కీలా రియాక్ట్ అయ్యింది. అతిగా స్మార్ట్ ఫోన్ వాడ‌టం వ‌ల్లే న‌రాల సంబంధిత స‌మ‌స్య బారిన ప‌డిన‌ట్లు చెప్పింది. సినిమాల‌కు లేక చాలా కాలంగా ఇంటికే ప‌రిమిత‌మ‌య్యాన‌ని, ఒంట‌రిదానిని కావ‌డంతో స్మార్ట్‌ఫోన్‌లో గంట‌ల త‌ర‌బ‌డి రీల్స్ చూడ‌టం, గేమ్స్ ఆడ‌టం అల‌వాటుగా మారిపోయింద‌ని అన్న‌ది. ఆ ఎఫెక్ట్ మెడ‌లోని న‌రాల‌పై ప‌డింద‌ని అన్న‌ది. త‌న స‌ర్జ‌రీకి మూడు ల‌క్ష‌ల‌కుపైనే ఖ‌ర్చ‌యిన‌ట్లు ఆవేద‌న‌ను వ్య‌క్తం చేసింది. అవ‌స‌రానికి మించి స్మార్ట్ ఫోన్ల‌ను ఉప‌యోగించ‌డం మంచిది కాద‌ని అన్న‌ది.

సూప‌ర్ స్టార్‌గా...

మ‌ల‌యాళంలో శృంగార ప్ర‌ధాన సినిమాలో ష‌కీలా కెరీర్ ప్రారంభ‌మైంది. 1990 ద‌శ‌కంలో మ‌ల‌యాళంలో సూప‌ర్ స్టార్‌గా వెలుగువెలిగింది. ఆమె సినిమాల‌కు పోటీగా అగ్ర హీరోలు త‌మ సినిమాల‌కు విడుద‌ల చేయ‌డానికి భ‌య‌ప‌డేవారు. నితిన్ హీరోగా న‌టించిన జ‌యం సినిమాతో క‌మెడియ‌న్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ త‌ర్వాత కీలు గుర్రం, నిజం, బంగారం, క‌రెంట్‌తో పాటు మ‌రికొన్ని సినిమాలు చేసింది. మ‌ల‌యాళం, తెలుగుతో పాటు త‌మిళం, క‌న్న‌డ భాష‌ల్లో ష‌కీలా సినిమాలు చేసింది.

 

Advertisement
Advertisement